The Biography Of Mokshagundam Visvesvarayya Who Was An Indian Famous Engineer And Worked As Diwan Of Mysore

Mokshagundam visvesvarayya biography famous indian engineer mysore diwan

Mokshagundam Visvesvarayya biography, Mokshagundam Visvesvarayya life story, Mokshagundam Visvesvarayya history, Mokshagundam Visvesvarayya wikipedia, Mokshagundam Visvesvarayya wiki telugu, indian famous engineers, bharat ratna awards

Mokshagundam Visvesvarayya Biography Famous Indian Engineer Mysore Diwan : The Biography Of Mokshagundam Visvesvarayya Who Was An Indian Famous Engineer And Worked As Diwan Of Mysore.

వరదల నుంచి హైదరాబాద్ ను రక్షించడానికి కృషి చేసిన ఇంజనీర్

Posted: 09/15/2015 03:36 PM IST
Mokshagundam visvesvarayya biography famous indian engineer mysore diwan

దేశంలో పేరుగాంచిన ప్రముఖ ఇంజనీర్ లలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒకరు. ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఈయన.. ఉన్నత చదువులు అభ్యసించి ప్రజలకు అనుగుణంగా ఎన్నో సంస్థలు నిర్వహించారు. టెక్నాలజీ ఇంకా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో మెరుగైన ప్రతిభను కనబరిచారు. ఆనాడు హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి రక్షించడానికి ఈయన ఒక వ్యవస్థను రూపొందించారు. దాంతో ఆయనకు గొప్ప పేరొచ్చింది. అంతేకాదు.. విశాఖపట్నం రేవును సముద్రపు కోత నుంచి రక్షించే వ్యవస్థను రూపొందించడంలోనూ మోక్షగుండం పాత్ర వుంది.

జీవిత విశేషాలు :

1860 సెప్టెంబర్ 15వ తేదీన బెంగుళూరు నగరానికి 40 మైళ్ళ దూరంలోని ముద్దెనహళ్ళి గ్రామంలో శ్రీనివాస శాస్త్రి, వెంకాయమ్మ దంపతులకు మోక్షగుండం జన్మించారు. చిక్కబళ్ళాపూరులో ప్రాథమిక విద్య, బెంగుళూరులో ఉన్నతవిద్య పూర్తి చేసారు. 1881లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి.ఏ., తరువాత పుణె సైన్సు కాలేజి నుండి సివిల్ ఇంజనీరింగు ఉత్తీర్ణుడయ్యారు.

సివిల్ ఇంజనీరింగ్ లో ఉత్తీర్ణులైన అనంతరం ఈయన బొంబాయి ప్రజాపనుల శాఖలో చేరారు. ఆ తరువాత భారత నీటిపారుదల కమిషనులో చేరవలసిందిగా ఆయనకు ఆహ్వానం అందింది. ఈ క్రమంలోనే ఆయన దక్కను ప్రాంతంలో చక్కని నీటిపారుదల వ్యవస్థను రూపొందించాడు. ఒక ఆటోమాటిక్ వరద గేట్ల వ్యవస్థను ఆయన రూపొందించాడు. 1903లో మొదటిసారిగా దీనిని పుణె దగ్గరి ఖడక్‌వాస్లా వద్ద నెలకొల్పారు. వరద సమయంలో ఆనకట్ట భద్రతను దృష్టిలో ఉంచుకుంటూనే అత్యధిక నీటి నిల్వ చేసే విధానం ఇది. హైదరాబాదు నగరాన్ని వరదల నుండి రక్షించడానికి ఒక వ్యవస్థను రూపొందించినపుడు, ఆయనకు గొప్ప పేరు వచ్చింది. విశాఖపట్నం రేవును సముద్రపు కోత నుండి రక్షించే వ్యవస్థను రూపొందించడంలో కూడా ఆయన పాత్ర ఉంది.

1908లో స్వఛ్చంద పదవీ విరమణ తరువాత, మైసూరు సంస్థానంలో దివానుగా చేరి సంస్థాన అభివృద్ధికి కృషి చేసారు. ఆ సమయంలోనే బ్రిటిషు ప్రభుత్వం ఈయనకు ‘నైట్‌హుడ్’ (సర్) బిరుదు ప్రసాదించింది. 1917లో బెంగుళూరులో ప్రభుత్వ ఇంజనీరింగు కాలేజి స్థాపించడంలో ప్రముఖ పాత్ర వహించారు. మైసూరు విశ్వవిద్యాలయం నెలకొల్పటంలో కూడా ఆయన పాత్ర ఉంది. 1955లో భారతదేశపు అత్యంత గొప్ప పురస్కారం ‘భారతరత్న’ వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mokshagundam Visvesvarayya  Indian Famous Engineers  

Other Articles