The Biography Of Kurumaddali Lakshmi Narasimha Rao A Famous Telugu Comedian Who Was Called As Suthi Velu

Kurumaddali lakshmi narasimha rao suthi velu biography telugu famous comedian

suthi velu history, suthi velu life story, suthi velu biography, kurumaddali lakshmi narasimha rao life story, telugu comedians, famous telugu comedians, suthi velu life history

Kurumaddali Lakshmi Narasimha Rao Suthi Velu Biography Telugu Famous Comedian : The Biography Of Kurumaddali Lakshmi Narasimha Rao A Famous Telugu Comedian Who Was Called As Suthi Velu.

‘సుత్తివేలు’గా ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ హాస్యనటుడు

Posted: 09/18/2015 05:30 PM IST
Kurumaddali lakshmi narasimha rao suthi velu biography telugu famous comedian

తెలుగు చలనచిత్ర రంగంలో పేరుగాంచిన ప్రముఖ హాస్యనటుల్లో కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు ఒకరు. 200కు పైగా సినిమాల్లో నటించిన ఈయన.. తన హాస్య ప్రతిభతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ప్రతిఒక్కరి మదిలో చెరగని చిరకాల గుర్తింపును ముద్రించారు. ‘సుత్తివేలు’గా ప్రఖ్యాతిగాంచిన ఈయనకు ఆ పేరు రావడం వెనుక ఓ కథ వుంది. ఈయన తన చిన్నతనంలో చాలా సన్నగా వుండేవాడు. దాంతో ఈయన పక్కింటి పిన్ని ‘వేలు’ అని పిలిచేది. ఇక ‘నాలుగు స్తంభాలాట’ చిత్రంలో ఈయన నటించిన పాత్ర పేరు ‘సుత్తి’. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో అందరూ ‘సుత్తివేలు’ అని పిలవడం ప్రారంభించారు.

జీవిత విశేషాలు :

1947 ఆగస్టు 7వ తేదీన కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలంలోని భోగిరెడ్డిపల్లిలో ఈయన జన్మించారు. ఈయనకు చిన్నప్పటి నుంచే నాటకాలంటే ప్రత్యేక ఆసక్తి వుండేది. 1966లో పి.యు.సి చదివిన అనంతరం, హైదరాబాదుకు చేరుకుని అక్కడ తాత్కాలిక ఉద్యోగం చేసేవారు. 1967లో ఉద్యోగం మారి బాపట్ల చేరుకున్నారు. అయితే.. ఈయనకు నాటకాలంటే ఎక్కువ మక్కువ వుండటం వల్ల తాను చేస్తున్న ఉద్యోగం మానేసి స్నేహితులతో నాటకాలు వేసేవారు. ఈ క్రమంలోనే 1981లో విశాఖ డాక్ యార్డులో శాశ్వత ఉద్యోగం రావడంతో అక్కడికి మకాం మార్చారు. అదే ఆయన జీవితంలో మలుపు తిప్పింది.

అక్కడ ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఈయన నాటకాల్లో నటించడం మానేయలేదు. ఆ సమయంలో ‘మనిషి నూతిలో పడితే’ అనే నాటకంలో ఈయన ఓ ప్రత్యేక పాత్రలో నటించాడు. అప్పుడు ఆయన పాత్రను చూసిన హాస్యబ్రహ్మ జంధ్యాల తన చిత్రం ‘ముద్ద మందారం’లో రిసెప్షనిష్టుగా చిన్న పాత్రను ఇచ్చాడు. ఇలా 1981లో సుత్తివేలు సినీరంగ ప్రస్థానం జరిగింది. ఇక అక్కడి నుంచి సుత్తివేలు ఏమాత్రం వెనక్కి తిరిగిచూడలేదు. ఆ సినిమా అనంతరం జంధ్యాల తన వరుస చిత్రాలైన ‘మల్లె పందిరి, నాలుగు స్తంభాలాట’లలో కూడా సుత్తివేలుకు అవకాశాలనిచ్చారు. ఆనంద భైరవి, రెండుజెళ్ళ సీత, శ్రీవారికి ప్రేమలేఖ, చంటబ్బాయి వంటి పలు విజయవంతమైన చిత్రాలలో హాస్యపాత్రలను పోషించారు.

త్రిశూలం చిత్రం తర్వాత ఈయన అవకాశాలు సన్నగిల్లడంతో కొద్దిరోజులు కష్టాలను అనుభవించాల్సి వచ్చింది. అయితే.. ఆ తర్వాత మళ్లీ ఈయనకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. అప్పటివరకు హాస్య పాత్రలనే పోషిస్తూ వచ్చిన సుత్తివేలుకు, అనంతరం తన నటనలోని మరో పార్శ్వాన్ని ఆవిర్భవించే అవకాశం చిక్కింది. వందేమాతరం, ప్రతిఘటన, కలికాలం, ఒసేయ్ రాములమ్మ చిత్రాలలో ఆయన పోషించిన పాత్రలు మరపురానివి. వందేమాతరం చిత్రానికిగాను 1984లో ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు.

వ్యక్తిగత జీవితం :

ఈయన తన స్థిరనివాసం మద్రాసులో ఏర్పరుచుకున్నారు. చిత్రపరిశ్రమ హైదరాబాదుకు తరలడంతో తగినన్ని అవకాశాలు దక్కించుకోలేకపోయారు. దీనితో పలు టెలివిజన్ ధారావాహికలలో నటించారు. చివరి రోజులలో తన మకాంను హైదరాబాదుకు మార్చారు. ఈయన వివాహము లక్ష్మీరాజ్యంతో జరిగింది. వీరికి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానము. ఈయన 2012 సెప్టెంబర్ 6వ తేదీన తుదిశ్వాస విడిచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : suthi velu  kurumaddali lakshmi narasimha rao  telugu famous comedians  

Other Articles