The Biography Of Kasu Brahmananda Reddy Who Is Former Chief Minister Of Andhra Pradesh State

Kasu brahmananda reddy biography former chief minister andhra pradesh state

Kasu Brahmananda Reddy, ap chief ministers list, andhra pradesh CM list, brahmananda reddy history, brahmahanda reddy stories, Kasu Brahmananda Reddy life history, Kasu Brahmananda Reddy biography

Kasu Brahmananda Reddy Biography Former Chief Minister Andhra Pradesh State : The Biography Of Kasu Brahmananda Reddy was the Chief Minister of Andhra Pradesh, India from 29 February 1964 to 30 September 1971.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి ఎనలేని కృషి చేసిన మాజీ సీఎం కాసు

Posted: 07/30/2015 03:54 PM IST
Kasu brahmananda reddy biography former chief minister andhra pradesh state

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వారిలో కాసు బ్రహ్మానందరెడ్డి ఒకరు. 1964 ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 1971 సెప్టెంబర్ 30వ తేదీ వరకు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఈయన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ఇతర నాయకులతో పోల్చుకుంటే ఈయన అనన్య మేధావి, రాజనీతి చతురుడు. రాజకీయం అన్న తర్వాత ప్రతిఒక్క నాయకుడిలో ఏదో ఒక ప్రత్యేకత కచ్చితంగా వుంటుంది. అలాంటిది ఈయనలో కూడా ఒకటుంది. అదేమిటంటే.. ఆయన తలపై వున్న తన టోపీని అటూ ఇటూ మార్చితే, ఓ ఘనమైన రాజకీయ ఎత్తు వేసినట్టేనని చెబుతుంటారు. ఈయన కేంద్ర, రాష్ట్రాల్లో కూడా ఎన్నో పదవులను విజయవంతంగా నిర్వహించాడు.

జీవిత విశేషాలు :

1909 జూలై 28న గుంటూరు జిల్లా నరసారావు పేటకు సమీపంలో వుండే తూబాడు గ్రామంలో జన్మించాడు. మదరాసు పచ్చయప్ప కళాశాలలో పట్టాపొందిన ఆయన.. ఆ తర్వాత న్యాయ పట్టా పుచ్చుకున్నాడు. ఈయన తన 12వ విజయవాడ కాంగ్రెసు సదస్సుకు విచ్చేసిన మహాత్మగాంధీని సందర్శించాడు. టంగుటూరి ప్రకాశం పంతులు సాహచార్యం, బోధనలకు ప్రభావితుడైన ఆయన.. స్వాతంత్ర్య ఉద్యమంవైపు నడిచారు. తాను చేస్తున్న ‘లా’ ప్రాక్టీసును పక్కనబెట్టి బ్రిటిషువారిపై పోరాటానికి ఉత్సాహంగా ముందుకు కదిలారు. సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. 1942లో బ్రిటిషు వారికి వ్యతిరేకంగా కాంగ్రెసు పిలుపు మేరకు ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లారు.

రాజకీయ ప్రస్థానం :

1946లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మొదటిసారిగా శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. 1946 నుంచి 1952 వరకు , 1952 నుంచి 1972 వరకు శాసన సభకు ఎన్నికయ్యాడు. ప్రత్యేక ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తరువాత 1956లో పురపాలక శాఖమంత్రిగా నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో చేరారు. ఆ తర్వాత దామోదరం సంజీవయ్య మంత్రివర్గంలో కొనసాగి వాణిజ్య శాఖ, ఆర్ధిక శాఖలు నిర్వహించారు. రాజకీయ రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ దూసుకెళ్లిన ఈయన.. 1964 ఫిబ్రవరి 29న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆనాటి తెలంగాణా ఉద్యమం సెగతో ఆయన 1971 సెప్టెంబరు 15న పదవికి రాజీనామా చేశారు.

రాష్ట్రం కోసం బ్రహ్మానందరెడ్డి చేసిన కృషి :

రాష్ట్ర ప్రగతి కోసం ఈయన ఎంతో శ్రమించారు. అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు రాష్ట్రాభివృద్ధికి దోహదపడే ప్రాజెక్టుల పనులను పూర్తి చేయించారు. దేశంలో అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు నాగార్జున సాగర్ పనులు ఈయన హయాంలోనే పూర్తయ్యాయి. రాయలసీమ ప్రాంతానికి వరదాయిని అయిన తుంగభద్ర ప్రాజెక్టు, హైలెవల్ కెనాల్ ప్రాజెక్టుకు అవసరమైన క్లియరెన్సుల మంజూరు, నిధులు సమకూర్చడానికి ఈయన కృషి చేశారు. పోచంపాడు ప్రాజెక్టుకు రూపకల్పన కూడా ఈయనే చేశారు.

అప్పట్లో ఎల్.ఐ.సి. నుంచి పది కోట్ల రూపాయల రుణం తీసుకుని.. బలహీనవర్గాల వారికి ఇళ్లు నిర్మించారు. ఆయన హయాంలో పంచాయతీ చట్టం అమలులోకి వచ్చింది. సికింద్రాబాదు కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే మండలం ఏర్పాటు కావడం వెనుక ఆయన కృషి ఎంతో ఉంది. ఇంతేకాదు.. ఇంకా ఎన్నో కార్యక్రమాలను ఈయన చేపట్టారు. ఈ విధంగా రాష్ట్ర ప్రగతికి తీవ్రంగా కృషి చేసిన కాసు బ్రహ్మానందరెడ్డి.. 1994 మే 20 న హైదరాబాద్ లో మరణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kasu Brahmananda Reddy  Andhra pradesh former cm list  

Other Articles

Today on Telugu Wishesh