P b srinivas biography and history

p b srinivas, biography, history, bollywood, Veteran playback singer PB Srinivas, P B Srinivas Biography, biography, photos P B Srinivas video clips, pictures gallery, P B Srinivas wallpapers, latest news

biography of P B Srinivas in full detail with information about education, P B Srinivas flim career, early life, P B Srinivas awards won, P B Srinivas latest news and full wiki information.

ఆ మధుర గాయకుడు పి.బి. శ్రీనివాస్

Posted: 04/22/2013 03:55 PM IST
P b srinivas biography and history

నీలి మేఘమాలవో.., అందాల ఓ చిలుకా.. అందుకో నా లేఖా.., నీలికన్నుల నీడలలోనా.., వెన్నెల రేయీ ఎంతో చలీచలీ.. అంటూ తన విలక్షణ గళంతో సినీసంగీతాభిమానుల మదిని డోలలూగించమే కాకుండా, శ్రీకైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్.. అంటూ అలనాడు భక్తపోతన చిత్రంలో ఆర్తిగా పద్యాన్ని ఆలపించిన విలక్షణ గాయకుడు పీబీ శ్రీనివాస్. ఆయన ఇటీవల చెన్నైలో మరణించిన విషయం తెలిసిందే.  పలు భాషల్లో వేలాది పాటలు పాడి తన అద్భుత గాత్ర మాధుర్యంతో ఐదు తరాల శ్రోతలను అలరించిన ఆ మధుర గాయకుడు పీబీ శ్రీనివాస్.

ప్రఖ్యాత సినీ, శాస్త్రీయ సంగీత గాయకుడు, సంగీత దర్శకుడు, రచయిత, కవి, బహుభాషా కోవిదుడు.. ప్రతివాదిభయంకర శ్రీనివాస్ (పీబీ శ్రీనివాస్, 82). తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ పట్టణంలో ఫణీంద్ర స్వామి, శేషగిరమ్మ దంపతులకు సెప్టెంబర్ 22 , 1930న జన్మించారు. ఆ రోజుల్లోనే కళాశాల చదివి బి.కాం. పూర్తి చేశారు. వీరి పూర్వీకులు మాత్రం పసలపూడి గ్రామస్థులు. తల్లివైపు వారందరూ సంగీతంలో విజ్ఞులు. తల్లి శేషగిరమ్మ వల్లే శ్రీనివాస్‌కు సంగీతం పట్ల మక్కువ కలిగింది. వీరి సోదరి, మణిరఘునాథ్ వీణా విద్వాంసురాలు.  రచన, సంగీత దర్శకత్వం, నేపథ్యగానం, గజల్స్ వంటి అంశాలలో విశేషకృషి చేసిన ఆయన గానకోవిధుడిగా పేరు తెచ్చుకొన్న ఆయన ఎనిమిది భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. తెలుగు, కన్నడం, తమిళం, మళయా ళం, హిందీ, ఉర్దూ, ఆంగ్లం, సంస్కృతం భాషలు గుక్క తిప్పు కోకుండా మాట్లాడడంతో దిట్ట. తెలుగులో అనేక గజళ్లను పాడారు. మద్రాసులో ఉన్నప్పుడు 'ప్రియాంక, ప్రియభాషి, విశ్వసాక్షి, త్రిలోక సంచారి' వంటి కలం పేర్లతో పత్రికలకు రచనలు చేసేవారు. ప్రముఖ వైణిక విద్వాంసులు ఈమని శంక రశాస్త్రి ప్రోత్సాహంతో సినీరంగానికి పరిచయమయ్యారు. నాటి ప్రముఖ గాయనీమణులైన గీతా దత్, షంషాద్ బేగం, జిక్కీల తో కలిసి ఎన్నో యుగళ గీతాలను ఆలపించారు. ఆర్.నాగేంద్రరావు జాతక ఫలం చిత్రంతో తమిళ, కన్నడ, తెలుగు చిత్రాల్లో పరిచయమయ్యారు.

దేశంలోని ప్రధానమైన భాషల్లో పాటలు పాడినప్పుటికీ ఎక్కువ పాటలను కన్నడ భాషలోనే అందించారు. తెలుగులో ఆయన ఆలపించిన పాటలెన్నో ఆంధ్ర ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. శాంతినివాసంలో మహానటుడు నాగయ్య గారికి 'శ్రీ రఘురాం జయ రఘురాం' అనే పాటను పాడటం విశేషం. సినిమా రంగంలోకి శ్రీనివాస్ ప్రవేశం ఈమని శంకరశాస్త్రి సాయంతో జరిగింది. ఆయన సిఫారసుతోనే పీబీ తొలిసారి జెమినీ స్టూడియోలో ప్రవేశించగలిగారు. అక్కడ ఒక హిందీ సినిమా కోసం కబీర్‌దాస్ దోహాలు ఆలపించారు. తర్వాతంతా చరిత్రే.. ఈయన మొట్టమొదటిసారిగా జాతక ఫలం చిత్రంలో పాడారు. అప్పటి నుంచి దాదాపు 3000లకు పైగా పాటలను తన గాత్రంతో ప్రజలకు అందించారు. ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో కవితలు కూడా రాశారు. ఎనిమిది భాషల్లో వివిధ ఇతివృత్తాలతో చేసిన రచనలను 'ప్రణవం' పేరుతో గ్రంథంగా ప్రచురించారు. 'షాబాష్' అనే పేరు తో ఉర్దూలో గజల్స్ రాశారు. ఆకాశవాణి, దూరదర్శన్ కేం ద్రాల్లో పలు తెలుగు, తమిళ గీతాలు ప్రసారమయ్యాయి. ఆయన రచించి, గానం చేసిన 'పాలవెల్లిరా నా పిల్లనగ్రోవి, నీల గగనమే నా మోవి'  అని కృష్ణునిపై రాసిన పాట ఆయనకిష్టమైన వాటిల్లో ఒకటి. నీల్ఆర్మ్ర్‌స్టాంగ్ చంద్రునిపై కాలిడిన సందర్భంలో ఇంగ్లీషులో 'మేన్ హాజ్ సెట్ హిజ్ ఫుట్ ఆన్ ది మూన్' అనే పాట రాసి కంపోజ్ చేశారు.

పద్యాలను పాడడంలోనూ పి.బి. గొప్ప నేర్పరి. 'ఇనుప కచ్చడాల్' (సీతారామకల్యాణం), 'నల్లనివాడు' (శ్రీకృష్ణపాండ వీయం), 'మామ మీసాల మీద సీసా' (కులగోత్రాలు) మంచి పేరు తెచ్చుకున్న వాటిల్లో కొన్ని. వయస్సు శరీరానికే గానీ తన స్వరానికి కాదనీ 80 దశకంలో కూడా ఎప్పుడూ చెబుతుండే వారు. సంగీతంలో అన్ని స్వరమాధుర్యాలు తడిమిన వాడు. గంటసాలను అధ్యయనం చేయడం వల్లే సంగీతంలో ఎన్నో తెలుసుకున్నాను అన్న పి.బి.మాటలు ఆయనలోని సుగుణాన్ని తెలియజేస్తాయి. గాయకుడు పి.బి.శ్రీనివాస్‌ను తమిళనాడు కళైమామణి పురస్కారంతో ఘనంగా సత్కరించింది. కొంతకాలం క్రితం చెన్నైలో 'నేచురల్ ఇంటిగ్రిటీ కల్చరల్ అకాడమీ' నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు 'లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు'ను ప్రదానం చేసి సన్మానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles