Filmography of dasari narayana rao

Complete filmography of Dasari Narayana Rao including movie stills, trailers from all Dasari Narayana Rao movies, dasari narayana rao filmography, dasari narayana rao biography, dasari narayana rao profile and fans, favorite celeb dasari narayana rao, celeb dasari narayana rao latest film, about dasari narayana rao

Complete filmography of Dasari Narayana Rao including movie stills, trailers from all Dasari Narayana Rao movies, dasari narayana rao filmography, dasari narayana rao biography, dasari narayana rao profile and fans, favorite celeb dasari narayana rao, celeb dasari narayana rao latest film, about dasari narayana rao

Dasari Narayana Rao.GIF

Posted: 02/03/2012 01:16 PM IST
Filmography of dasari narayana rao

dasari

Dasari_Narayana_Rao80 ఏళ్ళ చరిత్ర నేడు టాలీవుడ్ సొంతం. ఇంతకాలం ఈ పరిశ్రమ ఎన్నో ఒడిదొడుకులు, ఎత్తుపల్లాలను చవిచూసింది. నాటి మద్రాసు నుండి హైదరాబాద్ కి సినీ పరిశ్రమ తరలొచ్చి... ఇంతింతై వటుడింతై అన్నట్లు అంచెలంచెలుగా ఎదిగింది. ఈ క్రమంలోనే దర్శకులలో ఎందరో తరుపు ముక్కలు కూడా ఆవిర్భవించారు. అయితే మద్రాసులో అసిస్టెంట్ డైరెక్టర్ పరిస్థితి ఏంటి ? దర్శకుల సంఘం ఎలా ఆవిర్భవించింది ? నేటి సంఘం కార్యకలాపాలేంటి ? ఇప్పుడే స్థితిలో ఉన్నాం ? తెలుసుకుంటే ఆసక్తికరం. దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణ రావు ఇటీవల ఈ సంగతుల ఈయన చెప్పిన ఆసక్తికర విషయాలు.

అవి నేను దర్శకుడిగా... మదరాసు పట్టణంలో తిరుగుతున్న రోజులు. సహాయ దర్శకులకు అప్పట్లో అంతగా గుర్తింపు లేదు. తమకంటూ ఓ ఫ్లాట్ ఫాం అస్సలు లేదు. అసిస్టెంటుగా జాయినయ్యాక...మొదటి నెల జీతం దొరికింది. ఆ తర్వాత వస్తుందో లేదో కూడా గ్యారెంటీ లేదు. సినిమా రంగం ఆర్థిక పరిస్థితే అప్పట్లో అలా ఉండేది. అలాంటి రోజుల్లో ఓ సీరియస్ నిర్ణయం. దర్శకులకంటూ... గుర్తింపు దక్కాలి. అందుకు ఓ సంఘం ఉండాలి. అని భావించాం. ఒకానొక రోజు మద్రాసులోని హెన్స్ మేన్ పార్క్ లో మా సహాయ దర్శకులంతా సమావేశమై దర్శక సంఘాన్ని రిజిష్టర్ చేయాలని తీర్మానించాం. పెద్ద ఎన్.టి.ఆర్ , బి.ఎస్. నారాయణ గార్లను అభ్యర్థించాం. అయితే వారు ప్రత్యేకించి సహాయదర్శకుల కొసం సంఘం ఏర్పాటు చేయడం కుదరదు కానీ, దర్శకుల సంఘం ఏర్పాటు చేసుకోవచ్చు అని ప్రోత్సహించారు. అలా దక్షిణ భారత చలన చిత్ర దర్శకులకు ఓ సంఘం రూపుదిద్దుకుంది.

నాటి నుండి ఎన్నో కార్యకలాపాలు జరిగాయి. సహాయ దర్శకులకు ప్రత్యేకించి సీనియర్ దర్శకులు అసోషియేషన్ కార్యాలయంలో తరగతులు నిర్వహించేవారు. థియరీ సహా ప్రాక్టికల్ విషయాల చర్చ అక్కడ సాగేది. ఈ చారిత్రక మార్పుతో గౌరవం పెరిగింది. హోదా వచ్చింది. క్రమంగా సహాయదర్శకుల చేరిక పెరిగింది. నూతన కళ వచ్చింది,

అదే సమయంలో దర్శకుల కోసం ప్రత్యేకించి ఓ కాలనీ నిర్మించాలని భావించి.... అప్పటి మంత్రి రాజారామ్ ని కలిశాం. అందుకు ప్రభుత్వ సమ్మతి లభించింది. కాలనీ సిద్దమైంది. ఇన్ స్టాల్ మెంట్ పద్దతిలో వాయిదాలు చెల్లించే వెసులుబాటు వల్ల అంతా ఆ కాలనీ లో చేరారు. అదిప్పుడు చెన్నైలో అద్బుతమైన కాలనీ గా వర్దిల్లుతుంది. అలాగే అప్పడునున్న 24 శాఖల్లో అప్పట్లో ప్రత్యేకించి సంఘాలు ఏర్పలేద. ఏవో కొన్ని కీలకమైన విభాగాలు మాత్రమే అసోసియేషన్ లు ఏర్పాటు చేసుకున్నాయి.

పెరిగిన సాంకేతికతను వినియోగించి తక్కువ ఖర్చుతో సినిమాని మలచడం ఎలానో నేటి యువదర్శకులకు తెలియాల్సి ఉంది. అందుకు dasari_narayanaఅవసరమైన టెక్నాలజీని మనం అందిపుచ్చుకోవాలి. తెలుగు సినిమా వజ్రోత్సవాలు పూర్తి చేసుకుని ముందుకెళుతుంది. ఈ వేళ దర్శకుడు తెర వెనుక ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలీదు. నటీనటులు, సాంకేతిక నిపుణుల నుండి పని ఎలా రాబట్టుకుంటారో లైవ్ లో చూపిస్తూ... ఓ ప్రోగ్రామ్ చేయదలిచాం. డైరెక్టర్స్ స్పెషల్ దాని పేరు. ప్రస్తుతం దర్శకుల సంఘంలో 1700 మంది ఉన్నారు. (దర్శకులు, సహాయ దర్శకులు) వారి కోసం సొంత భవంతి సిద్దమయ్యాక ప్రత్యేక కోచింగ్ ను ఏర్పాటు చేయనున్నాం. పూరి జగన్నాథ్, రాజమౌళి, శ్రీను వైట్ల లాంటి సీనియర్ దర్శకులు ఈ విషయాలలో పూర్తి సహకారం ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Former minister m satyanarayana rao
Happy birthday to brahmanandam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles