Happy birthday to brahmanandam

Happy Birthday to Brahmanandam-Brahmanandam Birthday-Wishing Brahmanandam a Very Happy Birthday

Haasyabrahma Padmasri Brahmanandam (full name Brahmanandam Kanneganti) is celebrating his birthday today. The comedy star turns 53. Brahmanandam was

Happy Birthday to Brahmanandam.GIF

Posted: 02/01/2012 03:57 PM IST
Happy birthday to brahmanandam

Brammi

Bramhanandamపేరులోనే బ్రహ్మాండమైన ఆనందాన్ని కలిగి ఉన్న నటుడు బ్రహ్మానందం.  సహజంగా హాస్యనటులు తెరమీద కనిపిస్తే చాలా ప్రేక్షకుల మోముపై చిరునవ్వుల చినుకులు కురుస్తాయి. కానీ మన ‘బ్రహ్మీ’ విషయంలో మాత్రం ఆయన పేరు వినగానే నవ్వుల చినుకులు ఒక్కసారిగా తుఫానుగా మారిపోతుంది. కళల పట్ల ఉన్న మక్కువతో విద్యార్థి దశనుంచే పలు కార్యక్రమాల్లో పాలు పంచుకున్న ఆయన పుట్టింది గుంటూరు జిల్లాలో అయినప్పటికీ గోదావరి జిల్లాల యాసతో గోదారిబిడ్డ గానే ప్రేక్షకుల్లో గుర్తింపబడుతున్నారు. ప్రఖ్యాత రచయిత, దర్శకుడు జంధ్యాలతో జరిగిన పరిచయం కారణంగా ఆయన కెరీర్ ఊహించని మలపులు తిరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో తెలుగు లెక్చరర్ గా పని చేస్తున్న తరుణంలోనే సినిమాల్లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం కోసం 1987లో కెమెరా ముందుకు వచ్చిన ఆయన నేటి వరకూ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా హాస్య యాత్ర సాగిస్తూనే ఉన్నారు.

కేవలం హీరోలకు, పాత తరం హాస్య నటులకు మాత్రమే పరిమితమైన లాంగ్ స్టాండ్ ఎవర్ గ్రీన్ కెరీర్ ని సొంతం చేసుకున్న ఈ తరం ఏకైక హాస్య ప్రియుడిగా బ్రహ్మానందాన్ని చెప్పుకోవచ్చు. కేవలం హాస్యనటుడిగానే దాదాపు 800 చిత్రాలలో నటించి ప్రపంచ రికార్డుని నెలకొల్పిన విశిష్ట వ్యక్తి బ్రహ్మానందం. రెండు దశాబ్దాలకు పైగా ప్రేక్షకులను తన ఎక్స్ ప్రెషన్స్ తో కడుపుబ్బ నవ్విస్తూ ముందుకు సాగటం అంటే మాటలు కాదు. కెరీర్ ప్రారంభంలో వచ్చిన ‘అహా నా పెళ్లంట’ చిత్రంలో బ్రహ్మానందాన్ని చూస్తే ఎంత నవ్వు వచ్చిందో నేటికీ ఆయన్ను చూస్తే అదే రకమైన గిలిగింతలు పుడతాయి. ‘అహా నా పెళ్ళంట’ సినిమాలో ‘అరగుండు’ గా ఆయన పండించిన హాస్యాన్ని తలుచుకుంటే నేటికీ అంతులేని ప్రాధాన్యం.

జంధ్యాల తీసిన సినిమాలలో బ్రహ్మానందం పాత్రలకు ప్రత్యేకమైన ప్రాధాన్యముండేది. తెలుగు తెరపై కత్తిరాందాస్, ఖాన్ దాదా, మైకేల్ జాక్సన్, లవంగం, బ్రహ్మి, గజాలా, చారి గారు, మెక్ డొవెల్ మూర్తి ఎన్నో రకాల పాత్రలను తన హాస్య చాతుర్యంతో రక్తికట్టించి ప్రేక్షక నీరాజనాలందుకున్న హాస్య బ్రహ్మ బ్రహ్మానందం డైలాగ్ విరుపులతో సెటైరికల్ పాత్రలతో పేరు తెచ్చుకున్నాడు బ్రహ్మీ.
నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. ఇలాగే హాస్యాన్ని పండించాలని కోరుకుంటుంది : ఆంధ్ర విశేష్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Filmography of dasari narayana rao
Veturi sundararama murthy jayanthi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles