Cyrus mistry to head tata empire

Tata Sons,Tata Group,Pallonji Mistry,Larsen & Toubro,Cyrus Mistry,Cyrus Mistry News, Tata Sons News, latest Cyrus Mistry news News, Pallonji Mistry News, Prince Mistry News, Switch Tata&rsquo News, Noel Tata News, Shapoorji Pallonji Gather.

When senior advocate Iqbal Chagla met Cyrus P Mistry for the first time, he felt there was something special about the man. "He struck me as a young man who will make it big one day," says Chagla.

Cyrus Mistry to head Tata empire.GIF

Posted: 12/03/2011 01:03 PM IST
Cyrus mistry to head tata empire

Cyrus_Mistry_to_head_Tata_empire2

Cyrus-Mistryరూ. లక్షల కోట్లతో ముడిపడిన నిర్ణయం. శతాబ్దికిపైగా చరిత కలిగిన కంపెనీ భవితను ప్రభావితం చేసే నిర్ణయం. వేలాది ఉద్యోగులతో ముడిపడిన నిర్ణయం... అన్నింటికీ మించి తరతరాలుగా భారతీయతకు ప్రతీకగా నిల్చిన బ్రాండ్గ భవితవ్యాన్ని తేల్చే నిర్ణయం. ఆ నిర్ణయం రతన్‌ టాటా వారసుడి ఎంపిక. పూర్వకాలం నాడు రాజులు తమ వారసులను ఎంపిక చేసుకోవాల్సిన వచ్చిన సందర్భాల్లో, అందుకు పోటీ పడేవారికి వివిధ రకాల పరీక్షలు పెట్టేవారు. ఈనాడు అలాంటి పరీక్షలు లేకున్నా, అభ్యర్థులనందరినీ కాచిపోశారు. ఇంట్లో పిల్లాడిని పెట్టుకొని ఊరంతా వెదికిన చందంగా ప్రపంచమంతా గాలించి చివరకు ఓ భారతీయుడిని, సమీప బంధువునే ఎంపిక చేశారు. అరుుతే, ఈ రెండు అర్హతలకు మించిన అర్హతలు వారసుడిలో ఉన్నందునే ఈ నిర్ణయం ఎవరినీ అంతగా ఆశ్చర్యానికి గురి చేయలేదు. ఎలాంటి వివాదమూ తలెత్తలేదు.

భారతీయతకు, టాటా కంపెనీకి మధ్య ఉన్న అనుబంధం విడదీయలేనిది. భారత వాణిజ్యం అనగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు టాటానే. అంతగా అది ప్రజల హృదయాల తో ముడిపడిపోయింది. ఉప్పు మొదలుకొని ఉక్కు వరకు భిన్న వ్యాపార రంగాల్లో టాటా గ్రూప్‌ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దేశంలోని అతి ప్రాచీన వ్యాపార సామ్రాజ్యా ల్లో ఒకటిగా టాటా గ్రూప్‌ గుర్తింపు పొందింది. రెండు దశా బ్దాల నుంచీ టాటా గ్రూప్‌ను సమర్థంగా నిర్వహిస్తూ, ప్రపంచ మంతా టాటా పేరు మార్మోగిపోయేలా చేసిన రతన్‌ టాటా రిటైర్‌మెంట్‌ యోచన పారిశ్రామిక వర్గాలతో పాటుగా సామా న్యుల్లోనూ పెను ఉత్కంఠ రేపింది. ఎట్టకేలకు రతన్‌ టాటా వారసుడిగా ఐరిష్‌ జాతి కుటుంబానికి చెందిన సైరస్‌ పల్లోంజీ మిస్ర్తీ (43)ని ఎంపిక చేయడంతో ఆ ఉత్కంఠకు తెరపడింది.

ఎవరీ సైరస్‌ మిస్ర్తీ!
మిస్ర్తీ ప్రస్తుతం షాపుర్జీ పల్లోంజి గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఇటీవలే ఆయన టాటా సన్స్‌ డిప్యూటీ చైర్మ న్‌గా నియమితులయ్యారు. రతన్‌టాటాతో కలసి పని చేస్తూ గ్రూప్‌ కార్యకలాపాలపై అవగాహన పెంపొందించుకోనున్నా రు. టాటా సన్స్‌లో షాపుర్జీ పల్లోంజి గ్రూప్‌నకు 18 శాతం వాటాలున్నాయి. టాటా సన్స్‌లో 18 శాతం వాటా కలిగి ఉన్న పల్లొంజి మిస్ర్తీ చిన్న కుమారుడు సైరస్‌ మిస్ర్తీ. మిస్ర్తీ సోదరి, రతన్‌ టాటా సవతి సోదరుడు నోయెల్‌ టాటా భార్య కావడం విశేషం. ఫోర్బ్స్‌ ఇండియా రూపొందిం చిన సంపన్నుల జాబితాలో సైరస్‌మిస్ర్తీ 9వ స్థానం.

ఎంపిక జరిగింది ఇలా!
వారసుడి ఎంపిక కోసం ఏర్పాటు చేసిన సెలెక్షన్‌ కమిటీ మిస్ర్తీ పేరును ఏకగ్రీవంగా సిఫారసు చేయ డంతో డైరెక్టర్ల బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాటాసన్స్‌ తెలిపింది. టాటా సన్స్‌కు రతన్‌ టాటా స్థానంలో సమర్థుడైన వారసుడిని ఎంపి క చేసేందుకు గత ఏడాది ఆగస్టులో ఐదుగురు సభ్యుల కమిటీని నియమించారు. టాటా సన్స్‌ డైరెక్టర్‌ ఆర్‌కె కృష్ణకుమార్‌, మాజీ వైస్‌ చైర్మన్‌ ఎన్‌ఎ సూనావాలా, గ్రూప్‌ డైరెక్టర్‌ సైరస్‌ మిస్ర్తీ, గ్రూప్‌ న్యాయవాది, సలహాదారు షిరిన్‌ బారూచా, ప్రముఖ వ్యాపారవేత్త లార్డ్‌ కుమారుడు భట్టాచార్య ఈ కమిటీ సభ్యులుగా ఉన్నారు.

ప్రచారంలోకి ఎందరో!
టాటా వారసుడి అన్వేషణ ప్రక్రియలో భాగంగా ఎన్నెన్నో పేర్లు తెరపైకి వచ్చాయి. టాటాల సవతి సోదరుడు, పల్లోంజి మిస్ర్తీ అల్లుడు నోయెల్‌ టాటా, పెప్సీకో చైర్‌పర్సన్‌ ఇంద్రా నూయితో పాటుగా పలువురి పేర్లు విన్పించాయి.

టాటా ఘనత!
ఉప్పు నుంచి ఉక్కు వరకు, ఆటోమొబైల్స్‌ నుంచి సాఫ్ట్‌వేర్‌ వరకు భిన్న రంగాల్లో కార్యకలాపాలు కొనసాగించే 90 కంపెనీలు టాటా గ్రూప్‌లో ఉన్నాయి. వీటిలో 28 లిస్టెడ్‌ కంపెనీలు. 1868లో జంషెడ్‌జీ టాటా ఒక ప్రైవేటు ట్రేడింగ్‌ కంపెనీగా టాటా సన్స్‌ను స్థాపించారు. 2006లో అంతర్జాతీయ స్టీల్‌ కంపెనీ కోరస్‌ను 1200 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసిన తరువాత టాటా సన్స్‌ అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఆడంబరానికి, విలాసానికి మారుపేరైన జాగ్వార్‌, లాండ్‌ రోవర్‌లను ఫోర్డ్‌ కంపెనీ నుంచి 2008లో 230 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయడం మరింతగా పేరు ప్రఖ్యాతులను తీసుకువచ్చింది.

సమర్థుడిగా...
నిర్మాణరంగ దిగ్గజం షాపుర్జీ పల్లోంజి గ్రూప్‌లో 1991లో డైరెక్టర్‌గా చేరిన ఆయన ఆ కంపెనీ విస్తరణలో కీలకపాత్ర పోషించారు. ఈ గ్రూప్‌ నేడు 23 వేల మంది ఉద్యోగులతో దేశవ్యాప్తంగానే గాకుండా పశ్చిమాసియా, ఆఫ్రికా దేశా ల్లోనూ కార్యకలాపాలు సాగిస్తున్నదంటే అందులో మిస్ర్తీ ఎంతో కీలక పాత్ర వహించారు. తన సమర్థతతో ఆయన ఆ గ్రూప్‌నకు మేనేజింగ్‌ డైరెక్టర్‌ స్థాయికి ఎదిగారు. ఆయన విశ్లేషణ తీరు అందరినీ ఆకట్టుకుంటుంది.

పనితీరునచ్చింది!
మిస్ర్తీ పనితీరు తనకెంతో నచ్చిందని రతన్‌టాటా కితాబు నిచ్చారు. బోర్డు సమావేశాల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ప్రకటించే అభిప్రాయాలు ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. మిస్ర్తీ హుందాతనం తనకు నచ్చిందని మెచ్చుకున్నారు.

పార్సీల్లో ఆనందం!
టాటా వారసుడి నిర్ణయం వెల్లడి కాగానే ముంబయిలో పార్సీ ల్లో ఆనందం వెల్లివిరిసింది. సంప్రదాయాల కొనసాగింపునకు మిస్ర్తీ తోడ్పడుతారన్న నమ్మకం వ్యక్తం చేశారు. పదో శతా బ్దిలో టాటాల కుటుంబం (పర్షియన్‌ జొరాస్ట్రియన్స్‌) భార త్‌కు చేరుకుంది. ఈ భారతీయ వాణిజ్య సామ్రా జ్యానికి ఇతర జాతికి చెందిన వ్యక్తి నేతృ త్వం వహించడం ఇదే తొలిసారి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Softer king dhasharatha ram
Discussion with director ram gopal varma on bezawada  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles