![]() |
స్టాక్‌మార్కెట్ సమాచారాన్ని క్షణాల్లో విశ్లేషించటంతో పాటు సెల్‌ఫోన్‌ను మరింత నాజూగ్గా తయారు
|
స్టాక్‌మార్కెట్ సమాచారాన్ని క్షణాల్లో విశ్లేషించటంతో పాటు సెల్‌ఫోన్‌ను మరింత నాజూగ్గా తయారు చేసేందుకు ఉపయోగపడే బహుళ ప్రయోజనాలున్న సాఫ్ట్‌వేర్ రూపొందించి, అంతర్జాతీయ కంపెనీలు దాని కోసం క్యూ కట్టేలా చేశాడు మన రాష్ట్రానికి చెందిన టెక్కీ వేదాంతం దశరథరామ్. గుంటూరు జిల్లా వేమూరు మండలం పెరవలి గ్రామంలో ఒక అర్చకుని కుటుంబంలో జన్మించిన రామ్ ఐ.టి రంగంలో హల్‌చల్ సృష్టిస్తున్నాడు. సాధించాల్సింది మరెంతో ఉందంటున్న రామ్ గురించి మీకొసం...
"నేను రూపొందించిన ఎల్ఏపీడి-ఏడీఏ- ఐఎఫ్ఎస్ సాఫ్ట్‌వేర్‌తో 9 రకాల ప్రయోజనాలున్నాయి.అందుకే అంతర్జాతీయ కంపెనీలు దీన్ని సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపాయి. సాధారణంగా ఏదైనా డేటాను ప్రాసెసర్ సాయంతో హార్డ్‌డిస్క్‌లో సేవ్ చేస్తారు. కానీ నేను రూపొందించిన ఈ కొత్త సాఫ్ట్‌వేర్ వల్ల ప్రాసెసర్‌కు అనుసంధానం చేయకుండానే నేరుగా సమాచారాన్ని హార్డ్‌డిస్క్‌లో ఆటోమేటిక్‌గా సేవ్ చేసుకోవచ్చు.
స్టాక్ మార్కెట్ వెబ్‌సైట్‌కు అనుసంధానం చేస్తే మార్కెట్‌ను అసెస్ చేసి షేర్ల స్థితిగతులు, పెరుగుదల అంశాలపై ఓ రిపోర్టు వెలువరిస్తుంది. స్టాక్ మార్కెట్ అసెస్‌మెంట్‌కు నేను రూపొందించిన సాఫ్ట్‌వేర్ 68 శాతం ఖచ్చితత్వం ఉందని ఫిట్చీ ఏజెన్సీ పరిశీలనలోనూ వెల్లడైంది. ఈ ప్రయోజనం ఒక్కటే కాదు, ఈ సాఫ్ట్‌వేర్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఏ సమాచారం అయినా క్షణాల్లో సేవ్ అయ్యేలా మాడ్యూల్ టూల్‌కు రూపకల్పన చేశాను.
హార్డ్ డిస్క్‌లో ఉన్న ఇన్‌ఫర్‌మేషన్‌లో కావలసిన దాన్ని ఓపెన్ చేయకుండానే, సెర్చ్ కొట్టకుండానే ఓపెన్ చేసుకునే సౌలభ్యం ఈ సాఫ్ట్‌వేర్‌లో ఉంది. ఏదైనా ఓ రిపోర్టు జనరేట్ అయ్యాక సేవ్ యాజ్ కొట్టకుండానే ఆటోమేటిక్‌గా సేవ్ అయ్యే సాంకేతిక పరిజ్ఞానం ఇందులో ఉంది. సెల్‌ఫోన్ ఆపరేట్ చేసేందుకు కూడా ఈ సాఫ్ట్‌వేర్ ఉపయోగపడుతుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించటం వల్ల తక్కువ మెమోరీతో సెల్‌ఫోన్ సైజును చిన్నదిగా చేసుకోవచ్చు. ఆపరేటింగ్ పరిమాణంతోపాటు సమయాన్ని ఆదా చేసుకునే వీలుంటుంది. ఇలా తొమ్మిది రకాల ప్రయోజనాలున్న ఈ సాఫ్ట్‌వేర్‌కు భవిష్యత్‌లో ఆదరణ పెరుగుతుందని నా విశ్వాసం'' అన్నారు 27 ఏళ్ల వేదాంతం దశరథరామ్.
పెరవలి నుంచి ప్రపంచ పటంలోకి...
పలు అంతర్జాతీయ కంపెనీల దృష్టిని ఆకర్షిస్తున్న యువకుడు వేదాంతం దశరథరామ్ పుట్టింది గుంటూరు జిల్లా పెరవలిలో. తండ్రి అర్చకత్వంతో పాటు ఆర్.ఎం.పి.వైద్యం చేస్తారు. ఊళ్లో ఉన్న విష్ణుమూర్తి ఆలయం చెంతన ఉన్న చిన్న ఇల్లు రామ్‌కు ఓనమాలు నేర్పింది. పెరవలి గ్రామంలోని జిల్లాపరిషత్ పాఠశాలలో పదోతరగతి వరకు చదువుకున్న దశరథరామ్ అంచెలంచెలుగా ఎదిగాడు.
విజయవాడలో ఇంటర్, బీటెక్ పూర్తి చేసిన ఈయన హైదరాబాద్‌లో ఐటీలో ఎంఎస్ చేశారు. స్వయంకృషితో ఇటు చదువులోనూ, అటు పరిశోధనల్లోనూ విజయం సాధించాడు.ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ రంగంలో సరికొత్త సాఫ్ట్‌వేర్‌కు రూపకల్పన చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచి ఇండియన్ సూపర్‌హీరోగా నిలిచాడు. పట్టుదల.అకుంఠిత దీక్ష, ఆత్మవిశ్వాసం, కష్టపడేతత్వం ఉంటే చాలు ఏ రంగంలోనైనా రాణించవచ్చని నిరూపించాడు దశరథరామ్.
రెండున్నరేళ్ల కృషి
ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీలో ఎంఎస్ చేసిన ఈయన 28 నెలల పాటు శ్రమించి బహుళ ప్రయోజనాలున్న సరికొత్త సాఫ్ట్‌వేర్ అల్గరిథమ్ లెక్సికల్ అనాల్‌సిస్ అండ్ ప్యాట్రన్ డిజైనింగ్- ఏడీఏ డిజైన్ ఆర్కిటెక్చర్ ఇంటిగ్రేటెడ్ ఫైల్ సిస్టం ( ఎల్ఏపీడీ-ఏడీఏ-ఐఎఫ్ఎస్-డబ్ల్యూడబ్ల్యూఎన్‌ను రూపొందించారు. ఈ అల్గరిథమ్‌లో 23 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లోపాటు ఏడు నెట్‌వర్కింగ్ ప్యాకేజీలను కలిపి పీఈజీఏ (పెగా) పేరిట కొత్త హెడర్ ఫైల్ ప్యాకేజీని తయారు చేశారు. దీనిలో 2,43,415 లైన్లతో కూడిన కోడ్ ఉంటుంది.
కంప్యూటర్‌లో ఒక ప్రోగ్రాంను మరో ప్రోగ్రాం కలిపేలా రాప్టర్ టూల్‌ను కొత్తగా డిజైన్ చేసి హెడర్ ఫైల్ ప్యాకేజిని రూపొందించారు. దశరథరామ్ అల్గరిథమ్ కొత్త సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టు రూపకల్పనకు 2008వ సంవత్సరం అక్టోబరులో శ్రీకారం చుట్టారు. దీని కోసం 2009లో ఏడీఏ, ఏటీ అండ్ టీ బెల్ లాబోరేటరీల్లో శిక్షణ పొందుతూ ఈ ప్రాజెక్టుపై పరిశోథనలు సాగించాడు. ఫ్రాన్స్‌లోని ఇన్‌సీడ్ డిజైనింగ్ ప్యాట్రన్‌లో శిక్షణ పొందాడు. 2009 మార్చి నుంచి ఆరంభించి 23 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌తోపాటు ఏడీఏ అండ్ రాప్టర్‌ల సాయంతో కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఈ సాఫ్ట్‌వేర్ మూడు మాడ్యూల్స్‌లో రూపకల్పన చేశారు. అకుంఠి దీక్షతో దశరరామ్ చేసిన కృషి ఫలించి, ఆయన రూపకల్పన చేసిన సాఫ్ట్‌వేర్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది.
గుజరాత్‌లో సొంత కంపెనీ
కొత్త సాఫ్ట్‌వేర్ సృష్టించటంతో పాటు సిరికల్ బేరింగ్‌లకు రూపకల్పన చేసి అందరి ప్రశంసలు పొందాడు రామ్. బేరింగ్ ప్రాజెక్టును ఈ ఏడాది జరిగిన వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో పారిశ్రామికవేత్తల ముందుంచారు. స్పిన్నింగ్ మిల్లులతోపాటు పెద్ద పరిశ్రమలకు కావాల్సిన సిరికల్ బేరింగ్స్ తయారీ పరిశ్రమను నెలకొల్పేందుకు పలువురు పారిశ్రామికవేత్తలు, బ్యాంకర్లు ముందుకు వచ్చారు.
గుజరాత్ రాష్ట్రప్రభుత్వం ఈయన పెట్టనున్న టెక్నోప్రో ఇండస్ట్రీస్‌కు భూమిని సైతం కేటాయించింది. చీఫ్ మెంటార్‌గా రామ్ సిరికల్ బేరింగ్స్ ఉత్పత్తిని 2012లో ఆరంభించనున్నారు. ఇప్పటివరకు విదేశాల నుంచి దిగుమతి అవుతున్న ఈ సిరికల్ బేరింగ్స్‌ను రామ్ రూపొందించటంతో దేశీయంగానే వీటి ఉత్పత్తి చేయనున్నట్లు రామ్ స్నేహితుడు, టెక్నో ప్రో కంపెనీ ప్రమోటర్ కామేశ్వర్ చెప్పారు.
వరల్డ్‌వెబ్ అధినేతతో భేటీ
వివిధ పనులకు ఉపయోగపడేలా సరికొత్త సాఫ్ట్‌వేర్‌లను రూపొందించేందుకు కృషి చేస్తున్నానంటారు రామ్. "ఇందులో భాగంగా నాకు ఈ నెల 17వ తేదీన వరల్డ్ వెబ్ అధినేత టీఎం బెర్న్‌ర్స్‌లీ ఎంఐటీ మీడియా లాబ్‌లో కలిసేందుకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ఆయనతో కలిసి చర్చించి మరిన్ని సాఫ్ట్‌వేర్‌లు రూపొందిస్తానన్నారు''రామ్. ఐటీలో ఎంఎస్ పూర్తి చేసిన దశరథరామ్‌కు పలు అవార్డులు లభించాయి. ఫైనాన్షియల్ ప్యాట్రన్ డిజైన్‌లో ఈయనకు గోల్డ్‌మెడల్ లభించింది.
ఎంఎస్ అనంతరం క్యాంపస్ సెలక్షన్స్‌లో పాల్గొన్న 11 మల్టీనేషనల్ కంపెనీలు ఈయనకు ఉద్యోగాల ఆఫర్లు ఇచ్చాయి. దీంతో ఎక్కువ కంపెనీల ఇంటర్వ్యూల్లో అర్హత సాధించి ఈయన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులోకి ఎక్కాడు. దేశంలోనే ఉత్తమ విద్యార్థిగా మన దేశ ప్రధాని మన్‌మోహన్‌సింగ్ నుంచి అవార్డు పొందాడు. ప్రతిష్ఠాత్మక మైన స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి స్టాన్‌ఫోర్డ్ టెక్నోక్రాట్ ఆఫ్ ఇండియా అవార్డు సాధించారు.
క్యూ కట్టిన బడా కంపెనీలు!
అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలో ఉన్న సైన్స్‌కాంగ్రెస్ హాలు అది...2011వ సంవత్సరం నవంబరు 28వ తేదీ...ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 13 మల్టీ నేషనల్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు సరికొత్త సాఫ్ట్‌వేర్ అల్గోరిథమ్ ఆక్షన్‌లో పాల్గొనేందుకు తరలివచ్చారు. ప్రపంచ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ జెయింట్‌గా పేరొందిన కొమెరికా మన కరెన్సీలో 13.67 కోట్ల రూపాయలకు అత్యధిక బిడ్ వేసి కొత్త సాఫ్ట్‌వేర్‌ను సొంతం చేసుకుంది.
ఈ కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఐక్యరాజ్యసమితి గుర్తించింది. గత సంవత్సరం సెప్టెంబరులో యూఎన్‌వో స్వతంత్ర సంస్థ విపో కొత్త సాఫ్ట్‌వేర్‌కు గుర్తింపు ఇచ్చింది. దీంతో ప్రపంచంలోని 87 దేశాల్లో దీనికి పేటెంట్ లభించింది. అమెరికాలో ఈ సాఫ్ట్‌వేర్‌ను విక్రయించేందుకు ఏటూ జడ్ కన్సల్‌టెన్సీ సాయంతో ఆక్షన్‌కు పెట్టగా కొమెరికా బ్యాంకు దీన్ని సొంతం చేసుకుంది. ప్రపంచ దేశాల నీరాజనాలందుకుంటున్న మన తెలుగుతేజానికి మనమూ హేట్సాఫ్ చెబుదాం.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more