![]() |
‘బెజవాడ’ సినిమా ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు ? ‘బెజవాడ’ నగర నేపథ్యంలో, నేను కాలేజీ చదువుకున్నప్పుడు నాకు తెలిసిన విషయాలు గురించి ‘బెజవాడ’ అనే సినిమా తీద్దామనే ఆలోచన వచ్చింది. వెంటనే అనౌన్స్ ఇచ్చా. అది చూసి వివేక్ నా దగ్గరికి వచ్చి ’సార్ మీరు అనౌన్స్ చేసిన టైటిల్ కి ‘నేను ఒక కథ అనుకుంటున్నాను’ అని అతను ఆ కథ చెప్పడంతో చాలా నచ్చింది. నన్ను ప్రొడ్యూస్ చేయమని కోరడంతో ఒప్పుకున్నా. మీ ఇన్వాల్వ్ మెంట్ ఎంత వరకు ఉంది ? నా ఇన్వాల్వ్ మెంట్ జీరో. స్రిప్టు, క్యారెక్టరైజేషన్, సాంగ్స్.. ఇలా ప్రతి విషయమూ... వివేక్ దే. ఆయనకు మీరు ఏమైనా సలహా ఇచ్చారా ? నేను ఒక్క సలహా కూడా ఇవ్వలేదు. ఇచ్చినా ఆయన తీసుకొడు. ‘బెజవాడ’లో ఉన్నది ప్రస్తుతం జరుగుతన్న కథ లేక గతాన్ని బేస్ చేసుకొని తయారు చేసిందా ? ఇది ఫిక్షనల్ స్టోరీ. దానికి టైమ్ బౌండ్ ఏదీ ఉండదు. ‘బెజవాడ’ అనే టైటిల్ పడింది మొదలు... ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది అనేది ఇందులో చర్చించడానికి అవకాశం లేదు. అంత గ్రిప్పింగ్ గా సినిమా ఉంటుంది. ‘బెజవాడ’లో ఉండే రెండు వర్గాలకు సంబంధించిన కథా ఇది ? భగవంతుడి సాక్షిగా... ‘‘బెజావాడ’ కల్పిత కథ. ఎవరిని ఉద్ధేశించి తీసింది కాదు. మీరు ఎప్పుడు రాజీ పడరు ? కానీ టైటిల్ విషయంలో రాజీ పడ్డారు ? కారణం ? మొదటిది నేనెప్పుడూ అన్నమాట నిలబెట్టుకోను. రెండోది నేను అన్నది ఆ టైంకి అనేస్తా. సాయంత్రానికి ఏదో మరో ఐడియా వస్తుంది. అప్పుడు మళ్ళీ దాని గురించి ఆలోచిస్తా. ‘బెజవాడ రౌడీలు’ టైటిల్ విషయానికి వస్తే... లగడపాటి నా క్లోజ్ ఫ్రెండ్. బెజవాడకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆయన కోరిక మేరకు మర్చాల్సి వచ్చింది. మీ ‘డిపార్టుమెంట్’ ఎంత వరకు వచ్చింది ? ‘డిపార్టుమెంట్’ షూటింగ్ పూర్తి అయ్యంది. ఫిబ్రవరిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఇందులో దగ్గుబాటి రాణా ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు. అతని యాక్టింగ్ బాగుంది. మళ్లీ తెలుగులో ఎప్పుడు దర్శకత్వం వహిస్తున్నారు ? ఇప్పట్లో ఆ ఆలోచన లేదు. భాలీవుడ్ లో మాత్రం ఓ లవ్ అండ్ ఎంటర్ టైనర్ చేస్తున్న. ’అబ్ తక్ ఎ చప్పన్’ అనే సినిమాని రూపొందిస్తున్నా. ‘రక్త చరిత్ర -3’ తీసే ఆలోచన ఏమైనా ఉందా ? ఇప్పట్లో లేదు. ఇంకా రెండు మర్డర్లు జరిగితే అప్పుడు ఆలోచిస్తా. మీరు తీయబోయే ’రామాయణం’ ఎలా ఉంటుంది ? తను తీసయబోయే ‘రామాయణం’ చిత్రం పేరడీగానో, కామెడీగానో తీయబోతున్నానని అందరూ అనుకుంటున్నారు. అది నిజం కాదు. నా ‘రామాయణం’ చాలా డిగ్నిఫైడ్ గా, సీరియస్ గా ఉంటుంది. ‘సర్కార్’లా ఓ ఫ్యామిలీ థ్రిల్లర్ గా ఉంటుంది. ‘చిత్రజ్యోతి’ సౌజన్యంతో.... |
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more