Vangaveeti Radha Slams AP CM Chandrababu Naidu

Vangaveeti fire on chandrababu

Vijayawada, YSR Congress Party, Vangaveeti Radha, Arrest Episode, Chandrababu Naidu, Common Sense Less Comments

Vijayawada YSR Congress Leader Vangaveeti Radha Fire on CM Chandrababu Naidu. Police Arrested them forcefully but, govt not take proper steps Radha Added.

చంద్రబాబు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు: వంగవీటి

Posted: 09/06/2017 06:40 PM IST
Vangaveeti fire on chandrababu

ఒక మహిళా, పైగా మాజీ ఎమ్మెల్యేను బలవంతంగా తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వైసీపీ నేత వంగవీటి రాధా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మండిపడ్డారు. ఒక మాజీ ఎమ్మెల్యే అయిన తనను కూడా పోలీసులు బలవంతంగా లాక్కెళ్లినా చంద్రబాబు ఇంతవరకు చర్యలు తీసుకోలేదని ఆయన మండిపడ్డారు. వాస్తవాలను తెలుసుకోకుండా చంద్రబాబు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని అన్నారు.

బెజవాడలో అసలేం జరిగింది?

 

వైసీపీలో ఎవరు తప్పు చేసినా వెంటనే చర్యలు తీసుకుంటారని చెప్పారు. వంగవీటి రంగా గురించి తమ నేత ఒకరు తప్పుగా మాట్లాడితే, తమ అధినేత జగన్ వెంటనే చర్యలు తీసుకున్నారని అన్నారు. ఇదే సమయంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఏమి చేసినా చంద్రబాబు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కొందరు టీడీపీ ప్రజాప్రతినిధులు అధికారులపై దాడులకు కూడా దిగారని... అయినా చంద్రబాబు వారిని ఏమీ అనలేదని విమర్శించారు. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సాక్షాత్తు చంద్రబాబునే విమర్శించినా పట్టించుకోని దుస్థితి టీడీపీలో నెలకొందని అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుకు కామన్ సెన్స్ కూడా లేదని... మొన్న జరిగిన విషయాన్ని తెలుసుకోకుండానే మాట్లాడుతున్నారని రాధా మండిపడ్డారు. ప్రెస్ మీట్ కు వెళుతుండగా తనను పోలీసులు అడ్డుకున్నారని.. ఆ తర్వాత తనను, తన తల్లిని రోడ్లపై ఈడ్చుకుంటూ వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు జరిగిన ఘటనపై విచారణ జరిపించాలని, చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన అధికారులను శిక్షించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more