JC Diwakar Reddy Controversial Comments On YS Jagan Deeksha For Ap Special Status | AP Assembly

Jc diwakar reddy controversial comments ys jagan deeksha ap special status

jc diwakar reddy, jc diwakar controversy, ap special status, ys jagan deeksha, jagan deeksha for special status, jc diwakar controversial comments, anantapur mp

JC Diwakar Reddy Controversial Comments YS Jagan Deeksha Ap Special Status : The Controversial MP JC Diwakar Reddy Says If Jagan Will Fire Himself.. Then Also Ap Special Status Not Come.

‘జగన్ నిప్పంటించుకున్నా.. ‘హోదా’ రాదు’ : జేసీ

Posted: 09/02/2015 03:46 PM IST
Jc diwakar reddy controversial comments ys jagan deeksha ap special status

ప్రత్యేక హోదా అంశమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళన పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. ఓవైపు రాష్ట్రప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తుండగా.. జనాల్లో మమేకమయ్యేందుకు ఇదే మంచి అవకాశమని భావించిన వైసీపీ కూడా వారి బాటలోనే నడుస్తోంది. టీడీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతోపాటు నిరసనలు, దీక్షలకు దిగుతోంది. ఇప్పటికే జగన్ ‘స్పెషల్ స్టేటస్’ కోసం ఢిల్లీలో ఓ రోజు దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే! దానిపై టీడీపీ నేతలు తమదైన రీతిలో సెటైర్లు వేశారు. భవిష్యత్తులో కూడా వైసీపీ నిరవధిక దీక్షలు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈ దీక్షలపై తాజాగా జేసీ దివాకర్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు చేశారు.

వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్రబిందువుగా మారిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. జగన్ దీక్షలను ఆయన ఓ గిమ్మిక్కేనని తేల్చిపారేశారు. అయినా.. దీక్షలకు మహాత్మాగాంధీతోనే కాలం చెల్లిపోయిందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఒకవేళ జగన్ పెట్రోల్ పోసుకుని, తగులపెట్టుకున్నా ఏపీకి ప్రత్యేకహోదా రాదని చెప్పారు. ‘జగన్ దీక్ష ఓ గిమ్మిక్కు. ఆయన దీక్ష వృథా. మంత్రాలకు చింతకాయలు రాలవు. దీక్ష చేస్తే పోలీసులు ఎత్తుకెళ్లి ఇంజక్షన్లు ఎక్కిస్తారు. అంతెందుకు.. పెట్రోల్ పోసుకుని తగులబెట్టుకున్నా ఏపీకి ప్రత్యేక హోదా రాదు’ అని జేసీ తేల్చి చెప్పారు. ఈ విధంగా ఈయన చేసిన వ్యాఖ్యలు ఎన్ని సంచనాలకు దారితీస్తుందో?

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jc diwakar reddy  ys jagan mohan reddy  ap special status  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more