Former Central Minister Chiranjeevi Controversial Comments Chandrababu Naidu Govt

Chiranjeevi controversial comments chandrababu naidu govt

chiranjeevi, chiranjeevi news, chiranjeevi controversy, chiranjeevi politics, chiranjeevi updates, chiranjeevi photos, chandrababu naidu, chandrababu naidu controversy, amaravathi, ap capital city, congress party, rahul gandhi

Chiranjeevi Controversial Comments Chandrababu Naidu Govt : Former Central Minister Chiranjeevi Controversial Comments Chandrababu Naidu Govt. He said babu failed to fulfil promises.

తూతూమంత్రంగా బాబు పనిచేస్తూ చంకలు గుద్దుకుంటున్నారు

Posted: 07/24/2015 03:45 PM IST
Chiranjeevi controversial comments chandrababu naidu govt

కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేశారని చిరు ఆరోపించారు. రైతులకు రుణమాఫీ విషయంలో మోసం చేశారని, సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు చేయడంలో బాబు విఫలమయ్యారంటూ ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలో చేపట్టిన భరోసా యాత్రం సందర్భంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలోనే బాబు మీద చిరంజీవి అంతెత్తున ఎగిసిపడ్డారు. బాబుపై చిరు చేసిన కామెంట్లు ఇలా..

* ఎన్నికల ముందు ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేశారు.
* రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన బాబు, ఆ విషయంలో విఫలమయ్యారు.
* రూ.80 వేల కోట్ల విలువైన రుణాలను మాఫీ చేయాల్సింది, కేవలం రూ.7 వేల కోట్లతో సరిపెట్టుకున్నారు.
* ఇచ్చిన హామీలను పూర్తిచేయకుండా తూతూమంత్రంగా పనిచేస్తూ బాబు చంకలు గుద్దుకుంటున్నారు.
* బ్యాంకు నుంచి లక్షన్నర రుణం తీసుకున్న ఓ రైతుకు రుణమాఫీలో భాగంగా కేవలం రూ.8 వేలు మాత్రమే దక్కింది.
* రుణమాఫీ విషయంలో రైతులకు మీరు చేసే మేలు ఇదేనా? అంటూ ప్రశ్నించారు.
* విభజన సమయంలో ఇచ్చిన హామీలను, విభజన చట్టాన్ని అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.
* రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని తాను నమ్మకంగా చెప్పగలనని చిరంజీవి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chiranjeevi  rahul gandhi  chandrababu naidu  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more