ఇప్పుడు సీమాంద్ర నాయకులకు, తెలంగాణ నాయకులు మద్య నలుగుతున్న సమస్య భద్రచలం. దీనిపై కేంద్ర నాయకులతో చర్చలు జరుపుతున్నారు. ఇలాంటీ సమయంలో కాంగ్రెస్ పైర్ బ్రాండ్ అయిన రేణుక చౌదరి.. భద్రాచలాన్ని వదిలేయండి? లేకపోతే నా తడాఖా ఏమిటో చూపిస్తానని హెచ్చరించారు. భద్రచలం తెలంగాణలో ఉండాలని ఆమె స్పష్టం చేశారు. అలాకాదని తెలంగాణ ప్రాంతం నుంచి భద్రాచలాన్నివిడతీస్తే నా తడాఖా చూపిస్తానని అంటున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు.
సీఎం కిరణ్ తెలంగాణ వ్యతిరేకి కాదని ఆమె పేర్కొన్నారు. 'మా అమ్మ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆమెను దగ్గరండి చూసుకోవాలి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతలు నిర్వహించలేనని' కాంగ్రెస్ అధిష్టానానికి తెలియజేశానని రేణుకాచౌదరి వెల్లడించారు. అందువల్లే తను ఆ బాధ్యతల నుంచి కాంగ్రెస్ అధిష్టానం తప్పించిందని రేణుకా చౌదరి చెబుతున్నా కారణం . అయితే దీనికి మరోకారణం ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. రేణుకా చౌదరికి జాతీయ స్థాయిలో పార్టీలో మరో పదవి దక్కే అవకాశం ఉంది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ హామీ ఇచ్చినట్టు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది. పార్టీ పదవి నుంచి తప్పుకోవడంపై భిన్న కథనాలు వినవస్తున్నప్పటికీ, రేణుకా చౌదరి స్వచ్ఛందం గానే పదవి నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.
జాతీయ స్థాయిలో ఏఐసీసీ మీడియా సెల్ చైర్మన్ అజయ్ మాకెన్ కు, రేణుకాచౌదరికి మధ్య పొడ సూపిన విభేదాలే పదవి నుంచి తప్పుకోవడానికి కారణమని ఢిల్లీ వర్గాల బోగట్టా. అజయ్ మాకెన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం పలు సందర్భాలలో ఇరువురి మధ్య అభిప్రాయ బేధాలు పొడసూపినట్టు సమా చారం. రేణుకా చౌదరి ఇమడలేని పరిస్థితులలో పది రోజుల క్రితమే పార్టీ అధ్యక్షురాలు సోనియా కు రాజీనామా లేఖను పంపించడం జరిగింది. రేణాకాచౌదరి పట్ల సానుభూతి ప్రకటించిన సోనియాగాంధి మరో వైపు పార్టీలో గుర్తింపు వుండేలా మరో పదవిని ఇస్తానని సముదాయించినట్టు తెలిసింది.
ప్రస్తుత పరిస్థితులలో ఎఐసిసి జాతీయ మీడియా సెల్ చైర్మన్‌గా అజయ్‌మాకెన్‌ను కొనసాగించకూడదని రేణుకా చౌదరి ఫిర్యాదు చేయడం జరిగింది. తనకు పదవి వున్నా, లేకపోయినా పార్టీ అభివృద్ది కోసం కృషి చేస్తానని ప్రకటించిన రేణుక ఎలాంటి బాధ్యత లు అప్పగించినా పనిచేస్తానని సోనియా వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే త్వరలో పార్టీలో సముచితమైన పదవిని ఇస్తామని సోనియా హామీ ఇచ్చినట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. అందుకే రేణుకమ్మ .. త్వరలో నా తడాఖా ఏమిటో చూపిస్తానని తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసురుతున్నరని.. రాజకీయ వర్గాలు అంటున్నాయి. రేణుకమ్మ దగ్గర ఇంత విషయం ఉందా అని కాంగ్రెస్ నాయకులే.. నోర్లు వెల్లబెట్టి చూస్తున్నారు. ఏమైన ఫైర్ బ్రాండ్ అంటే .ఫైర్ బ్రాండే అని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more