మెగా స్టార్ చిరంజీవి అంటే అందరికి అభిమానం ఒప్పుడు ఉండేది. కానీ మెగాస్టార్ చిరంజీవి కాస్తా, మంత్రి చిరంజీవిగా మారిపోయినప్పటి నుండి. రాజకీయ విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే టాలీవుడ్ నటుడు విక్టరీ వెంకటేష్ ఎప్పుడు ఎవరి గురించి పెద్దగా మాట్లాడింది లేదు. అలా అని ఎవరిపై ఇప్పటి వరకు కామెంట్ చేసింది కూడా లేదు. చిరంజీవి, వెంకటేష్ ల మంచి స్నేహ బంధాలే ఉన్నాయి. అయితే వారి ఎప్పుడు ఒకరినొకరు .. గౌరవించుకుంటూ గౌరవంగా ఉంటారు. అయితే అలాంటి ఈ ఇద్దరి పై టాలీవుడ్ లో ఒక పుకారు వినిపిస్తుంది. అసలు ఇంతకీ పుకారు ఏమిటయ్యా అంటే.. రీసెంట్ గా వికర్టీ వెంకటేష్ నటించిన మాసాల సినిమా గురించి మీడియాలో ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది.
అయితే ఆ సమయంలో వెంకటేష్ ని .. ఒక రాజకీయ ప్రశ్న వేయటం జరిగింది. అంటే మీరు రాజకీయాల్లో వచ్చే ఆలోచన ఏమైన ఉందా అని అడిగితే.. వెంటనే వెంకీ చాలా సీరియస్ గా సమాధానం చెప్పాడు. ‘‘నిజాయతీపరుల కోసం కాదు రాజకీయాలు ఉన్నది, నిజాయతీగా ఉండాలనుకునే వాళ్లు రాజకీయల్లో ఉండలేరని అన్నారు. అంతేకాకుండా.. రాజకీయాలు మనిషిలోని చెడు లక్షణాలను బయటకు తెస్తాయని, అప్పుడు ఆ రాజకీయ నాయకుడు కూడా అలాగే కనిపిస్తాడు. అయితే నా విషయంలో అలా జరగడం నాకు ఇష్టం లేదని స్పష్టంగా వెంకీ లేవల్లో చెప్పాడు. అంటే రాజకీయాలను , రాజకీయాల్లో ఉన్న నిజాయతీ పరులను నేనేప్పుడు గౌరవిస్తాను. రాజకీయ నాయకులు వారి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించే నాయకులనే నేను ఇష్టపడతానని వెంకీ తన మనసులో రాసుకున్న రాజకీయపు మాటలను చెప్పటం జరిగింది.
అయితే వెంకీ ఇక్కడ ఏ రాజకీయ నాయకుడ్ని ఉద్దేశించి చెప్పిన మాటలు మాత్రం కావు. కానీ ఆ మాటలు విన్నవారు మాత్రం విపరీతార్థాలు తీసి, టాలీవుడ్ లో వదిలినట్లు సమాచారం. వెంకీ చేసిన రాజకీయ కామెంట్స్ మంత్రి చిరంజీవికే వర్థిస్తాయనే పుకార్లు టాలీవుడ్ లో చకర్లు కొడుతున్నాయి. వెంకీ ఇన్ డైరెక్టుగా .. చిరంజీవి మీద కామెంట్ చేశాడనే విమర్శలు ఫిలింనగర్లో వినిపిస్తున్నాయి. చివరకు ఎప్పుడు సైలెంట్ గా తన పని తను చేసుకుపోయే వెంకీ ని కూడా పుకార్లు గంపలోకి లాగడం మంచిది కాదని వెంకీ అభిమానులు అంటున్నారు. అసలే మాసాల సినిమాలో ఘాటు ఎందుకు తగ్గిందనే దాని పై వెంకీ ఆలోచన చేస్తున్నాడని వికర్టీ అభిమానులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more