ఇప్పటి వరకు మనకు ఆంద్రప్రదేశ్, మద్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, లాంటి పేర్లు తెలుసు. ఇక నుండి సరికొత్త పేరు రాబోతుంది. గుంటూరు కాంగ్రెస్ ఎంపీ రాయపాటి సాంబశివరావు మరో కొత్త ప్రదేశ్ ను కనుగొన్నారు. ఇప్పటి వరకు అందరు ఆంద్రప్రదేశ్ అని పిలిస్తే.. ఇక నుండి తెలంగాణ ప్రదేశ్ గా పిలవాలని ఆయన కోరుతున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలంటే... ఇదొక్కటే మార్గం అని మన రాయపాటి సాంబశివరావు అంటున్నారు.
సమైక్యాంద్ర కోసం ఎంపీ పదవికి రాజీనామ చేసి, ఢిల్లీలో చంద్రబాబు సమైక్యాంద్ర కోసం చేసిన దీక్షకు మద్దతు తెలిపి, జగన్ సమైక్యశంఖారావం సభను సమర్థించిన ఘనత మన రాయపాటి వారికే దక్కింది. అయితే ఇటీవల కాలంలో సమైక్యాంద్ర కోసం రాయపాటి వారు సీమాంద్రలో కొత్త పార్టీ పెడతారనే వార్తలు పుష్కలంగా వినిపించాయి. కానీ ఈరోజు మాత్రం మరోల మాట్లాడుతున్నారు. నేను ఎప్పటికీ సమైక్యవాదినేనని ఆయన అన్నారు.
అయితే రాష్ట్ర విభజన పై రాయపాటి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ను తెలంగాణ ప్రదేశ్ గా మార్చుకున్నా తమకు అభ్యంతరం లేదని అన్నారు. అయితే రాష్ట్రాన్ని, తెలుగు జాతిని విభజించవద్దని రాయపాటి కోరారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నానని, సమైక్యంగా ఉంటేనే కాంగ్రెస్ పార్టీకి లాభమని ఆయన అన్నారు. కొంతమంది సీమాంద్ర కాంగ్రెస్ నేతలు మాత్రం సమైక్యాంద్ర వద్దు.. విభజన ముద్దు అంటున్నారు. రాష్ట్ర విభజనకు మద్దతు ఎక్కువుగా తెలుపుతుంది కూడా సీమాంద్ర కాంగ్రెస్ నాయకులే. అలాంటి వారిలో.. కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు, కిళ్లి క్రిపారాణి, పనబాక లక్ష్మీ, పళ్లం రాజు, డి. పురందేశ్వరి అలాంటి సీమాంద్ర కాంగ్రెస్ నేతలే బహిరంగంగా రాష్ట్ర విభజనను అంగీకరిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం కావలని.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. 100 పేజీల నివేదిక జీవోయంకు సమర్పిస్తే, సమైక్యాంద్ర కావాలని 10 పేజీల నివేదికను జీవోయంకు సీమాంద్ర నేతలు సమర్పించటం జరిగింది. ఇక్కడే.. సమైక్యాంద్రను ఎంతమంది కోరుకుంటున్నారో అర్థమవుతుందని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఇలాంటి సందర్భంలో రాయపాటి వారు సమర్పించిన ‘‘తెలంగాణ ప్రదేశ్ ’’ను కాంగ్రెస్ హైకమాండ్ పట్టించుకుంటుందో లేదో చూడాలి. అయితే తెలంగాణ నేతలు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ పేరు కోసం ఉద్యమం చేయలేదు. ప్రత్యేక రాష్ట్రం కోసమే తెలంగాణ ప్రజలు ఉద్యమం చేసిన విషయం రాయపాటి ఎలా మరిచిపోయారో అర్థం కావటం లేదని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more