నిన్నటి వరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి జై కొట్టిన మంత్రి డీకే అరుణ ఈ రోజు సిఎంకు సవాల్ విసురుతుంది. రాష్ట్ర విభజన కు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడని ఢికే అరుణ మండిపడుతున్నారు. రాష్ట్ర విభజన ఆపుతామంటూ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఆప్రాంత ప్రజలను మభ్యపెడుతున్నారని, ఎవరెన్ని చేసినా విభజన ప్రక్రియ ఆగదని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేవలం సీమాంధ్ర ప్రాంతానికి మాత్రమే సీఎంగా వ్యవహరిస్తున్నారని డీకె అరుణ వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే టీ కాంగ్రెస్ నేతలు ఆయనకు దూరంగా ఉంటున్నారని ఆమె తెలిపారు. సీఎం తన వ్యవహారశైలిని మార్చుకుని.. ఇరుప్రాంత నేతలతో చర్చలు జరపాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణా నేతలు అందరూ కలిసి కిరణ్ రెడ్డిని కలిసి రాష్ట్ర విభజనకు సహకరించాలని తమ ముఖ్యమంత్రిగా తమ అభిప్రాయాన్ని కూడా అధిష్టానంకు తెలియజేయాలని కోరనున్నారు. అయితే ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశం అవుతున్నారు. ఈ సమవేశంలో ముఖ్యమంత్రి వైఖరి పై ఒక నిర్ణయం తీసుకోవటం జరుగతుందని ఢికే అరుణ అన్నారు. సీఎం తన పద్దతి మార్చుకోవలాని, లేకపోతే.. తెలంగాణ నాయకుల, తెలంగాణ ప్రజల ఆగ్రహానికి బలవుతారని డికే అరుణ హెచ్చరించారు. అవసరమైతే ఎలాంటి సవాల్ నైన ఎదురుకోవటానికి తాము సిద్దంగా ఉన్నమని అరుణ అన్నారు. ఈ విషమం ముఖ్యమంత్రి తెలుసుకోవాలని అరుణ సూచించారు. సీమాంద్ర కాంగ్రెస్ నాయకులు మాత్రం మాకు ఒక బ్యాట్స్ మెన్ ఉన్నాడని, అతను రంగంలోకి దిగితే.. రాష్ట్ర విభజన ఆగిపోవటం ఖాయమని అంటున్నారు. సేవ్ ఆంద్రప్రదేశ్ సభ సక్సెస్ వెనుక కూడా మా బ్యాట్స్ మెన్ ఉన్నాడని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మీడియా ముందు చెప్పటంతో.. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో ఉన్న అనుమానాలకు బలం చేకూరింది. దీంతో సీఎంకు సన్నిహితంగా ఉండే మంత్రి అరుణ సైతం సీఎంకు సవాల్ విసిరే స్థాయికి ఎదిగిపోయింది. మంత్రి డీకే అరుణ సవాల్ ను ముఖ్యమంత్రి ఎలా స్వీకరిస్తాడో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more