ఈ నెల 7 న లాల్ బహాదుర్ స్టేడియంలో నిర్వహించదలచుకున్న బహిరంగ సభకు పోలీసు శాఖ ఎట్టకేలకు ఎపిఎన్జీవోలకు అనుమతినిచ్చింది. శాంతి భద్రతల దృష్ట్యా ముందు అనుమతిని నిరాకరించిన పోలీసు శాఖ ఎపిఎన్జీవోల ప్రతిపాదనను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట వారికి అనుమతినిచ్చింది. ఆ మేరకు డిసిపి కమలాసన్ రెడ్డి నిన్న రాత్రి ప్రకటన చేసారు. అయితే షరతులకు లోబడిన అనుమతిని ఇవ్వటం జరిగింది. ఆ షరతులు ఇవి-
మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన సభను సాయంత్రం 5 గంటలకల్లా ముగించవలసి వుంటుంది. ఉద్యోగులు, ఉద్యోగ సంఘ ప్రతినిధులకు మాత్రమే సభలో ప్రవేశముంటుంది, అందుకు వారు తమ తమ ఐడెంటిటీ కార్డ్ లను తప్పక తీసుకునిరావలసి వుంటుంది. నీళ్ళ సీసాలు, అగ్గిపెట్టెలు సభలోకి అనుమతి లేదు. సభకు వచ్చేటప్పుడు గుంపులు గుంపులుగా కాకుండా ఒక్కొక్కరే క్రమపద్ధతిలో రావలసి వుంటుంది.
లోగడ ఏపి ఎన్జీవోలు సభకు అనుమతిని కోరగా, అదే రోజు శాంతి ర్యాలీలు, మిలియన్ మార్చి-2 నిర్వహిస్తామంటూ తెలంగాణా రాజకీయ ఐకాస, విద్యార్థి సంఘ ఐకాసలు కూడా అనుమతిని కోరాయి. అనుమతి ఇవ్వకపోయినా మార్చ్ ని నిర్వహిస్తామంటూ నిర్ణయం తీసుకున్న సమాచారం అందటంతో ర్యాలీలు, సభలు, మైకులు ఉపయోగించటాల మీద పోలీసు కమిషనర్ అనురాగ శర్మ ఆంక్షలు విధిస్తూ ప్రకటన చేసారు.
సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఈ నెల 7 వ తేదీన మొట్టమొదటి సారిగా జరగబోతున్న సమైక్యాంధ్ర ఉద్యమకారుల సభకు ఎన్నడూ జరగని విధంగా సభకు వేలాదిగా హాజరై సభను దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చిన సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను ప్రభుత్వం ఆ రోజు కుదించే లేక నిలిపివేసే అవకాశం ఉంది కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు రెండు రోజులు ముందుగానే హైద్రాబాద్ చేరుకోవలసిందిగా సూచించారు.
ఈ లోపులో మంగళవారం సిహెచ్ ఉపేంద్ర అనే అడ్వకేట్ ఈ సభకు అనుమతినివ్వగూడదంటూ ఆదేశాలివ్వవలసిందిగా హైకోర్ట్ లో పిటిషన్ వేసారు. దీని ద్వారా ఇరు ప్రాంతాల మధ్యా వైషమ్యాలు చోటు చేసుకునే అవకాశం ఉందని, అసలు ఎపిఎన్జీవోల సమ్మె చట్ట వ్యతిరేకమైనదని, ఈ సభ ద్వారా కొందరు సంఘవిద్రోహ చర్యలకు వ్యూహాలు రచిస్తున్నారని అందువలన ఆ సభను అనుమతించరాదని పిటిషనర్ అభ్యర్థన.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more