Chandrababu bus yatra

Chandrababu bus yatra, Atma gourava yatra, Chandra Babu Naidu, NT Rama Rao, Congress party, YSR Congress party, Telugu Desam Party

Chandrababu bus yatra

ఆత్మగౌరవ యాత్రలో విమర్శనాస్త్రాలు

Posted: 09/03/2013 04:03 PM IST
Chandrababu bus yatra

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తాజాగా చేస్తున్న బస్ యాత్రలో వైరిపక్షాల మీద విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. 

సీట్లు, ఓట్లు తప్ప మరేమీ పట్టని కాంగ్రెస్ పార్టీ ప్రజల మనోభీష్టాలను పట్టించుకోవటం లేదని, ప్రధాన మంత్రిని చూస్తే ఆయనేమో సోనియా గాంధీ చేతిలో కీలుబొమ్మై కూర్చున్నారని గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు అన్నారు. 

వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ, విజయమ్మ రోజుకో మాట మారుస్తున్నదని విమర్శించారు.  మాట తప్పము, మడమ తిప్పము అని చెప్పుకొస్తున్నవాళ్ళు కేసులను ఎత్తివెయ్యటం కోసం, బెయిల్ కోసం అన్నిటినీ తాకట్టు పెట్టే స్థితికి వచ్చారని ఆయన అన్నారు.

తెలుగు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని గ్రహించానని, అందువలన చావో రేవో వారితోనేనని చంద్రబాబు అన్నారు.  దివంగత ఎన్టీఆర్ ని గుర్తు చేస్తూ గంభీరమైన వాగ్ధాటితో కార్యకర్తలలో ఉత్సాహం నింపుతూ తెలుగువారి ఆత్మగౌరవ యాత్ర అని అన్నందుకు దానికనుగుణంగానే తన కంఠంలో తెలుగువారిపట్ల ఆవేదనను కనబరుస్తూ యాత్రలో ముందుకెళ్తున్న చంద్రబాబుని చూస్తుంటే తెదేపా శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. 

కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ దగ్గర ఎలా తోకాడిస్తున్నారు, పప్పు సుద్దలాంటి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తే దేశం ఎలా వెనక్కి పోయే అవకాశం ఉందన్న విషయాల మీద నిప్పులు చెరుగుతూ, తెలుగు జాతిని విడదీసి తద్వారా ప్రయోజనాన్ని పొందుదామని ఆశిస్తున్న సోనియా గాంధీకి మన తెలుగువాడి ఆత్మగౌరవం రుచి చూపించవలసిన సమయం వచ్చిందనే పంథాలో చంద్రబాబు మాట్లాడుతూ, రాజకీయ ఎత్తుగడలతో కాంగ్రెస్ పార్టీ, వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఏ విధంగా నాటకాలాడుతున్నాయో తెలియజేసుకుంటూ ముందుకెళ్తున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more