Formal deeksha by people s representatives

Deeksha by peoples representatives, MLAs MLCs deeksha, Seemandhra leaders deeksha, State bifurcation, Congress high command

formal deeksha by people's representatives

దీక్ష చేస్తాం, చేస్తాం, చేసేసాం అయిపోయింది

Posted: 09/03/2013 02:14 PM IST
Formal deeksha by people s representatives

అసెంబ్లీ ఆవరణలో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఆర్భాటంగా చేసిన దీక్ష ఉదయం పది గంటలకు మొదలై ఒంటి గంట కొట్టేసరికి పూర్తయిపోయింది కూడా. 

47 మంది సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఈ దీక్షలో పాల్గొన్నారు కాబట్టి భారీగా పోలీసుల మోహరింపు కూడా జరిగిందక్కడ.  మేమూ మీకు మద్దతునిస్తున్నామని హైద్రాబాద్ నుంచి చెప్పటం కోసం చేసిన మూడు గంటల దీక్షలో ఫొటో సెషన్స్, వీడియో కవరేజ్ లు మీడియాతో మాట్లాడటంతో సరిపోయింది. 

ఒకప్పుడు తెలంగాణా కాంగ్రెస్ నాయకులు కూడా ఇదే పరిస్థితిలో ఉండేవారు.  వారి వారి సొంత నియోజక వర్గానికి పోతే రాజీనామాలు చెయ్యమని నిలదీసేవారు, చెయ్యకపోతే తెలంగాణా ద్రోహి అని ముద్ర వేసేవారు.  ఇప్పుడు సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుల పరిస్థితి కూడా అలాగే తయారైంది.  ఇటు ఆందోళన చేస్తున్న ఉద్యమకారులకూ ఏమీ చెప్పలేరు, పార్టీ పెద్దలకీ ఏమీ చెప్పలేరు.  పార్టీ తరఫునుంచి ప్రజలకూ ఎటువంటి హామీలివ్వలేరు, ఆందోళనను నియంత్రిస్తామని అధిష్టానానికీ మాటివ్వలేరు.   రాజకీయాలనే నమ్ముకుని ఉండటం వలన పదవులనూ వదులుకోలేరు, అధికార వర్గంలో ఉన్నా ఏమీ తాముగా చెయ్యలేరు.  ఏదో చేస్తున్నట్టుగా ఉండాలి, కానీ అధిష్టానాన్ని ధిక్కరించిన సంకేతాలూ పోగూడదు.  చాలా ఇరకాటమైన పరిస్థితి. 

అదే చోట ఇంకా ఎక్కువ దీక్ష చేసి పార్టీ ఆగ్రహానికీ గురవలేరు, ఏమీ చెయ్యకుండా మౌనంగా ఉండిపోయి జనాగ్రహానికీ గురికాలేరు. చేతిలో అధికారం లేదు అని చెప్తే, మరి మిమ్మల్ని గెలిపించింది ఎందుకు అని ప్రజలు నిలదీసి అడుగుతారు, పోనీ ప్రజలే ఎన్నుకున్నారు కాబట్టి వారి పక్షాన పోరాడదామా అంటే ఉన్న అధికారాలు కూడా ఊడతాయేమోననే భయం.  తెలంగాణా కాంగ్రెస్ నాయకులను అంతకు ముందు చూసారు కానీ ఆ పరిస్థితి తమకూ వస్తుందని ఊహించని నాయకులు పాపం చాలా ఇరకాటంలో పడ్డారు. 

అయినా నిరాశపడకుండా, చిరునవ్వు చెరగకుండా, లోపలి భయాలు బయటకు కనపడకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ నడుచుకుంటున్న సీమాంధ్ర నాయకులు ప్రజల ఆందోళనను అర్థం చేసుకుని వారికి మద్దతుగా దీక్ష చేస్తామని అన్నారు, అన్న మాట ప్రకారం మూడుగంటల దీక్ష చేసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more