ఎప్పుడూ వెనక ఉండి నడిపించటం, కనుసైగలతోనే పార్టీ నాయకులను నియంత్రించటం చేసే అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ రోజు పార్లమెంటులో ఉపన్యాసం ఇవ్వటానకి సన్నిద్ధమయ్యారు. దానికి కారణం ఆహార భద్రతా ముసాయిదాకి పార్లమెంటు ఆమోదముద్ర వేయించటం కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకమైన చర్యగా భావిస్తోంది.
పాకిస్తాన్ సరిహద్దులలోని ఉద్రిక్త వాతావరణం, హింసాత్మక చర్యలు, సరిహద్దు ఒప్పందాలను అతిక్రమిస్తున్న పాకిస్తాన్ వంటి అంశాలతో ప్రతిపక్షాలు హోరెత్తిస్తుండగా సొంత పార్టీ నుంచే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు విషయంలో నిరసనలు వెరసి ఆహార భద్రతా బిల్లుకి పార్లమెంటులో చర్చకు అవకాశం లభించటంలేదు.
ఇది ఇలాగే కొనసాగితే ఈ పార్లమెంటు సమావేశాలలో ఆగస్ట్ 30 లోపులో చోటుచేసుకోలేకపోతే బిల్లుకి కాలం చెల్లిపోతుంది. ఈ బిల్లు పాసవటం ద్వారా దేశంలోని 70 శాతం మందికి లబ్ధి కలగటమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి 2014 ఎన్నికలలో ఓట్లు సంపాదించిపెట్టే బిల్లు అవుతుంది. అయితే ప్రభుత్వానికి 1.25 లక్షల కోట్ల రూపాయల భారం కూడా పెంచుతుంది. అయినా దీన్ని రాజీవ్ గాంధీ జయంతికి పార్లమెంటులో ఆమోదింపజేయాలని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తోంది. అందుకోసం ఇప్పటికే ఇతర పార్టీల అభిప్రాయాన్ని తెలిసుకుని తదనుగుణంగా కసరత్తులు చేసిన కాంగ్రెస్ పార్టీ బిల్లులో మార్పులు, చేర్పులు చెయ్యటం జరిగింది. ప్రస్తుతం చేసిన మార్పులు బిల్లుని అందరికీ ఆమోదయోగ్యంగా చేసిందంటూ పార్లమెంటు వ్యవహారాల మంత్రి కమలనాధ్ ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.
ఈ మధ్య కాలంలో దేశంలో పలు ప్రాంతాల్లో చిన్న పిల్లలకు కలిగిన అనారోగ్యం, బీహార్ రాష్ట్రంలోనైతే ఏకంగా మరణాలే సంభవించిన నేపథ్యంలో ఆహార భద్రతలో మిడ్ డే మీల్స్ విషయంలో కూడా తాజాగా వేడి వేడిగా వడ్డించాలనే నిర్ణయం తీసుకోవటానికి కూడా ప్రతిపాదన చేసినట్టుగా కనిపిస్తోంది.
ఆహార భద్రతా బిల్లు ప్రవేశపెట్టకుండా పార్లమెంటులో గందరగోళ పరిస్తితి అలాగే కొనసాగితే సోనియా గాంధీ స్వయంగా పూనుకుని దాని మీద పార్లమెంటులో మాట్లాడటానికి సిద్ధమై ఉన్నారని సమాచారం.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more