ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్ తో రోజుకో కొత్త రాజకీయ పార్టీ పుట్టగొడుల్లా పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో. మొన్నటి వరకు ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం తెలంగాణాలో పార్టీలు ఏర్పడితే... కేంద్రం తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఇప్పుడు సీమాంధ్రలో కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాయలసీమ పరిరక్షణ కోసం ఈ మధ్యే కొత్త పార్టీని ప్రకటించాడు. ఇప్పుడు సీమాంధ్రలో మరో పార్టీ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. సీమాంధ్రలో ప్రజలు, నాయకులు సమైక్యాంధ్ర ప్రదేశ్ ను కోరుకుంటున్నారు. దీంతో అక్కడి నాయకులు రాజకీయ భవితవ్యం కోసం కొత్తపార్టీని ఏర్పాటు చేయవచ్చనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్మే రౌతు సూర్యప్రకాష్ రావు. ప్రజల మనోగతం మేరకు వారు పూర్తి స్థాయిలో సమైక్య ఉద్యమంలో పాల్గొనాలన్నా, వచ్చే ఎన్నికలకు సిద్దం కావాలన్నా సీమాంధ్రలో కాంగ్రెస్ తరపున సాధ్యమయ్యే పరిస్థితి కనబడడం లేదు.కాంగ్రెస్ అంటేనే ప్రజలు మండిపడుతున్నారు.
ఈ నేపధ్యంలోనే కొత్త ఆలోచన మొదలైందనే సంకేతాలు ఇస్తున్నారాయన. ఏర్పడబోయే కొత్త పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ శాఖగానే వస్తుందని, దీని పై పది పదిహేను రోజుల్లో స్పష్టమైన ప్రకటన రావచ్చని అంటున్నాడు. ఈ కొత్త పార్టీకి ముఖ్యమంత్రి కిరణ్ నాయకత్వం వహిస్తాడని ఆయన సూత్ర ప్రాయంగా వ్యాఖ్యానించడం ఇక్కడ విశేషం. ఈ మధ్యకాలంలో కొందరు కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి కిరణ్ సన్నిహితుల వద్ద ఈ ఆలోచనను బయట పెట్టినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే కిరణ్ అలాంటి విషయాల్లో తొందర పడే వ్యక్తి కాదు....కానీ అంత కంటే మొండి. టైం వస్తే అధిష్ఠానం మాటలకు ఎదురు చెప్పేటువంటి ధైర్యవంతుడు. ఇప్పటి వరకు ఆయన నుండి ఎలాంటి రిప్లై రాలేదని అంటున్నారు.
గతంలో తెలంగాణ లో ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పేరుతో పార్టీ పెట్టబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ కొత్త పార్టీ ఏర్పాటుకు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఇప్పుడు కూడా రౌతు సూర్యప్రకాష్ రావు కూడా అలాగే హడావుడి చేస్తున్నాడు. కానీ కొంత మంది మాత్రం సీమాంధ్రలో ప్రజల ఆక్రోశం నుండి తప్పించుకోవడానికి వేసే వేషాలని, కాంగ్రెస్ అధిష్టాన వ్యూహంలో భాగంగానే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని అంటున్నారు. ఒకవేళ సీమాంధ్ర నాయకులు పార్టీ పెడితే... అధిష్టానాన్ని ఎదిరించి క్లిక్ అవుతుందా లేదా అన్నది చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more