నా ప్రైవేట్ లైఫ్ లోకి వచ్చే అధికారం మీకెక్కడుంది. చొరబాటుతనం మీడియాకు మంచిది కాదు. నేను నా విరామ సమయంలో స్పెయిన్ లోని ఇబిజా బీచ్ లో తిరుగుతుంటే నాకు తెలియకుండా నా అనుమతి లేకుండా ఫొటోలు తీసి ప్రచురించటం నాకు చాలా బాధని కలిగిస్తోంది – ఇవీ కత్రినా కైఫ్ మీడియాకు లిఖితపూర్వకంగా తెలియజేసిన విషయాలు.
మనందరికీ మన సొంత జీవితాలున్నట్లే సెలబ్రిటీస్ కి కూడా ఉంటాయి. పరదా మీద మనలను అలరించిన పాపాన వాళ్ళకంటూ ఒక జీవితం ఉండగూడదా. మనలను మనం ఆత్మ విమర్శ చేసుకుని వాళ్ళ స్థానంలో ఊహించుకుంటే మన మనసులూ బరువెక్కుతాయి. కాకపోతే వాళ్ళ కథలే పసందుగా వినబుద్ధవుతాయి కాబట్టి సినిమా నటీనటులు, క్రీడాకారులు, ఇంకా దొరికితే రాజకీయ నాయకుల జీవితాలలోని వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి భోగట్టా తీసుకుని రాస్తుంటారు.
కత్రినా కైఫ్ రణబీర్ కపూర్ తో స్పెయిన్ లో సరదాగా తిరిగివచ్చిన కథనంతో పాటు సాక్ష్యాధారాలుగా వాళ్ళ ఫొటోలను కూడా ఒక సినిమా పత్రిక ప్రచురిస్తే మిగతా మీడియాలు కూడా వాటిని వాడుకున్నాయి. కొందరు పత్రికలవాళ్ళు కేవలం సినిమావాళ్ళ నిజజీవితంలోకి అనుమతిలేకుండా ప్రవేశిస్తూ, పిరికిపందలలాగా వ్యవహరిస్తూ దొంగతనంగా వాళ్ళ ఫొటోలను తీస్తుంటారంటూ కత్రినా ఆవేదనను వ్యక్తపరచింది.
అయినా నాకు, మీడియాకు మధ్య ఎంతో సన్నిహిత సంబంధముందంటూ కూడా కత్రినా చెప్తోంది. అలాంటప్పడు నేను చెప్పేవి వేసుకోవాలి కానీ నాకు తెలియకుండా నా ఫొటోలను వాడటాన్ని నేను సహించనంటూ కత్రినా మీడియాకు చురకవేసింది.
అయితే ఇదీ ప్రచారంకోసమే కత్రినా చేస్తున్నపనేనంటూ కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. కత్రినా రణబీర్ కపూర్ ల కథనం పాతబడుతోంది. మళ్ళీ ఈ విధంగా దాన్ని తాజాగా చేస్తున్నదని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు.
Related article:
http://www.morningcable.com/home/arts-n-antertainment/33311-sensational-picture-threatens-katrinas-love-life.html
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more