కె.విశ్వనాధ్ దర్శకత్వంలో రూపొందిన అపూర్వ కళాఖండాల్లో వెంకటేష్, భానుప్రియ జంటగా నటించిన చిత్రం స్వర్ణకమలం ఒకటి.
ఈరోజుకి స్వర్ణకమలం విడుదలై సరిగ్గా 25 సంవత్సరాలు!
కళలమీద సాగే ఇతివృత్తంతో మధ్యతరగతి కుటుంబాల వాతావరణంలో చిత్రించి ఆధునిక యువతకు కూడా సంగీతం నృత్యంలాంటి పురాతనమైన కళల మీద దృష్టి పడటమే కాకుండా ఆసక్తి కూడా పెరిగే విధంగా తీర్చిదిద్దిన ఘనత కె.విశ్వనాధ్ కే దక్కుతుంది.
శంకరాభరణంలో సంగీతానికి, సాగరసంగమంలో నృత్యానికి ప్రాధాన్యతనిచ్చినట్లే, స్వర్ణకమలంలో కూడా నృత్యానికి ప్రాధాన్యతనిస్తూ సాగే కథనంలో భానుప్రియ అత్యంత అద్భుతమైన నటనను ప్రదర్శించింది. పొరుగింటిలో ఉంటూ ఆపదల్లో ఆదుకునే మంచి మనిషి పాత్రలో వెంకటేష్ నటన అలరించింది.
ఇంట్లోనే నృత్యంలో ప్రావీణ్యుడైన తండ్రి ఉండగా, తన కళనంతా ధారపోసి కూతురుని గొప్ప కళాకారిణిగా చూద్దామనుకున్న అతని ఆశలమీద నీళ్ళు చల్లి చివరకు తండ్రి చనిపోయిన తర్వాత, విదేశీయులు పొగిడిన తర్వాతనే సత్యాన్ని గ్రహించి, భారతీయ కళల గొప్పతనాన్ని గుర్తించి చివరకు తండ్రి ఆశలమేరకు కళాకారిణిగా పేరుగాంచిన పాత్రలో భానుప్రియ ఒదిగిపోయి నటించింది.
స్వర్ణకమలం భాను ఆర్ట్స్ పతాకం మీద సిహెచ్ వి అప్పారావు నిర్మించారు, అద్భుతమైన సంగీతాన్ని ఇళయరాజా అందించారు.
స్వర్ణకమలం గొప్పతనం గురించి జ్ఞాపకం చేసుకోవటం కాదు, మరో సారి చూడదగ్గ సినిమా అది. అయితే ప్రస్తుతం నడుస్తున్న ఖరీదైన వాతావరణం, నాయికా నాయకులు ఊహల్లో విదేశాల్లోకి పోయి నృత్యాలు చేసి రావటం, వేడకొడవళ్ళు. తుపాకీలతో పోరాటాలు, సుమోలు గాల్లోకి పల్టీలు కొట్టటం లాంటి దృశ్యాలే కావాలని అనుకునేవారికి సినిమా మొత్తంలో ఏదో ఒకచోట ఐటమ్ సాంగ్ కోసం ఎదురుచూసేవారికి అందులో ఏ ఒక్కటీ ఈ సినిమాలో ఉండదు కానీ ఏ లోపమూ కనిపించదని హామీ ఇస్తున్నాం.
25 సంవత్సరాలు నిండిన సందర్భంగా స్వర్ణకమలం చిత్ర యూనిట్ కి కళాకారులందరికీ అభినందనలు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more