చిన్న నటుడు గా జీవితం ప్రారంభించి, నిర్మాతగా సినిమా రంగంలో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్లాక్ బాస్టర్ నిర్మాత బండ్ల గణేష్ కొత్త చిక్కుల్లో పడ్డారు. రీసెంట్ గా బండ్ల గణేష్ ఆస్తులపై ఐటీ దాడులు జరిగినప్పుడు కూడా బండ్ల గణేష్ ఇంతగా భయపడలేదని ఫిలింనగర్ వాసులు అంటున్నారు. కానీ ఇప్పుడు బండ్ల గణేష్ మెడకు అత్యాచారం కేసు చుట్టుకుంది. పోలీసులు చేతిలో ఉంటే బండ్ల గణేష్ సేప్ గా ఉండేవాడు. కానీ ఆ కేసు ఇప్పుడు మానవ హక్కుల కమిషన్ వద్దకు చేరింది. అంటే బండ్ల గణేష్ అత్యాచారం చెయ్యలేదు. కానీ షాద్ నగర్ గ్రామంలో గణేశ్ కు సంబంధించిన పరమేశ్వర పౌల్ట్రీలో ఓ బాలికపై అత్యాచారం జరిగిందని, దీనిపై బండ్ల గణేష్ పై చర్యలు తీసుకోవాలని ఓ స్వచ్ఛంద సంస్థ హెచ్చార్సీలో ఫిర్యాదు చేసింది.
అసలు విషయం ఏమిటంటే..మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండలం తిమ్మాజిపల్లి తండా సమీపంలోని పరమేశ్వర పౌల్ట్లీలో కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన దంపతులు పనిచేస్తున్నారు. వీరు మూడు రోజుల క్రితం పని మీద సొంత ఊరికి వెళ్లారు. వారి చిన్న కూతురు ఇక్కడే ఉంది. ఆ బాలిక ఈ నెల 9వ తేదీన పౌల్ట్లీలో గుడ్లు తీస్తుండగా అక్కడే పనిచేసే ఉద్యోగి శ్రీను ఆ బాలికను మరో షెడ్లో గుడ్లు తీయాలని తీసుకెళ్లాడు. అక్కడ ఎవరూ లేరని నిర్ధారించుకుని అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే 9 ఏళ్ల బాలికను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరం అయిన నేపథ్యంలో బండ్ల గణేష్ పై చర్యలు తీసుకోవాలని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more