విదేశీ పర్యటనలో ఉండగానే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ గురైన డీఎల్ రవీంద్రారెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. బర్తరఫ్‌కు సంబంధించిన అన్ని వాస్తవాల చిట్టాను మీడియాకు వెల్లడిస్తానని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని, తన మృతదేహంపై జాతీయ జెండా ఉంచాల్సిందేనని వ్యాఖ్యానించారు. 35 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకోసం కష్టపడినందుకు బర్తరఫ్ తనకు ఇచ్చిన కానుకనా అని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ప్రశ్నించారు. సీఎల్పీలో ప్రెస్‌మీట్‌కు అనుమతి నిరాకరించడంతో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద డీఎల్ మాట్లాడారు. తాను చెప్పే ప్రతి మాట ప్రజలకు చేరాలన్నారు. దురుదృష్టకర పరిణామం తనకు ఎదరైందని, ఏ సందర్భంలో తనను డిస్మిస్ చేశారో చెప్పాలని డీఎల్ డిమాండ్ చేశారు.
సీఎల్పీలో మాట్లాడేందుకు అనుమతివ్వలేదని, దానిపై ఎవరికీ ఫిర్యాదు చేయనన్నారు. మంచి చేయకపోతే పద్దతి మార్చాకోవాలని చెప్పడం తనకు అలవాటని ఆయన అన్నారు. 2011 డిసెంబర్‌లో రాజీవ్ కిరణాలు ప్రధాని కార్యక్రమంలో సీఎం కిరణ్ ప్రవర్తన బాధ కలిగించిందని డీఎల్ తెలిపారు. అప్పటికే కిరణ్ తనపై మనసులో ఏదో పెట్టుకున్నారన్నారు. ఆ తర్వాత నా శాఖలో చాలా వాటిని కత్తిరించారని చెప్పారు. శాఖల కేటాయింపు గురించి ఎప్పుడూ పట్టించుకోలేదని ఆయన తెలిపారు. తాను ఆత్మగౌరవం గల వ్యక్తినని..మాట అనిపించుకునే వ్యక్తికి కాదని డీఎల్ పేర్కొన్నారు. సీఎంను మార్చాలని సోనియాతో చెప్పలేదని, కిరణ్ తప్పొప్పులను మేడమ్‌కు తెలిపానన్నారు.
గతంలో సోనియాకు రాజీనామా లేఖ పంపగా, మేడమ్ తనను పిలిచి మాట్లాడారన్నారు. ప్రభుత్వ పథకాలు కేటాయించే ముందు అన్నీ ఆలోచించాలని సూచించారు. అమ్మహస్తం మొదలై మూడు నెలలు అవుతోంది. పథకం అమలు ఎలా ఉందో మీకే తెలుసని డీఎల్ అన్నారు. ప్రజలకు అమ్మ హస్తం సరుకుల అందడం లేదని తెలిపారు. తన నియోజవర్గంలో అమ్మహస్తం సరుకులు రాలేదని ఆరోపించారు. ఇందిరమ్మ కలలు పథకం ద్వారా ఎంత మంది దళితులకు న్యాయం చేశారని ప్రశ్నించారు. సబ్‌ప్లాన్ కోసం డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఎంతో కష్టపడ్డారని తెలిపారు. దళితుడైన దామోదరను సీఎం కిరణ్ పక్కన పెట్టారని, ఇది పార్టీకి ద్రోహం చేయడం కాదా అని ప్రశ్నించారు.
బంగారు తల్లి పథకం చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి. కేబినేట్‌లో చర్చించకుండానే బంగారుతల్లి పథకాన్ని ప్రకటించారన్నారు. బంగారుతల్లి పథకం గురించి ఆ శాఖ మంత్రికే తెలియదని ఆయన అన్నారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఉద్యోగశ్రీని రాజీవ్‌యువ కిరణాలుగా మార్చారన్నారు. ఉద్యోగాలు ఎన్నొచ్చాయో వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగులు చెబుతారన్నారు. పథకాలు అమలు జరగడంలేదని, ఉన్న పథకాలు అమలు చేయకుండా బంగారు తల్లి పథకం ఎందుకని ప్రశ్నించారు. వైఎస్ హయాం కంటే ప్రచార ఆర్భాటం ఎక్కువగా ఉందని మేడమ్‌కు చెప్పినట్లు డీఎల్ పేర్కొన్నారు.
పబ్లిసిటీ కోసం పెట్టినంత కూడా పథకాల అమలుకు ఖర్చు చేయడం లేదని ఆరోపించారు. మేకప్ వేసుకుని ఫోటోల్లో ఎక్కడానికే సమయం సరిపోతుందని, ఇక పథకాల అమలుకు టైమెక్కడిదని యెద్దేవా చేశారు. మన నాయకులు బట్టల్లేకపోయినా దొడ్డిదారిన వెళ్లి పదవులు తెచ్చుకుంటారని వ్యాఖ్యానించారు. కాని దేశం కోసం తమ అధినేత్రి సోనియా ఎన్నో త్యాగాలు చేశారని గుర్తుచేశారు. తాను ఎవరిని మంత్రి పదవి అడుగలేదని, తనకిచ్చిన వాటిని బాధ్యతగా నిర్వర్తించానని డీఎల్ తెలిపారు.
అధికారం కోసం పాకులాడలేదన్నారు. బర్తరఫ్ చేసేంత తప్పు ఏం చేశానన్నారు. లంచాలు తీసుకున్నానా...తనపై కేసులు ఏమన్నా ఉన్నాయా అని ప్రశ్నించారు. సీఎం ఎందుకు ఇంతటి నిరంకుశమైన నిర్ణయం తీసుకున్నారో తెలియదు, కాంగ్రెస్ పార్టీ బతకాలన్నదే తనక కోరిక అని డీఎల్ తెలిపారు. అహ్మద్‌పటేల్, జైపాల్‌రెడ్డి చెప్పినందుకే మంత్రి పదవి ఇచ్చానని స్వయంగా సీఎం కిరణే చెప్పారన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more