రాష్ట్రంలో ఉగ్రవాదులు విధ్వంసక దుర్ఘటనలకు పాల్పడే ప్రమాదం పొంచి ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో అప్రమత్తంగా ఉండాలని ఐబీ (ఇంటెలిజెన్స్ బ్యూరో) హెచ్చరించింది.ఈ సమాచారంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. రద్దీ ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదులు మళ్లీ హైదరాబాద్ లక్ష్యంగా దాడులకు పాల్పడనున్నారనే ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీసులు అప్రమత్తమై భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలుచోట్ల విస్తృత తనిఖీలు చేపట్టారు. రోడ్లపైనా, లాడ్జీల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ కూడళ్ల వద్ద మైకుల్లో ప్రకటనలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్లతో భయభ్రాంతులకు గురైన హైదరాబాదీలు ఇప్పుడు మరో దాడి అంటే వణికిపోతున్నారు. అప్పట్లో నిఘా హెచ్చరికలను పట్టించుకోలేదన్న ఆరోపణలు రావడంతో ఈసారి పోలీసులు మరింత కఠినంగా, విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
నగరవాసులు కూడా తమ బాధ్యతగా పోలీసులకు సహకరిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఇంకా భద్రత కట్టుదిట్టం చేయాలని కేంద్ర నిఘా విభాగం నుంచి హెచ్చరికలు అందడంతో అన్ని ముఖ్యమైన ప్రదేశాలలోనూ గట్టి భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. శివరాత్రి సందర్భంగా ఉగ్రవాదులు విధ్వాంసక చర్యలకు పాల్పడవచ్చునని ఐబీ సూచించినట్లు ఆయన వెల్లడించారు. నగర పోలీసులను అప్రమత్తం చేశామని, సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు మోహరించి, విస్తృత తనీఖీలు చేపట్టారని, ప్రజలు భయాందోళనకు గురికానవసరం లేదని ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలో గల వివిధ షాపింగ్ మాల్స్ యజమానుల సహకారంతో సుమారు 600 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సీపీ అనురాగ్ శర్మ చెప్పారు. అలాగే షాపింగ్ మాల్స్ ప్రైవేటు భద్రతా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. బుధవారంనాడు హైదరాబాద్‌లోని ఐ మాక్స్ థియేటర్‌లోనూ, జనసమర్థం ఎక్కువగా ఉండే దేవాలయాల, రద్దీగా ఉండే ముఖ్యకూడళ్లలోనో పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. అలాగే నగరానికి వస్తున్న వివిధ రైళ్లలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల తనిఖీలలో పెద్ద ఎత్తున ధనం, బంగారు లభ్యమవుతున్నది. ఈ తనిఖీల్లో లభ్యమైన బంగారం, నగదును ఆదాయం పన్ను శాఖకు అప్పగిస్తున్నట్లు ఆయన వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more