హైద్రాబాద్ లో జరిగిన బాంబు పేలుళ్ల వలన అమాయకులైన కొందరు ముసల్మానులు అనవసరంగా నలిగిపోతున్నారంటూ ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్ మార్కండేయ కట్జూ ఆవేదనను వ్యక్తపరచారు. జాతీయ మైనారిటీ వర్గాల కమిషన్ అధ్యక్షుడు వజాహత్ హబిబుల్లా రాసిన లేఖకు స్పందిస్తూ కట్జూ మీడియాను సంయమనం పాటించమని, తమ వార్తలలో ముస్లిం వర్గాలను ప్రత్యేకంగా లక్ష్యం చేసి రాయకండని అర్థించారు. హబీబుల్లా రాసిన లేఖలో, ఒక పక్క దర్యాప్తు జరుగుతుండగానే, ఏదీ తేలకముందే మీడియా ఒక వర్గాన్ని లక్ష్యంగా వార్తలను ప్రచురిస్తోంది అని ఆరోపించారు.
ఈ సందర్భంలో, ఉగ్రవాద చర్య అనగానే దాన్ని చేసింది ముస్లిమే అనే భావన ఏర్పడింది అని బి.రామన్ రాసిన ఒక వ్యాసం ప్రస్తావన తీసుకోచ్చారు కట్జూ. అది మాత్రం సత్యం అంటూ, అటువంటి అభిప్రాయాన్ని కలుగజేసేట్టుగా ప్రచారం చెయ్యటం వలన కొందరు పోలీసు అధికారుల అనుమానం పేరుతో కొందరు ముస్లింలను అదుపులోకి తీసుకుంటున్నారు. ఒకసారి అటువంటి కేసులో లోపలికి పోతే ఆ మనిషికి బెయిల్ దొరకటం కష్టం. ఆ తర్వాత చాలా కాలం తర్వాత ఆ వ్యక్తి నిరపరాధని తేలినా, గతించిన అతని కాలాన్ని తిరిగి తేవటం మాత్రం సాధ్యం కాదు. ఆ నష్టం ఎవరూ పూరించలేనిదని కట్జూ అన్నారు.
బాంబు పేలిన గంటలోపులోనే ఎవరో మేము ఫలానా ఉగ్రవాద సంస్థ వాళ్ళం, ఆ ఘనకార్యం మాదే అని చెప్తే వెంటనే మీడియా దాన్ని తమ మాధ్యమం ద్వారా ప్రచారం చేస్తుంది. ఎంత తప్పిదమది. ఎవరో బాధ్యతారహితంగా, కుట్రపూరితంగా పంపిన లేఖను టివి స్క్రీన్ మీద చూపించటం వలన ఉగ్రవాదులంటే ముస్లిములే, బాంబులను పెట్టి పేల్చి విధ్వంసాన్ని సృష్టిస్తున్నది వాళ్ళే అనే భావన ప్రజలందరిలోనూ ఏర్పడుతోంది.
సమాజంలోని అన్ని వర్గాలకూ సమానమైన హోదాను గౌరవాన్ని ఇచ్చినప్పుడే దేశం ఏకతాటి మీద నిలిచి ప్రగతిని సాధిస్తుందని మార్కండేయ కట్జూ సూచించారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more