పది మంది నిద్రపోతున్న గదిలో గురక పెడుతుంటే హాయిగా నిద్రపోయేవారు ఒకరే, ఆ గురక పెట్టేవారు అని సరదాగా నవ్వుకోవటానికి చెప్పుకుంటారు. నిన్న ఢిల్లీలో జరిగిన భాజపా జాతీయ స్థాయి సమావేశాల మొదటి రోజున మైకు పట్టుకుని మాట్లాడనివారు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ఒక్కరే. ప్రతివారూ మోదీ మంత్రాన్ని జపిస్తూ, అబ్బో ఆయన అది ఆయన ఇది అని పొగడ్తలతో ముంచెత్తుతూ, పైకెత్తుతుంటే, చిద్విలాసంగా ఏమీ మాట్లాడకుండా కూర్చున్నది దక్షణాదివారు మోడీ అని పిలిచే మోదీ ఒక్కరే. ఇంగ్లీషు వర్ణక్రమం ప్రకారం ఆయనను మోడీ అని అంటుంటారు కానీ నిజానికి ఆయన ఇంటి పేరు మోదీ. అలాగే దక్షిణాది వారికి ఇష్టమైన అల్పాహారం దోశ ను అక్కడ డోస అంటారు అది కూడా వర్ణక్రమంలో డి అక్షరాన్ని బట్టే.
నరేంద్ర మోదీకి దేశంలో పెరిగిన గణనీయమైన అభిమానుల దృష్ట్యా, భాజపా రాజకీయ ప్రణాళికలో మోదీని ప్రధాన మంత్రి పదవికి (కేంద్రంలో భాజపా అధికారాన్ని దక్కించుకున్నట్లయితే) ఏకైక యోగ్యపుంగవుడిగా చాటి చెప్తున్నారు. నిన్న నేతలంతా మన ప్రధాని మోదీయే అంటుంటే, దేశ్ కా నేతా కైసా హో, మోదీ జైసా హో- దేశనాయకుడంటే మోదీలా వుండాలి- అని ఢిల్లీ తాల్ కటోరా స్టేడియమంతా దద్దరిల్లేట్టుగా నినాదాలు చేసారంతా.
నిజానికి నిన్న ప్రధాన మంత్రి అభ్యర్థి విషయంలో ఎటువంటి చర్చా జరగకూడదన్నది భాజపా నిర్ణయం కానీ అక్కడి వాతావరణాన్ని, ప్రజల మనోభావాన్ని కనిపెట్టిన భాజపా ఢిల్లీ అధ్యక్షుడు విజయ్ గోయల్, ప్రధానమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసే ప్రక్రియ ఇప్పుడు కాదు కానీ, మోదీయే ప్రధానమంత్రి అభ్యర్థి అని స్పష్టంగా గోచరిస్తున్నది అన్నారు.
అఖిల భారత భాజపా అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ మోదీని ప్రజానాయుకుడని, ఆదర్శప్రాయుడైన ముఖ్యమంత్రి అని శ్లాఘించారు. గుజరాత్ ఒక ఆదర్శ రాష్ట్రమని, దాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పరచిన ఘనత మోదీ కే దక్కుతుందని ఆయన అన్నారు. 90 నిమిషాలపాటు చేసిన రాజ్ నాథ్ సింగ్ ప్రసంగంలో మోదీని కొనియాడటం కాకుండా మిగతా సమయంలో ఆయన చేసింది యుపిఏ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టటం. గాంధీ పేరుతో దేశంలో అధికారాలను చేపట్టినవారు గాంధీ మార్గంలో నడవటం లేదని దుయ్యబట్టారు. తెలంగాణా అంశాన్ని కూడా లేవనెత్తుతూ, భాజపా అయితే ఇలా చిటికెలో ఇచ్చేస్తుంది తెలంగాణానని. యుపిఏ ప్రభుత్వం అనవసరంగా తాత్సారం చేస్తూ విషయాన్ని నానుస్తూ వస్తోందంటూ విమర్శించారు.
ఈ రోజు నరేంద్ర మోదీ మాట్లాడుతారు. గుజరాత్ ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఫలితం దేశ రాజకీయాలలో ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దామని ఆయన ఎదురు చూస్తున్నట్టుగానే కనిపించారు. భాజపా ఎన్నికల కమిటీకి మోదీని ఛైర్మన్ గా నియమించటానికి సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీనియర్ నేత అద్వానీ భాజపా సలహాదారుగా మాత్రమే వ్యవహరిస్తారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more