పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ .. కొత్త రాజకీయానికి తెరలేపారు. ఒక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో బలపడుతున్న విషయం తెలిసిందే. ఇంలాటి సమయంలో కాంగ్రెస్ పార్టీకి బద్ద శత్రువు అయిన వారితో బొత్స సంబంధాలు పెట్టుకొని .. విందు వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. బొత్స సత్యనారాయణ... వైఎస్ వివేకానందరెడ్డి.. వైఎస్సార్ కాంగ్రెస్ నేత, కాంగ్రెస్ మీద తిరుగుబాటు చేసిన జగన్‌కు చిన్నాయన. మరొకరు మంత్రి పార్ధసారధి. వీరి మధ్య సహజంగా రాజకీయంగా బద్ధ శత్రుత్వమే ఉండాలి. కానీ ఇప్పుడు జరిగింది అందుకు పూర్తి భిన్నం. వారంతా చక్కగా కలసి విందు భోజనాలు చేస్తున్నారు. ఒకరి పనులు మరొకరు చేసుకుంటున్నారు. లేకపోతే.. వైఎస్సార్ సీపీ నేత వైఎస్‌వివేకానందరెడ్డికి బొత్స ఇంట్లో ఏం పని? రాష్ట్రంలో కాంగ్రెస్-వైసీపీ మధ్య బద్ధ శత్రుత్వం నెలకొన్న సమయంలో విందు రాజకీయాలు చేసే అవసరం ఏమిటి? కాంగ్రెస్ ఎమ్మెల్సీ టికెట్ కోసం వైకాపా నేత వివేకా ప్రయత్నించడమేమిటి? వారి భేటీ బయటకు పొక్కిన తర్వాత కాంగ్రెస్ వర్గాలు నోరెళ్లబెట్టిన వైనమిది. ఆ తర్వాత తీగ లాగితే కదిలిన డొంక ఇదీ.. వైఎస్సార్ కాంగ్రెస్ నేత, జగన్ చిన్నాయన వైఎస్ వివేకానందరెడ్డి మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నివాసానికి వెళ్లారు. కొద్దిసేపు ఆయన కోసం వేచిచూశారు. కొద్ది సెకన్ల తర్వాత అక్కడికి మంత్రి పార్ధసారధి కూడా బొత్సతో కలసి వచ్చారు. వచ్చే ఎన్నికల సమయంలో మంత్రి సారథి కూడా జగన్ పార్టీకి జంపవుతారన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
ఆ తర్వాత వారంతా కలసి భోజనం చేశారు. గంటన్నరసేపు మంతనాలు జరిపారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... హరిశ్చంద్రప్రసాద్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని బొత్స వద్దకు తీసుకువెళ్లారు. సదరు హరిశ్చంద్రప్రసాద్ అనే నాయకుడు ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో హైదరాబాద్ నగర శివార్లలోని ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. అప్పుడు కూడా వివేకానందరెడ్డి చొరవ తీసుకుని సోదరుడు ఆయనను వైఎస్ వద్దకు తీసుకువెళ్లారు. ఇప్పుడు మళ్లీ హరిశ్చంద్రప్రసాద్‌కు తాను విడిచిపెట్టిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సీటు ఇప్పించేందుకు వివేకా నడుంబిగించారు. దానికోసం బొత్సతో తనకున్న స్నేహాన్ని వినియోగించుకున్నారు. బొత్స ఇంటికి వైఎస్ వివేకానందరెడ్డి హరిశ్చంద్రప్రసాద్‌ను వెంటబెట్టుకుని వెళ్లడం, వారంతా కలసి భోజనాలు చేయడం, మళ్లీ బయటకు వచ్చి మాట్లాడుకోవడం చూసిన అక్కడే ఉన్న కొందరు కాంగ్రెస్ నాయకులు ముక్కున వేలేసుకున్నారు. రోజూ షర్మిల, జగన్ పార్టీ నేతలంతా ముఖ్యమంత్రి, సోనియా, కాంగ్రెస్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్న పార్టీ అధ్యక్షుడి కుటుంబ సభ్యుడయిన వివేకా తమ పార్టీ అధ్యక్షుడి ఇంటి కి రావడంతో బిత్తరపోయారు. బొత్స-వివేకా చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుకోవడం వారిని తికమక పెట్టింది. అసలు వివేకా కాంగ్రెస్‌లో ఉన్నారా? వైకాపాలో ఉన్నారా? బొత్సకు వైకాపా అధినేత కుటుంబసభ్యులతో లింకులేమిటి? కొంపదీసి బొత్స కూడా ‘రాజకీయంగా ముందు జాగ్రత్తలు’ తీసుకుంటున్నారా? అన్న సందేహాలు తలెత్తాయి. కాగా, వివేకా సిఫారసు చేసిన హరిశ్చంద్రప్రసాద్‌కు ఎమ్మెల్సీ సీటు ఇప్పించేలా తాను ఢిల్లీ స్థాయిలో ప్రయత్నిస్తానని, మీరు కూడా ఢిల్లీలో ప్రయత్నించుకోవాలని సలహా ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more