Rahul gandhi fire on cm

rahul gandhi, congress, prime minister, upa, uttarakhand chief minister vijay bahuguna, chief minister vijay bahuguna, 2014 general electionec team seizes rs one crore from a helicopter of a

rahul gandhi fire on cm.Congress vice president Rahul Gandhi on Saturday made his displeasure known to leaders who tried to please him by demanding that he be declared the party's prime ministerial candidate, party sources said

rahul-gandhi-fire-on-cm.gif

Posted: 02/17/2013 12:54 PM IST
Rahul gandhi fire on cm

rahul gandhi fire on cm

రాహుల్ గాంధీ  ప్రధాని మంత్రి కావాలంటూ  వంధిమాగధ గీతాలు పాడే  వారిపై   రాహుల్ గాంధీ   కొరాడా  ఝళిపించారు.  పీసీసీ, సీఎల్పీ  నేతలు  సమావేశంలో  నేతలు  చెప్పిన  మాటలను విన్న  రాహుల్  తన ఆదిపత్యం ఏమిటో  చూపించారు. ప్రధాని  అభ్యర్థిగా   రాహుల్ ను   ప్రకటించాలని   చెప్పిన  ఉత్తరాఖండ్  ముఖ్యమంత్రి  విజయ్  బహుగుణను గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.  నేను ఇప్పుడు  పార్టీ  ఉపాధ్యక్షుడిని . ప్రధాని మంత్రిగా ఎవర్ని  ప్రకటించాలో  అన్నది  కాంగ్రెస్ అధిష్టానం   నిర్ణయిస్తుందని గట్టిగా మందలించారు.  ముందు  మీరు పని చేయండి. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కష్టపడి చక్కగా పనిచేసిన నాయకులకే గుర్తింపు ఇవ్వడం జరుగుతుందని, పార్టీ నిర్ధేశించిన లక్ష్యాలను పరిపూర్తిచేసే వారికి మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్లు ఇస్తామని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తదుపరి సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీని పటిష్టవంతం చేసే విషయమై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులు, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతలతో రెండు రోజుల పాటు విస్తృత చర్చలు జరిపిన రాహుల్ గాంధీ పార్టీని బలోపేతం చేసేందుకు వీలుగా వీరికి కాలపరిమితితో కూడిన లక్ష్యాలను నిర్దేశించారు. నాయకులు పూర్తిగా రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయాలకే పరిమితం కాకుండా నెలలో కనీసం పది రోజులైనా జిల్లాలు, బ్లాకుల్లో పర్యటించి కార్యకర్తల సమస్యలు తెలుసుకోవాలని, సంస్థాగతంగా పార్టీని పటిష్టవంతం చేసేందుకు కృషి చేయాలని రాహుల్ వీరికి సూచించారు. అన్ని జిల్లాలోనూ, బ్లాకుల్లోనూ రెండు నెలల్లోగా కాంగ్రెస్ కమిటీలను ఏర్పాటు చేయాలని రాహుల్ గడువు విధిస్తూ, దీనిపై పిసిసి అధ్యక్షుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని పేర్కొన్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఏయే పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలనే అంశంపై రాహుల్‌గాంధీ వీలైనంత త్వరలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. మహారాష్ట్ర సహా వివిధ రాష్ట్రాలనుంచి వచ్చిన నాయకులు సమావేశంలో పొత్తులపై వీలైనంత త్వరగా తమకు స్పష్టతనివ్వాలని రాహుల్‌ను కోరారు.

rahul gandhi fire on cm

రెండు మూడు నెలలకోసారి పిసిసి, సిఎల్‌పి చీఫ్‌లతో న్యూఢిల్లీలో సమావేశం కావాలని రాహుల్ నిర్ణయించుకున్నారని, ఇదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో తమతమ రాష్ట్రాల్లో సమావేశాలు నిర్వహించాల్సిందిగా రాష్ట్ర నాయకులకు రాహుల్ సూచించారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ నాయకుల మధ్య సమాచార లోపం ఉండరాదని, ఇంటర్నెట్ లేదా ఫోను ద్వారా రాష్ట్ర నాయకులతో నిరంతరం సంబంధాలు కలిగి ఉండేందుకు ఒక యంత్రాంగాన్ని అందుబాటులోకి తీసుకువస్తానని హామీ ఇచ్చారని ఆ వర్గాలు తెలిపాయి. పార్టీ పురోభివృద్ధి కోసం కష్టపడి పనిచేసిన వారికే ప్రాధాన్యత ఇస్తామని రాహుల్ స్పష్టం చేస్తూ, ఈ విషయంలో సరైన ఫలితాలు సాధించలేకపోయిన వారు పార్టీకి సంజాయిషీ చెప్పుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కేంద్ర మంత్రులు రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు పార్టీ కార్యాలయాలను సందర్శించడం లేదన్న ఫిర్యాదులపై రాహుల్ తీవ్రంగా ప్రతిస్పందించారు. కేంద్ర మంత్రులు రాష్ట్రాలకు వెళ్లినప్పుడు పిసిసి కార్యాలయాలను తప్పనిసరిగా సందర్శించి రాష్ట్ర నాయకులతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sonia gandhi vs pv narasimha rao
Nagaland leader flies with rs1 crore cash in copter  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more