Kanna mallu ravi and d srinivas in race

D Srinivas, Mallu Ravi, Kanna Lakshminarayana, PCC Chief race, PV Narasimha Rao, Chiranjeevi,Pallam Raju

There is chance that D Srinivas, Mallu Ravi or Kanna Lakshminarayana will become PCC Chief.

Kanna, Mallu Ravi and D Srinivas in Race.png

Posted: 02/09/2013 11:38 AM IST
Kanna mallu ravi and d srinivas in race

kanna-srinivas

ఆంధ్రప్రదేశ్ కి చెందిన పీసీసీ అధ్యక్షుడ్ని మార్చేయోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉందంటూ గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఒకవేళ మార్చితే ఎవర్ని నియమిస్తుంది ? సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఇస్తుందా ? తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఇస్తుందా ? అయితే మన రాష్ట్రానికి చెందిన బీసీ, ఎస్సీ, కాపు వర్గాలకు చెందిన నేతలు పీపీసీ పదవిని దక్కించుకునేందుకు  ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక గత కొన్ని రోజుల నుండి పీసీసీ అధ్యక్షుడ్ని మార్చితే కన్నా లక్ష్మీనారాయణ రేసులో ఉన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు కొత్తగా తెలంగాణ ప్రాంతం నుండి డీశ్రీనివాస్ పేరు తెరపైకి రావడంతో ఉఠ్కంట నెలకొంది.  గతంలో తనకు పీసీసీ వద్దని, ముఖ్య మంత్రి పదవి ఇవ్వాలని డీఎస్‌ అభ్య ర్ధించారు. అయితే టీఆర్‌ఎ స్‌ను విలీనం చేయిస్తే సీఎం పదవి ఇస్తామని నాయ కత్వం షరతు విధించింది. మళ్లీ ఇప్పుడు కొత్తగా డీఎస్‌ పేరు తెరమీదకు వస్తోంది.

ముఖ్యమంత్రి కిరణ్‌ కూడా డీఎస్‌ అయితే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. గతంలో రెండోసారి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకునే సీఎం ఈ ప్రతిపాదన చేసినట్లు కనిపిస్తోంది. అటు మల్లు రవి పేరు కూడా వినిపిస్తుండగా.. విచిత్రంగా కిరణ్‌ సైతం ఆయన పేరును బలపరుస్తున్నారు. డీఎస్‌, మల్లును సీఎం బలపరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సీనియర్‌ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పేరు మొదటి నుంచీ బలంగా వినిపిస్తోంది. పివి హయాంలోనే అవకాశం వచ్చినా వదులుకున్న ఆయన, ఆ తర్వాత అవకాశాల కోసం ఎదురుచూడవలసి వస్తోంది. కేంద్రమంత్రి చిరంజీవి, పల్లంరాజు ఆయనకు దన్నుగా ఉన్నారు. కోస్తాలో బలంగా ఉన్న కాపు, సీమలో బలిజ వర్గాల హవా ఎక్కువగా ఉన్నందున, కన్నాకు ఆ పదవి ఇవ్వడం ద్వారా ఆ పెద్ద వర్గాలనూ ఆకట్టుకోవచ్చని నాయకత్వం యోచిస్తోంది. సీమాంధ్రలో రెడ్డి-క్రైస్తవ-దళిత క్రైస్తవులు కాంగ్రెస్‌కు దూరమయి, వైకాపాకు చేరవవుతుండటంతో, వీరి కంటే సంఖ్యాబలం, ధనబలంలో ఎన్నోరె ట్లు ఎక్కువగా ఉన్న కాపులను ప్రోత్సహించడం ద్వారా రానున్న ఎన్నికల్లో వారి సాయంతో విజయం సాధించవచ్చని హైకమాండ్‌ యోచిస్తోంది. పైగా కన్నాకు కాపుల్లో మాస్‌ ఇమేజ్‌ ఉంది. మరి వీరిలో ఎవర్ని పీసీసీ పదవి వరిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Damage in space shuttle hide by nasa from kalpana team
Gali muddhukrishnama comments ys sharmila leg surgery  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more