Damage in space shuttle hide by nasa from kalpana team

Nasa, Kalpana Chawla, Astronauts, Columbia Space Shuttle, Kennedy Space Center

As space shuttle Columbia began to re-enter the Earth atmosphere, a damaged Thermal Protection System (TPS) would be the downfall, and the vex that burned.

Damage in space shuttle hide by NASA from Kalpana Team.png

Posted: 02/09/2013 12:24 PM IST
Damage in space shuttle hide by nasa from kalpana team

kalpana-team

2003లో భారత తొలి వ్యోమగామి కల్పనా చావ్లా కొలంబియా వ్యోమగామ నౌకలో సగర్వంగా అంతరిక్షానికి దూసుకుపోయింది, తిరుగు ప్రయాణంలో ప్రమాదం జరిగి చావ్లాతో పాటు ఏడుగురు వ్యోమగాములు నింగిలోనే కలిసిపోయిన సంఘటన ఇంకా మనకు గుర్తుండే ఉంటుంది. ఈ సంఘటనకు పది సంవత్సరాలు పూర్తి అయ్యాయి. భారత్‌తోసహా ప్రపంచాన్ని దిగ్భ్రాంతపర్చిన ఈ విషాదంలో ఇన్ని సంవత్సరాల తరువాత కొత్త కోణం వెలుగు చూసింది. కల్పనా చావ్లా ప్రయాణించే కొలంబియాకు ప్రమాదం ఉందని నాసాకి ముందే తెలిసినా వ్యోమగాములకు చెప్పకుండా దాచి, వారి మరణానికి కారణమయ్యారని ఇప్పుడు వినిపిస్తున్న ఆరోపణ. కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి కొలంబియా నింగికెగిసిన 82 సెకన్లలోనే దాని బయటి ఇంధన ట్యాంకు నుంచి సూట్‌కేసు సైజులోని ఓ ఫోమ్ (తేలికపాటి పదార్థం) ముక్క విరిగిపోయింది. అది షటిల్ ఎడమ రెక్కకు బలంగా తాకడంతో అక్కడి కార్బన్ పలకలపై పది అంగుళాల రంధ్రం పడిపోయింది. కంట్రోల్ రూంలోని శాస్త్రవేత్తలు దీనిని వెంటనే గుర్తించారు. కానీ అప్పటికే కొలంబియా భూమికి 20 కి.మీ. ఎత్తుకు దూసుకుపోయింది. ధ్వని వేగానికి రెండు రెట్ల వేగం అందుకుని సెకనుకు కి.మీ. దూరం సాగిపోతోంది. అయితే, రంధ్రం వల్ల ఎడమ రెక్క ఉష్ణ రక్షణ వ్యవస్థ (టీపీఎస్) దెబ్బతిందని, కొలంబియా భూమికి తిరిగి వచ్చేటప్పుడు ప్రమాదం జరగవచ్చంటూ నాసా ఇంజనీర్లు హెచ్చరించారు.

nasa

కానీ.. కొంత మంది శాస్త్రవేత్తలతోసహా అప్పటి నాసా మిషన్ ఆపరేషన్స్ డెరైక్టర్ జాన్ హార్పోల్డ్ కూడా కొలంబియాకు ఏమీ కాదనే ధీమా వ్యక్తంచేశారు.ఏం జరిగినా, చేయగలిగిందేమీ లేదని, వ్యోమగాములకు ఏ విషయమూ తెలియకపోవడమే మంచిదనీ నిర్ణయించారు. చివరికి ఆ ధీమానే.. కల్పన, ఇతర వ్యోమగాముల ప్రాణాలను గాలిలో కలిపేసింది. ఫిబ్రవరి 1న ఉదయం 8:15 గంటలకు తిరుగు పయనమైన కొలంబియా.. భూవాతావరణంలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే మండిపోయింది. ధ్వని వేగానికి 25 రెట్లు, సెకనుకు 5 కి .మీ. వేగంతో వాతావరణంలోకి ప్రవేశించిన వ్యోమనౌక ఎడమ రెక్క గాలి వల్ల విపరీతంగా వేడెక్కిపోయింది. ఆరు నిమిషాల్లోనే 1370 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత పుట్టడంతో చివరికి భూమికి 70 కి.మీ. ఎత్తులో టెక్సాస్ గగనతలంలో కొలంబియా పేలిపోయింది.  కొలంబియా షటిల్ విషాదంలోని ఈ మరో కోణాన్ని నాసా స్పేస్ ప్రోగ్రాం మాజీ మేనేజర్ వేన్ హేల్ తాజాగా బయటపెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Baddam trying for state bjp chief post
Kanna mallu ravi and d srinivas in race  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more