ఇరుప్రాంతాల నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వద్ద పంచాయతీ పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ సమస్య పై జరుగుతున్న పరిణమాలపై రెండు ప్రాంతాల నాయకులు మఖ్యమంత్రితో భేటీ అయ్యినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ఢిల్లీలో చేసిన ప్రకటన తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో గుబులు పుట్టిస్తోంది. ప్రకటనతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడంతో పాటు, రాజీనామాల అంశాన్ని చర్చకు పెట్టినట్టు సమాచారం. ఇదే సమయంలో సీమాంధ్రకు చెందిన కొంతమంది నేతలు ముఖ్యమంత్రితో భేటీ అయి తాజా పరిస్థితులను వివరించినట్టు సమాచారం. తెలంగాణ అంశాన్ని తేల్చేందుకు సమయం ఇంకాకావాలని, మూడు ప్రాంతాల నేతలతో చర్చించాల్సి ఉందని షిండే, అజాద్‌లు చేసిన ప్రకటన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు, మంత్రులు అంతర్గత చర్చలకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రకటన కారణంగా తెలంగాణలో తాము ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోందని భావిస్తున్న మంత్రులు ఒకవైపు సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని చర్చించుకోవడంతో పాటు, ముఖ్యమంత్రికి ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్టు సమాచారం. గతనెల 28న షిండే చేసిన ‘నెల రోజుల’ ప్రకటన, ఇప్పుడు సమయం చాలదంటూ చేసిన తాజా ప్రకటనపై మంత్రి సుదర్శన్‌రెడ్డి, శ్రీ్ధర్‌బాబు ముఖ్యమంత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
తమపై ఒత్తిడి పెరిగిపోతోందని, తాము కూడా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయని అభిప్రాయపడినట్టు సమాచారం. అందుకే రాజీనామా చేయాలన్న భావాన్ని కూడా వారు కిరణ్ దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఇక్కడి వారి మనోభావాలు, టి.మంత్రులు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులను వివరిస్తూ అధిష్టానానికి లేఖ రాయాలనుకుంటున్న అంశాన్ని టి.మంత్రులు ముఖ్యమంత్రికి చెప్పినట్టు సమాచారం. దీనిపై ముఖ్యమంత్రి కూడా స్పందిస్తూ తనతో, పార్టీ అధ్యక్షునితోనూ మాట్లాడతామని కేంద్రం చెప్పడాన్ని గుర్తు చేస్తూ వారు తనతో చర్చించిన తరువాత పరిస్థితిని అంచనా వేయవచ్చునని చెప్పినట్టు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more