తెలంగాణ సమస్య పై కాంగ్రెస్ పార్టీ మాటతప్పిన విషయం పై అనేక పార్టీలు, రాజకీయ నాయకులు, తెలంగాణ నాయకులు మండిపడుతున్నారు. కానీ తెలంగాణ విషయంపై లేఖ ఇచ్చిన టీడీపీ నాయకులు, ఆ పార్టీ అధినేత చంద్రబాబు మౌనంగా ఉండటం పై అనేక అనుమానాలు అనేక రకాలు వినిపిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే, అజాద్ వ్యాఖ్యలపై టిడిపి అధ్యక్షులు చంద్రబాబు మౌనంగా ఉన్నారు. ఆ పార్టీ సీనియర్ నాయకులూ సైతం చంద్రబాబు బాటలోనే నడుస్తున్నారు. ఇప్పటికే పార్టీ వైఖరినీ లేఖ రూపంలో కేంద్రానికి ఇచ్చామని, మళ్లీ...మళ్లీ అదే విషయాన్ని చెప్పాల్సిన అవసరం లేదు అని నేతలు ఖరాఖండీగా చెబుతున్నారు. మూడు ప్రాంతాల నాయకులతో సంప్రదింపులు జరపాల్సివుందని, తెలంగాణపై తుది నిర్ణయానికి తగిన సమయం పడుతుందని కేంద్ర మంత్రులు వ్యాఖ్యానించినా చంద్రబాబు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీనిపై స్పందించడానికి ఆయన నిరాకరిస్తున్నారు. ఇటూ సీమాంధ్ర, అటూ తెలంగాణా నేతల్లోనూ అదే మౌనం కనిపిస్తోంది. మాట్లాడాలనీ కోరితే తప్ప వారికి వారూ ఆజాద్ వ్యాఖ్యలపై మాట్లాడం లేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని 'ఇచ్చేదీ లేదు..తెచ్చేది లేదు' అంటున్నారు. అలాంటప్పుడు ఆ సమస్యతో తమకేం సంబంధం లేదని అని పార్టీ నాయకులు అంటున్నారు. అయితే ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ మార్గదర్శకత్వంలోనే ఈ సమస్యను మరింత జఠిలం చేయనున్నట్లు పార్టీ అంచనా వేస్తోంది. కోస్తాంధ్ర ప్రాంతంలో వైఎస్‌ఆర్ పార్టీతోనూ, తెలంగాణ ప్రాంతంలో టిఆర్‌ఎస్‌తోనూ కాంగ్రెస్ పార్టీ అవగాహన కుదుర్చుకుని నాటకాలాడుతోందని పార్టీ నేతలు అంటున్నారు.
ఇదంతా తెలుగుదేశం పార్టీని నాశనం చేయడానికే ఆ మూడు పార్టీలు కుట్ర చేస్తున్నాయని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిదానికీ స్పందించాల్సిన అవసరం లేదనీ, నాయకులూ మౌనంగా ఉండాలనీ, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోందో చూద్దామంటూ పార్టీ నాయకులను చంద్రబాబు ఆదేశించారు. దీంతో టిడిపి నాయకులు ఎవరూ మాట్లాడం లేదు. కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని పార్టీ నాయకులు వ్యవహరించనున్నట్లు ఉంది. తెలంగాణా అంశాన్ని తెరపైకి తెచ్చిందీ కాంగ్రెస్‌పార్టీయే, ఆ సమస్యను నాన్చుతోందనీ ఆ పార్టీయే, దానికి అందర్నీ బాధ్యులను చేస్తోంది. మూడు ప్రాంతాల నాయకులతో సంప్రదింపులు జరపాలని భావించిన కాంగ్రెస్ పార్టీ... ఇటూ తెలంగాణ కాంగ్రెస్ నాయకులూ, అటూ సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు గత వారం రోజులుగా ఢిల్లీలోనే ఉన్నప్పటికీ ఎందుకు సంప్రదింపులు జరపలేదని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. నిజంగా ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే సమస్యను ఎప్పుడో పరిష్కరించేంది. కాంగ్రెస్ నాయకులు రోజుకో ప్రకటన చేయడం వల్ల ప్రజలను మోసం చేయడమే అవుతుందని టిడిపి నేత ఇనుగాల పెద్దిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులు రోజుకో విధంగా మాట్లాడుతూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు. విధ్వేషాలు రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీ ప్రయోజనం పొందడానికి ప్రయత్నం చేస్తోందన్నారు. సమస్య పరిష్కార దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన లేదన్నారు. సమస్యను జఠిలం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అధికారం కోసమే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఎత్తులు వేస్తోందన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more