ఢిల్లీలో జరిగిన సంఘటనతో మహిళ లోకం ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. అయితే మహిళ తమ ఆత్మరక్షణ కోసం మార్గాలు వెతుకుతున్నారు. కొంతమంది తమకు ప్రభుత్వమే రక్షణ కల్పించాలని నిరసనలు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల హోం మంత్రులు , అమ్మాయిలకు ఉచితంగా కరాటీ నేర్పిస్తామని ప్రకటనలు చేస్తున్నారు. కొంత మంది అమ్మాయిలు అయితే ఏకంగా ఒక గన్ కావాలని అడుగుతున్నారు. మహిళలు తమ ఆత్మరక్షణ కోసం చేసే ప్రయాత్నలు ఇంక చాలా ఉన్నాయి. అయితే నేరస్థుల భయపడాల్సిన సమాజంలో మేం భయపడుతూ బతకాల్సి వస్తోంది. అందుకే మాకు రక్షణ కోసం కావాలి? అంటూ మహిళ లోకం గొంతెత్తి అడుగుతుంది. అందుకోసం మాకో తుపాకీ ఇవ్వండి. ఢిల్లీలో అమ్మాయిలు ఒక అడుగు ముందుకు వేశారు. ఢిల్లీ అమ్మాయి అత్యాచార ఘటన తరవాత ఢిల్లీలో తుపాకీ లైసెన్సుల కోసం అప్లికేషన్ పెడుతున్నవారి సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది.
గత పది రోజుల్లోనే రికార్డు స్థాయిలో 274 అప్లికేషన్లు పోలీసులకు అందాయి. వాటికి తోడు లైసెన్సు ఎలా పొందాలో తెలియజేయాలి అంటూ సుమారు పన్నెండొందల మంది ఫోన్లు చేసి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇందులో ఏక్కువుగా ఉద్యోగాలకు వెళ్లే మహిళలూ, దూరప్రాంతాల్లోని కాలేజీల్లో చదివే అమ్మాయిలే చాలా మంది ఉన్నారు. అయితే ఖచ్చితంగా ప్రాణ హానీ ఉంటే తప్ప ఆయుధాలకు అనుమతివ్వడం కుదరదు అని అధికారులు చెబుతుంటే అమ్మాయిల తల్లి దండ్రులు మాత్రం లైసెన్సు ఇవ్వాలని గట్టిగా కోరుతున్నారు. అలా కాని పక్షంలో అమ్మాయిలకకు ఏం జరిగినా పూర్తి బాధ్యత మాదే అంటూ రాసివ్వాలి అని తల్లిదండ్రులు డిమాండ్ చేయడం విశేషం. అత్యాచార ఘటన తరవాత ఢిల్లీలో ఆత్మరక్షణ విద్యా నేర్చుకునేందుకు శిక్షణలో చేరిన అమ్మాయిల సంఖ్య 20 శాతం పెరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. రాబోయే రాజుల్లో అమ్మాయిలు వారి ఆత్మరక్షణ వారే చూసుకోనేవిధంగా తయారవుతున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మాత్రం ఇప్పటికే ఒక ప్రకటన చేశారు. మహిళలపై వేధింపులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు ఉండాలని దేశ వ్యాప్తంగా ఉద్యమం నడుస్తోన్న వేళ పదమూడు కొత్త నిర్షయాలు ప్రకటించారు. మీ రక్షణ నాబాధ్యత అంటూ ఆమె మహిళలకు భరోసా ఇచ్చారు. వేధింపులూ అత్యాచారాల కేసులను పరిష్కరించడానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ మహిళా కోర్టుల ఏర్పాటు, నిందితులకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయటంతో పాటు వారిపై గూండా యాక్ట్ కింద కేసుల నమోదూ, అలాంటి కేసుల విచారణకు ఎస్పీ, డీఐజీ స్థాయి అధికారులను నియమించడం, కొత్త హెల్ప్ లైన్లను ఆరంభించడం రోజూ కోర్టులో వేధింపుల కేసుల విచారణ, అధిక సంఖ్య లో మహిళా న్యాయవాదుల నియామకం వంటి వాటిల్లో కొన్ని. అంతేకాకుండా నేరస్థులకు ఉరి శిక్షే సరైనదనీ, లేనిపక్షంలో రసయాన చర్య ద్యారా లైంగికేచ్చ లేకుండా చేసే శిక్షలు వేసేలా చట్టాలు తేవాలని కేంద్రాన్ని కోరతామని జయలలిత అన్నారు. అంతేకాకుండా ఒక నుంచి ప్రభుత్వ, ప్రైవేటు భవనాల్లో కచ్చితంగా సీసీ కెమెరాలు ఉండాల్సిందే జనం ఎక్కువగా ఉండే ప్రాంతల్లో , మహిళా కళాశాలల దగ్గరా నిరంతరం మప్టిలో పోలీసుల నిఘా ఉండేలా చూస్తాం అని జయలలిత తెలిపారు. అమ్మాయిలు ఏం భయం లేకుండా తమిళనాడులో తిరిగే పరిస్థితులుండేలా చూస్తాం అన్నారు. అందుకోసం సాధ్యమైన అన్ని మార్గాలను ఉపయోగించుకుంటాని తమిళనాడు మహిళలకు ముఖ్యమంత్రి జయలలిత భరోసా ఇచ్చారు. ఇలాగే అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు భరోసా ఇస్తే మహిళలకు పూర్తి రక్షణ ఉంటుందని కొంత మంది మహిళలు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more