పంచమంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూసిన అమెరికా అధ్యక్ష పీఠానికి జరిగిన ఎన్నికల్లో బరాక్ ఒబామా రెండోసారి విజయం సాధించారు. అందరూ అంచనా వేసినట్లుగానే ఆయన తన ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మిట్ రోమ్నీపై విజయం సాధించి మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 44వ అధ్యక్షుడిగా ఒబామా బాధ్యతలు చేపట్టనున్నారు.మిట్ రోమ్నీ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ చివర్లో చేతులెత్తేశారు. 180 ఎలక్టోరల్ ఓట్లు వచ్చే వరకు రోమ్నీ బలంగా పోటీ ఇచ్చారు. ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. ఒబామా ఎలక్టోరల్ ఓట్లు వేగంగా 270 మార్కును దాటిపోయాయి. ఇప్పటివరకూ 303 స్థానాలను గెలుచుకున్నారు.మిట్ రోమ్నీ ఓట్లు మాత్రమే 203 సమీపంలోనే ఆగిపోయాయి. పోటాపోటీగా సాగిన ఈఎన్నికల్లో అతిపెద్ద రాష్ట్రమైన కాలిఫోర్నియా కూడా ఒబామా ఖాతాలో చేరింది.మొత్తం 538 ఓట్లు కలిగిన ఈ ప్రతినిధుల సభలో విజయం సాధించాలంటే 270 ఓట్లు రావల్సి ఉంటుంది. ఈ ఓట్లను ఒబామా సాధించడంతో ఆయన గెలిచినట్టుగా ప్రకటించారు.
ఒబామా పెన్సున్వేలియా, మస్సాచూట్స్, న్యూ జెర్సీ, న్యూయార్క్, కనెక్టికట్, మైనీ, మ్యారీల్యాండ్, ఇలినోయిస్, రోడ్ ఐల్యాండ్, వెర్మోంట్, న్యూ హాంప్షైర్, మిన్నేసోట, వాషింగ్టన్ డీసీ రాష్ట్రాల్లో స్పష్టమైన ఆధిక్యత సాధించారు. అదేవిధంగా రోమ్నీ కూడా కెంటకీ, ఓక్లహోమా, సౌత్ కరోలినా, అలబామా, జార్జియా, ఊమింగ్ ఇండియానా, కన్సెస్, ల్యూసియానా, మిస్సిస్సిపీ, మొంటానా, నెబ్రాస్కా, నార్త్ డకోటా, సౌత్ డకోటా, టెన్నీస్సీ, అర్కన్సా, టెక్సాస్, ఉత్హా, వెస్ట్ వర్జీనియా రాష్ట్రాల్లో ఆధిక్యత సాధించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 120 మిలియన్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరా హోరీ పోరు నెలకొని ఉందన్న సర్వే ఫలితాలను తోసిపుచ్చుతూ ఒబామా తిరుగులేని మెజారిటీతో గెలుస్తారని కెన్యా పశ్చిమ ప్రాంతంలోని ఓ మారుమూల గ్రామంలోని 105 ఏళ్ళ వృద్దుడు గతంలో చెప్పిన జోస్యం నిజమైంది.కాగా ఆ గ్రామం ఒబామా తండ్రి సొంత ఊరు కావటం విశేషం. ఆ వృద్ధుడు గవ్వలు, ఎముకలతో పాచికలు వేసి లెక్కలు కట్టి మరీ ఫలితాన్ని ప్రకటించాడు. ప్రజాకర్షక విధానాలతో ఒబామా అమెరికన్ల హృదయాన్ని కొల్లగొడితే, రోమ్నీ పాలసీలు ఆదేశ ప్రజలను ఆకట్టుకోలేకపోయాయి. రెండోసారి అధ్యక్ష పీఠాన్ని ఒబామా కైవసం చేసుకోవడంతో అమెరికాలో సంబరాలు మిన్నంటాయి. టైమ్స్ స్క్వేర్, ఇల్లీనాయిస్ తదితర ప్రాంతాల్లో ఆయన అభిమానుల సంబరాలు ప్రారంభమయ్యాయి. డెమెక్రటిక్ పార్టీ కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు. కాగా తనను గెలిపించిన వారందరికీ ట్విట్టర్లో ఒబామా థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశారు. ఈ విజయం మీ వల్లే సాధ్యమయ్యిందని ఆయన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more