పార్లమెంటు సమావేశాల కోసమని ఢిల్లీ వెళ్లిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నెల రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చారు. తెలంగాణ కోసం ఏదో జరుగుతుందని, త్వరలోనే ఏదో ఒకటి తేలిపోతుందని, అందుకే కేసీఆర్ ఢిల్లీలోనే ఉంటున్నారన్న ఊహాగానాలు బలంగా వినిపించాయి. అందుకు తగ్గట్టుగానే కేసీఆర్ అలాంటి ప్రకటనే చేశారు. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీతో ఫలవంతమైన సంప్రదింపులు జరిగాయని, తుదిదశ సంప్రదింపులు త్వరలోనే జరుగుతాయని తెలిపారు. అధిష్టానం ఆహ్వానం మేరకే ఢిల్లీ వెళ్లానని, కీలక చర్చలు జరిగేటప్పుడు వాటి గురించి చెప్పాల్సిన పని లేదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఇక తాను ఢిల్లీలో ఎవరెవరినో కలుస్తున్నానని మీడియాలో చూశానని, అందులో వచ్చిన దాని కంటే కూడా ఎక్కువ మందినే కలిశానని కేసీఆర్ చెప్పారు.
మరోవైపు తెలంగాణపై ఏఐసీసీ తొలిసారి ఆశావహ ప్రకటన వచ్చింది. కేసీఆర్ తనకు మంచి మిత్రుడన్న ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో.. తెలంగాణ ఆకాంక్ష ఎంత త్వరగా నెరవేరితే తమకంత ఆనందమన్నారు.తెలంగాణ సెంటిమెంట్ పై గౌరవం ఉందన్నారు. తెలంగాణ సమస్యపై నిర్ణయం తీసుకోవడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని చాకో అభిప్రాయపడ్డారు. ఇంకోవైపు తెలంగాణ మార్చ్ ప్రభావంతో తెలంగాణ ప్రాంత మంత్రుల్లో కదలిక వచ్చింది. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా నేతలతో భేటీ అయిన మంత్రి డీకే అరుణ ఈ నెల 8న జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులందరం ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలిపారు. తెలంగాణ ఆవశ్యకతను అధిష్టానానికి వివరించి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరతామని చెప్పారు. రాజీనామాలతో తెలంగాణ రాదని స్పష్టం చేశారు.ఇక సీపీఎం కూడా కాంగ్రెస్ అధిష్ఠానంపై నిప్పులు చెరిగింది. తెలంగాణ మార్చ్ కు ముందు ఇదిగో.. అదిగో.. అన్న కాంగ్రెస్ నేతలు ఆ తర్వాత తెలంగాణ ఎక్కడా అంటూ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను అధిష్టానం అపహాస్యం పాలుచేసిందన్నారు. మొత్తానికి కేసీఆర్ హైదరాబాద్ రాకతో తెలంగాణపై ఇంకా కొత్త విషయాలు ఏమైనా తెలుస్తాయన్న ఆతృత అందరిలోనూ వ్యక్తమవుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more