‘వస్తున్నా .. మీకోసం’ అంటూ పాదయాత్ర రెండో రోజుకు చేరుకుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు తన యాత్ర సమయంలో ఏం ఆహారం తీసుకుంటున్నారు. ప్రత్యేక జాగ్రత్తలు, ప్రత్యేకమైన ఆహారం తీసుకుంటున్నారు. పాదయాత్ర రెండో రోజు ఆయన మెనూ ఇలా ఉంది. ఉదయం రెండు ఇడ్లీలు, కొన్ని పండ్ల ముక్కలు తీసుకున్నారు. మధ్యాహ్నభోజనంలో రాగి సంగటి, ఆకుకూర పప్పు, కాలీప్లవర్ కూర, పెరుగన్నం తీసుకున్నారు. రాగిసంగటి రెండు గరిటెలు, పప్పు కూరలు రెండేసి గరిటేలు తిన్నారు. రాత్రి భోజనంలో ఉప్మా, పండ్లు తీసుకున్నారు. రాత్రి భోజనంలో ఒక రోజు ఉప్మా తీసుకుంటే మరోరోజు పొంగల్ తీసుకుంటారట. అంతేకాకుండా పండ్లు తింటారట. బాబు వంట కోసం చిన్న బస్సు సిద్దం చేశారు. ఆయన వంట మనిషి సుధాకర్ అందులోనే ఎప్పటికప్పుడు భోజనం తయారు చేస్తారు. చంద్రబాబు మధ్య మధ్యలో కీర, బీట్ రూట్ రసాలు: అల్పాహారానికి , లంచ్ కు మధ్య పాదయాత్రలో ఆయన బీట్ రూట్ రసం, కీర రసం తీసుకుంటున్నారు. మధ్యాహ్నభోజనం ఆలస్యం అయితే వీటినే మరో గ్లాసు ఎక్కువ తాగుతున్నారు. ఇంకోవైపు ఉదయం, సాయంత్రం ఒక గ్లాసు మజ్జిగ తీసుకుంటున్నారు. మరోవైపు గోరు వెచ్చని నీళ్లు తాగుతున్నారు. పుదీనా, తులసి ఆకులు వేసి కాచిన నీటినే ఆయన దాహం అయినప్పుడు మంచినీళ్లలా తాగుతున్నారు. లోకేష్ కు ఇదే భోజనం : మరోవైపు లోకేష్ కూడా ఈ రెండ్రోజుల పాటు తండ్రితో పాటు ఇదే భోజనం తింటున్నారు. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకూ తండ్రి మెనూనే తానూ తీసుకున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్రలో తన సహజ శైలికి భిన్నంగా ముందుకు సాగుతున్నారు. చిరునవ్వులు చిందిస్తూ, ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుని వెంటనే స్పందిస్తున్నారు. ఎన్ని బాధలైనా ఓర్చుకొని ప్రజల బాధల్ని తీరుస్తానని హామీలిస్తున్నారు. సెక్యూరిటీని కూడా దూరంగా ఉంచి తెలుగు తమ్ముళ్లను ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటున్నారు.అనంతపురం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు వస్తున్నా.. మీకోసం పాదయాత్ర కొనసాగుతోంది. యాత్రలో భాగంగా ఆయన కోళ్లకుంట, గొల్లపల్లిలో ప్రజలతో ముఖాముఖీ నిర్వహించారు. పేదవారికి ఆర్థిక స్వాతంత్ర్యం, రాజకీయల్లో అన్ని కులాలకు సమన్యాయం ఇవ్వాలన్నారు. టీడీపీ హయాంలో ఎక్కడైనా ఒకటి రెండు తప్పులు జరిగి ఉంటే వాటిని సరిదిద్దుకుని మంచి పాలన అందిస్తామని చంద్రబాబు చెప్పారు. టీడీపీ హయాంలో ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేశామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకుంటోందని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల మనోభావాలు, వారి ఆవేదనలను నేరుగా తెలుసుకుని ఆదుకునేందుకే పాదయాత్ర చేపట్టినట్టు చెప్పారు. ఇక చంద్రబాబు అభీష్టం మేరకు సెక్యూరిటీ కమెండోలు దూరంగా ఉంటూనే ఆయనకు భద్రత కల్పిస్తున్నారు. దీంతో ప్రజలు అతి దగ్గర నుంచి చంద్రబాబును కలుసుకుని తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు. విద్యుత్ సమస్య అధికంగా ఉందనీ, ప్రభుత్వం ఇచ్చే ఫించను సరిపోవడం లేదని చంద్రబాబు ఎదుట మహిళలు తమ సమస్యలు ఏకరవు పెడుతున్నారు. ఖాళీ బిందెలు ప్రదర్శించి నీటి సమస్యను ఆయనకు వివరిస్తున్నారు.మరోవైపు బాబు యాత్రలో కుటుంబ సభ్యులూ పాలుపంచుకొంటున్నారు. ప్రజాక్షేమంకోసం మొదటిసారిగా తెరపైకి వచ్చిన నారా లోకేష్ జనంతో కలిసి తన తండ్రి ప్రసంగాలను ఆసక్తిగా వింటూ అందర్నీ ఆక్టటుకుంటున్నారు. పార్టీలో కార్యకర్తగా పనిచేసేందుకు జనం ముందుకు వచ్చానని చెబుతూ పార్టీ క్యాడర్ నూ, జనాన్ని ఉత్సాహపరుస్తున్నారు. మొత్తంమీద మీకోసం వస్తున్నా పాదయాత్రకు వెల్లువెత్తుతున్న జన స్పందన చంద్రబాబు ఉత్సాహాన్ని ద్విగుణీకృతం చేస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more