తెలంగాణ ప్రాంత మంత్రులం అందరం కలిసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ త్వరలో ఢిల్లీకి వెళ్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి అన్నారు. తెలంగాణను వెంటనే పరిష్కరించాలని కోరుతూ.. తాము న్యూఢిల్లీలో కోర్ కమిటీ సభ్యులను కలుస్తామని, వారితో చర్చల అనంతరం పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలుస్తామని చెప్పారు. ఉమ్మడి నిర్ణయాలతో ఢిల్లీ పెద్దల పైన ఒత్తిడి తీసుకు రావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ ఐక్య కార్యాచరణ సమితి విద్యార్థుల వలే తాను కూడా తెలంగాణనే కోరుకుంటున్నానని చెప్పారు. తన రాజీనామా కోరే హక్కు ఎవరికీ లేదన్నారు. రాజీనామా చేస్తే తెలంగాణ వస్తుందంటే అందుకు సిద్ధమే అన్నారు. కాగా జానా రెడ్డి ఒక్కరోజులో మాట మార్చినట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ కవాతుపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారంటూ.. ఆయన తాము పదవులు వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్న వ్యాఖ్యలు చేశారు. కానీ సోమవారం మాత్రం రాజీనామాలతో తెలంగాణ వస్తుందా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడం కష్టమే తెలంగాణలో పరిస్థితులు ఇలాగే ఉంటే ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడం కష్టమేనని తెలంగాణ ప్రాంత ఎంపీలు అభిప్రాయపడ్డారు.
భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఎంపీలు తొలుత కె కేశవరావు ఇంట్లో, ఆ తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఇంట్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించారు. తెలంగాణ మంత్రులు రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలన్న ఐక్య కార్యాచరణ సమితి డిమాండ్ న్యాయమైనదేనని వారు అన్నారు. రాష్ట్ర విభజన బాధ్యత మంత్రులదే అన్నారు. తెలంగాణను కోరుతూ అధిష్టానానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి ఓ లేఖ రాయాలని నిర్ణయించుకున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే పార్టీ ఉనికి తెలంగాణలో కష్టమే అని వారు అన్నారు. రోజు రోజుకు ప్రభుత్వంపై గౌరవం తగ్గిపోతోందన్నారు. విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్, ఏలూరు ఎంపీ కావూరి సాంబశివ రావుల తీరు బాగా లేదని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more