తెలంగాణ ఇస్తే ప్రభుత్వాన్ని పడగొడతామని కాంగ్రెస్‌ను బ్లాక్‌మెయిల్ చేస్తూ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్న కేవీపీ, కావూరి, లగడపాటి వంటి నేతలను బట్టలూడదీసి తరిమికొడితేనే తెలంగాణ వస్తుందని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీగౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీమాంధ్రకు చెందిన 10మంది ఎంపీలు కేవీపీ నాయకత్వంలో కేంద్రప్రభుత్వాన్ని బెదిరించారని, ఎమ్మెల్యేలు కూడా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పడగొడతామని బ్లాక్‌మెయిల్ చేయడం వల్లే తెలంగాణ ఆగిందని చెప్పారు. బెదిరింపులకు దిగి తెలంగాణను అడ్డుకున్న వారిని హైదరాబాద్‌లో తిరగనివ్వకుండా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఆయా నాయకుల ఆస్తులపై మార్చ్ నిర్వహించాలని, అప్పుడే వారు బెదిరింపులకు దిగకుండా తప్పుకొంటారని యాష్కీ స్పష్టం చేశారు. ఇకనైనా వారు పద్ధతి మార్చుకోకపోతే తెలంగాణలో ఉన్న వారి వ్యాపారాలపై ప్రత్యక్షదాడులు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. తెలంగాణ మార్చ్‌కు మద్దతు తెలుపుతున్నామని, తెలంగాణ ఇవ్వకపోతే పార్టీ నుంచి బయటికి వెళ్లి పోరాటం చేస్తానని ప్రకటించారు.
(And get your daily news straight to your inbox)
Sep 26 | డీఎంకె పార్టీ అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, యూపీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామి అయిన కరుణానిధి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పై కరుణ చూపలేదు. యూపీఏ ప్రభుత్వంలో రెండు కేబినెట్ పదవులు, కొన్ని సహాయ... Read more
Sep 22 | నవయుగ వైతాళికుడు, తెలుగు సాహిత్యంతో జాతిని మేల్కొలిపిన మహాకవి గురజాడ అప్పరావుకు విశాఖలో ఆదరణ కరువైంది. రాష్ట్రవ్యాప్తంగా మహాకవి 150జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటే..విశాఖలో మాత్రం ఆయన విగ్రహం దిక్కుమొక్కు లేకుండా దర్శనమిస్తోంది... Read more
Sep 18 | భారత టెన్నీస్ క్రీడాకారుడు మహేశ్ భూపతి ఆలిండియా టెన్నీస్ అసోసియేషన్(ఏఐటీఏ)పై ఎదురుదాడికి దిగారు. ఏఐటీఏ సభ్యులందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏఐటీఏ యువకులను ప్రోత్సహించడం లేదని ఆరోపించారు. ఏఐటీఏ తన అధికారాన్ని దుర్వినియోగం... Read more
Sep 18 | ఆఫ్ఘనిస్థాన్‑లో బ్రిటన్ రాకుమారుడు హ్యారీని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆప్ఘనిస్థాన్‑లో యువరాజు హ్యారీ ఉన్న బాస్టన్ శిబిరంపై తాలిబన్లు వరుసగా దాడులు జరిపారు. మొన్నటి దాడిలో అమెరికాకు చెందిన ఇద్దరు మైనర్లు మృతి చెందారు.... Read more
Sep 18 | రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా గందరగోళంగా ప్రారంభమైంది. రెండో రోజు పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలు స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. వెంటనే తెలంగాణా తీర్మానం చేయాలనీ టీఆర్‌ఎస్ నాయకులు స్పీకర్... Read more