లేహ్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యోమా ఉప జిల్లాలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లో లేహ్ ప్రాంతంలోని సైనిక శిబిరంలో ఓ ఆర్డర్లీ జవాన్‌ను మేజర్ చితకబాదిన ఘటన.. చినికి చినికి పెద్ద దుమారం రేపింది. సైనిక అధికారులకు, జవాన్లకు మధ్య పెద్ద ఘర్షణ చోటుచేసుకుంది. సైనికులు ఆయుధాగారాన్ని తమ స్వాధీనంలోకి తీసుకునేపరిస్థితికి దారితీసినట్లు సమాచారం. దీనిపై సైన్యం ‘కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ’కి ఆదేశించింది. ఘర్షణపై రక్షణ శాఖ ఇప్పటికే నివేదిక కోరింది. అక్కడ ‘226 ఫీల్డ్ రెజిమెంట్’ కాల్పుల ప్రాక్టీస్ చేస్తోంది. అందులో ఓ ఆర్డర్లీ జవాను తనతో తప్పుగా ప్రవర్తించాడంటూ ఓ మేజర్ అతడిని తీవ్రంగా చితకబాదినట్లు అధికార వర్గాల సమాచారం. బాధితుడికి వైద్య సాయం అందించడానికి కూడా ఆ మేజర్ అనుమతించకపోవడంతో అది సహచరులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఈ విషయం సమీపంలోనే ఉన్న కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ కదాంకు తెలిసి తక్షణమే అక్కడికి వచ్చిన ఆయన.. వైద్య సాయం నిరాకరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ మేజర్‌ను బహిరంగంగా మందలించారు.
తనను బహిరంగంగా తిట్టడంతో రెచ్చిపోయిన మేజర్, మరో ఐదుగురు అధికారులు కలిసి కల్నల్ కదాంపై జవాన్ల ఎదుటే దాడికి దిగారు. దీంతో కోపోద్రిక్తులైన జవాన్లు.. ఆ అధికారులందర్నీ చితగ్గొట్టారు. గాయపడిన కమాండింగ్ ఆఫీసర్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ వెంటనే.. ఘర్షణ సమయంలో పారిపోయిన మేజర్ ర్యాంక్ అధికారుల కోసం దాదాపు 50 మంది జవాన్లు గాలింపు ప్రారంభించారు. ఇద్దరు సమీపంలోని సైనిక శిబిరంలో దొరగ్గా.. వారిని మళ్లీ కొట్టడం మొదలుపెట్టారు. ఇంతలో స్థానిక పోలీసులు వచ్చి వారిని కాపాడారు. మిగతా ముగ్గురు మేజర్ ర్యాంక్ అధికారులు సమీపంలోని శిబిరాల్లో ఎక్కడో దాక్కొని ఉంటారని భావిస్తున్నారు. జవాన్లు ఆయుధాగారాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. లేహ్ స్థావరంగా ఉన్న 14 కార్ప్స్ సీనియర్ అధికారులు తక్షణమే సంఘటనా స్థలానికి వచ్చి.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మూడో ఇన్‌ఫాంట్రీకి చెందిన జనరల్ ఆఫీసర్ ఇన్ కమాండ్ ఏఎల్ చౌహాన్.. జవాన్లతో చర్చలు జరిపి.. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. దీనిపై ఢిల్లీలోని సైనిక ప్రధాన కార్యాలయాన్ని విలేకరులు సంప్రదించగా.. పరిపాలనాపరమైన కారణాల వల్ల ఫిరంగిదళంలో కొంత ఘర్షణ జరిగిందని పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more