Onions Reduce Blood Sugar Levels, Study Reveals మధుమేహానికి చెక్ పెట్టే ఉల్లిపాయలు.. తాజా పరిశోధనలు

Diabetes diet onion may help manage blood sugar levels expert suggests

blood sugar levels and onions, onion and diabetes benefits, diabetes symptoms, high blood sugar signs, onions for diabetes, Onions Diabetes, High Blood Sugar Levels, control high blood sugar, High blood sugar, Onions Reduce Blood Sugar Levels

Diet plays an essential role in managing blood sugar levels. People who are diagnosed with diabetes should make sure that their diet, weight and lifestyle are in check. Experts believe a healthy diet rich in maximum nutrients, protein, low fat, calories can help in avoiding health complications associated with diabetes.

మధుమేహానికి చెక్ పెట్టే ఉల్లిపాయలు.. తాజా పరిశోధనలో వెల్లడి

Posted: 10/03/2022 06:31 PM IST
Diabetes diet onion may help manage blood sugar levels expert suggests

కొన్నేళ్లుగా మారిన జీవన శైలి, ఆహార అలవాట్లు, కాలుష్యం వంటి వాటి వల్ల మధుమేహం బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే హృద్రోగ సమస్యలో భారత్ కేంద్రంగా మారిందని కార్డియాలజిస్టులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పెరుగుతున్న మధుమేహం వ్యాధిగ్రస్తుల సంఖ్య కూడా కలవరపాటుకు గురిచేస్తోంది. అటు రక్తపోటు పెరిగినా.. ఇటు మధుమేహ స్థాయిలు ఒక్కసారి పెరిగినా.. ఇక జీవితాంతం జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కాకతప్పవు. అయితే అటు హృద్రోగం కానీ లేక మదుమేహం కానీ వచ్చిందంటే ఇక జీవిత కాలం మెడికేషన్ కూడా తప్పనిసరి.

అంతేకాదు మరీముఖ్యంగా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా మన రక్తంలో చక్కెర స్థాయిలను, రక్త పోటును నియంత్రించడంలో తోడ్పడుతాయి. అలా ఉల్లిపాయలు మధుమేహం నియంత్రణకు తోడ్పడుతాయని తాజాగా శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో గుర్తించారు.  అమెరికాలోని శాన్ డియాగోలో ఇటీవల జరిగిన 97వ ది ఎండోక్రైన్ సొసైటీ వార్షిక సమావేశంలో శాస్త్రవేత్తలు ఉల్లిపాయలు, మధుమేహంపై చేసిన పరిశోధన పత్రాన్ని సమర్పించారు.

ఉల్లిలోని ‘అల్లియమ్ సెపా’ అనే పదార్థం మన రక్తంలో చక్కెర స్థాయిలు 50 శాతం వరకు తగ్గించేందుకు తోడ్పడుతున్నట్టు తాము గుర్తించినట్టు వెల్లడించారు. అంతేగాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచడంలోనూ పనిచేస్తున్నట్టు తెలిపారు. ఈ అంశానికి సంబంధించి ఎలుకలపై పరిశోధన చేశామని శాస్త్రవేత్తలు వివరించారు. మొత్తం నాలుగు గ్రూపులుగా ఎలుకలను తీసుకున్నామని.. అందులో ఒక గ్రూపు మధుమేహం లేని ఎలుకలు అని చెప్పారు. మధుమేహం ఉన్న మూడు గ్రూపుల్లోని ఎలుకలకు.. ఉల్లి నుంచి తీసిన పదార్థాలను వేర్వేరు డోసుల్లో అందించి పరిశీలించామని తెలిపారు.

మధుమేహం ఉన్న మూడు గ్రూపుల్లోని ఎలుకల్లో.. ‘అల్లియమ్ సెపా’ డోసు ఎక్కువగా ఇచ్చిన గ్రూపులో రక్తంలో చక్కెర స్థాయిలు బాగా నియంత్రణలో ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. అదే సమయంలో వాటిలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గాయని వివరించారు. ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల మరో లాభం కూడా ఉందని.. వాటి వల్ల పెద్దగా కెలోరీలు కూడా అందకపోవడం వల్ల అంతిమంగా శరీరంలో గ్లూకోజ్ శాతం పెరిగే పరిస్థితి కూడా ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి సంబంధించి మనుషులపైనా ప్రయోగాలు చేయాల్సి ఉందని వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles