Congress MLA sits on Jal Satyagraha in Jharkhand బురద నీటిలో మహిళా ఎమ్మెల్యే స్నానం.. రోడ్ల దుస్థితిపై నిరసన

Woman mla takes bath in rain water filled pothole at jharkhands godda to protest

National Highway, godda, Congress MLA, Mahagama MLA, Deepika Pandey Singh, potholes in national highway, congress MLA mud water bath, poor condition of roads, Jal Andholan, National Highway repairs, congress mla protest, congress deepika pandey mud water bath video, Godda MP Nishikant Dubey, chief minister hemant soren, Jharkhand, Politics

A Jharkhand Congress MLA Deepika Pandey Singh took bath in pothole filled with rain water at Godda district in Jharkhand to protest against poor condition of National Highway in Godda. She demanded immediate repair of the road. Deepika Pandey Singh is the legislator from Mahagama. She poured muddy water all over her and vowed that she would not budge unless repair work of the concerned road is done to fill many big potholes.

ITEMVIDEOS: నడిరోడ్డుపై బురద నీటిలో మహిళా ఎమ్మెల్యే స్నానం.. రోడ్ల దుస్థితిపై నిరసన

Posted: 09/22/2022 11:53 AM IST
Woman mla takes bath in rain water filled pothole at jharkhands godda to protest

జార్ఖండ్‌లో జాతీయ రహదారి దుస్థితిపై మహిళా ఎమ్మెల్యే వినూత్నంగా నిరసన తెలిపారు. మహాగమకు చెందిన శాసనసభ్యురాలు తన నియోజకవర్గంలోని జాతీయ రహదారిపై నెలకొన్న పెద్ద పెద్ద గుంతలతో వాహనదారులు, పాదచారులు అనేక అవస్థలు పడుతున్నారని అరోపిస్తూ అమె ఏకంగా జలదీక్ష పేరుతో నడిరోడ్డుపై నిరసనకు దిగారు. జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతలో నిలిచిన బురద నీటితో స్నానం చేశారు. జార్ఖండ్‌ ప్రభుత్వంలో భాగమైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దీపికా పాండే సింగ్ బుధవారం గొడ్డా జిల్లాలో గుంతల మయంగా ఉన్న జాతీయ రహదారిపై ఉన్న బురద నీటితో స్నానం చేశారు.

ఆ రోడ్డు దుస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె వెంటనే బాగు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అప్పటివరకు తన దీక్షను ఆపబోనని తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా తాను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం మధ్య జరిగే పోరులో జోక్యం చేసుకోదలచుకోనని అన్నారు. ఇది NH-133. 2022 మేలో ఈ రహదారిని విస్తరించే బాధ్యతను చేపట్టిన అధికారులు.. పనులు చేపట్టలేదని అన్నారు. అయితే మరమ్మతులకు కేంద్రం నిధులు ఇవ్వలేదని కారణం తెలిసిందన్నారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున దీనిని పూర్తి చేయాలని ముఖ్యమంత్రిని అభ్యర్థిస్తున్నాను’ అని ఆమె అన్నారు.

బీజేపీ గొడ్డా ఎంపీ నిషికాంత్ దూబేను కూడా ఆమె విమర్శించారు. ఇక్కడకు వచ్చి కూర్చొంటే ప్రజల బాధలు అర్థమవుతాయన్నారు. కాగా, సీఎం సోరెన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దీపికా పాండే సింగ్ నిరసన తెలిపారని బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే ట్వీట్‌ చేశారు. ఈ రోడ్డు కోసం కేంద్రం ఆరు నెలల కిందట రూ.75 కోట్లు కేటాయించిందని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వలేదని ఎమ్మెల్యే దీపికా పాండే ఆరోపించారు. బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే అబాద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. మరోవైపు ఆ ఎమ్మెల్యే బురద నీటితో స్నానం చేసి నిరసన తెలిపిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles