YS Viveka murder case: Obstacles delaying the case investigation వైఎస్ వివేకా హత్యకేసు దర్యాప్తుకు నిందితుల ఆటంకాలు

Ys viveka murder case asg appeals high court not to entertain cases on io

CBI, murder case, Vivekananda, YS Rajasekhara Reddy, YS JaganMohan Reddy, Narreddy Rajasekhar Reddy, YS Pratap Reddy, Y.S. Vivekananda Reddy, Pulivendula, Kadapa, Y.S. Avinash Reddy, YCP state secretary, Devireddy SivaShanker Reddy, Rajashekar reddy, TDP MLC BTech Ravi, Raghunatha Reddy, Sunil Yadav, Rangaiah, servent, Erra Gangireddy​, Jagadishwar Reddy, Gangadhar, CBI, YS Vivekananda Reddy murder case, Sunitha Reddy, Pulivendula, kadapa, andhra pradesh, crime, Politics

The Assistant Solicitor General ASG has appealed the Andhra Pradesh high court not to entertain the cases filled against CBI officials in lower courts by the accused. If the situation worsens further the case investigation will be delayed more by these sought of obstacles.

వైఎస్ వివేకా హత్యకేసు దర్యాప్తు అధికారులపై కేసులు వేస్తున్నారు: హైకోర్టుకు సీబిఐ

Posted: 09/13/2022 09:01 PM IST
Ys viveka murder case asg appeals high court not to entertain cases on io

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్యకేసులోని నిందితులకు విచారణకు పిలిస్తే.. దర్యాప్తు అధికారులపైనే ప్రైవేటు కేసులు వేస్తూ.. దర్యాప్తును అడ్డుకుంటున్నారని.. కావున ఈ కేసులను కొట్టివేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాలని సిబిఐ తరపున సహాయ సొలిసిటర్ జనరల్ హరినాథ్ హైకోర్టుకు విన్నవించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో దర్యాప్తు అధికారి సీబిఐ ఏఎస్పీ రామ్ సింగ్ పై దిగువ కోర్టుల్లో నిందితులు ప్రైవేటు పిర్యాదులు దాఖలు చేశారని ఆయన రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

పులివెందులకు చెందిన వెంకట కృష్ణారెడ్డి, అనంతపురం జిల్లా యాడికి వాసి గంగాధర్‌రెడ్డిలు.. సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌పై దిగువ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదులు వేశారన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వివేకా హత్యకేసు దర్యాప్తు ముందకు సాగడం కష్టమని ఆయన న్యాయస్థానానికి తెలిపారు. వీటిని పరిగణనలోకి తీసుకొని గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు ఆధారంగా ఏఎస్పీ రామ్‌సింగ్‌పై ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని వేసిన వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని కోరారు. దీంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.జయసూర్య విచారణను ఈ నెల 22కి వాయిదా వేశారు.

వివేకా హత్య కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పాలని తనను సీబీఐ ఏఎస్పీ బెదిరిస్తున్నారంటూ గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి కడప ఫస్ట్‌క్లాస్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌/ స్పెషల్‌ మొబైల్‌ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసి, నివేదిక సమర్పించాలని మేజిస్ట్రేట్‌ కోర్టు దాన్ని ఠాణాకు రిఫర్‌ చేసింది. రిమ్స్‌ ఠాణా పోలీసులు సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌పై ఐపీసీ సెక్షన్‌ 195ఏ, 323, 506, రెడ్‌విత్‌ 34 కింద కేసు నమోదు చేశారు. దీన్ని కొట్టేయాలని రామ్‌సింగ్‌ హైకోర్టును ఆశ్రయించగా... ఈ కేసులో తదుపరి చర్యలన్నింటిని నిలిపేస్తూ ఫిబ్రవరిలో న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. సోమవారం ఈ వ్యాజ్యం హైకోర్టులో విచారణకు వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles