IRCTC's tourism package to Kerala from Hyderabad హైదరాబాద్ టు కేరళ - టూర్ తేదీ, ధరలు ఇవే

Irctc unveils kerala hills and waters tourist packages to kerala fron hyderabad

irctc tourism, irctc tourism latest plans, kerala hyderabad tour, hyd kerala irctc tour, Kerala Hills and water irctc tour, hyderabad to kerala, IRCTC Kerala Hyderabad Tour, IRCTC kerala Tour, IRCTC tourism, IRCTC tour package from Hyderabad, IRCTC tour package from hyderabad, hyderabad to Ernakulam, irctc, hyderabad to kerala, hyderabad to alleppey, hyderabad to alleppey, alleppey, ernakulam, kerala tour

IRCTC tourism announced another Kerala Tour from Hyderabad to Ernakulam via alleppey, after Wayanand from Hyderbad, Now Kerala Hills and Water Tour package from Hyderabad Know package details

కేరళ హీల్స్ అండ్ వాటర్స్: హైదరాబాద్ టు కేరళ - టూర్ తేదీ, ధరలు ఇవే

Posted: 09/06/2022 06:39 PM IST
Irctc unveils kerala hills and waters tourist packages to kerala fron hyderabad

వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా ప్రకృతి ప్రేమికుల కోసం హైదరాబాద్ నుంచి కేరళకు మరో ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. కేరళ రాష్ట్రంలోని వయనాడ్ అందాలను వీక్షించేందుకు ఇప్పటికే ఒక ప్యాకేజీని ప్రకృతి ప్రేమికుల చెంతకు తెచ్చిన ఐఆర్సీటీసీ.. తాజాగా దేవుడి సొంత రాష్ట్రం కేరళలోని అందాలను వీక్షించేందుకు పలు ప్రాంతాలను వీక్షించేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది.

కేరళ హిల్స్ అండ్ వాటర్స్ పేరుతో రూపుదిద్దుకున్న ఈ ప్యాకేజీని సరికొత్తగా ఆపరేట్ చేస్తోంది. కేరళను చూడాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ తాజాగా అందుబాటులో ఉంది. కేరళలోని అందాలను చూసి.. తెగ ఎంజాయ్ చేయోచ్చు. హైదరాబాద్ టూ కేరళ వరకూ ఈ ప్యాకేజీ ఉంది. మున్నార్, అలెప్పీలాంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. రైలులో తీసుకెళ్లి తీసుకొస్తారు. ఫుడ్, హోటల్, ట్రావెల్స్ ఇన్సూరెన్స్ లాంటివి ఈ ప్యాకేజీలో ఉంటాయి. 5 రాత్రులు, 6 రోజులు ఈ టూర్ ఉంటుంది. సెప్టెంబర్ 13, 2022న ప్యాకేజీ అందుబాటులో ఉంది.

Day 01 : శబరి ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 12:20 గంటలకు బయలుదేరుతుంది. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.

Day 2 : 12:55 గంటలకు ఎర్నాకులం టౌన్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. మున్నార్‌కు వెళ్లి.. హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు. మున్నార్ టౌన్‌లో సాయంత్రం విశ్రాంతి తీసుకుంటారు. రాత్రి బస చేస్తారు.

Day 3 : ఉదయం ఎరవికులం నేషనల్ పార్క్ సందర్శన ఉంటుంది. తర్వాత టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యామ్ అండ్ ఎకో-పాయింట్ సందర్శిస్తారు. మున్నార్‌లో రాత్రి బస చేస్తారు.

Day 4 : హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. అలెప్పీకి బయలుదేరుతారు. అలెప్పీలో హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు. బ్యాక్‌వాటర్‌ అందాలను సాయంత్ర వరకూ ఎంజాయ్ చేయోచ్చు. రాత్రిపూట అలెప్పీలో బస చేస్తారు.

Day 5 : హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. ఎర్నాకులానికి బయలుదేరాలి శబరి ఎక్స్‌ప్రెస్ 11:20 గంటలకు రైల్వే స్టేషన్‌లో ఉంటుంది.

Day 6 : 12:20 గంటలకు రైలు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

సింగిల్ ఆక్యూపెన్సీ ధర రూ. 29830గా ఉంది. డబుల్ ఆక్యూపెన్సీకి రూ.17240 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.14300గా ఉంది. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, వీసా ఛార్జీలు, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ ఉంటాయి. స్టాండర్డ్ క్లాసులో అనగా, ఈ పర్యటనలో స్లీపర్ క్లాస్ లో సింగిల్ ఆక్సుపెన్సీకి 27120 ధర నిర్ణయించగా, డబుల్ ఆక్యుపెన్సీకి 14530, త్రిపుల్ ఆక్యుపెన్సీకి 11600 ధరను ఐఆర్సీటీసీ నిర్ణయించింది. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ అన్ని పోందుపర్చి ఉంటాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles