Arya Samaj certificate does not prove marriage: Allahabad HC ప్రేమికులారా.. మీకు తెలుసా.? ఆర్య సమాజ్ కు షాకిచ్చిన హైకోర్టు..

Allahabad high court questions validity of arya samaj marriage certificates

Marriage Certificates, Arya Sama, Allahabad High Court, Justice Saurabh Shyam Shamshery, misusing beliefs, habeas corpus petition, proper solemnisation of marriages, Arya samaj marriage cetificates, Supreme Court, Uttar Pradesh

Taking serious note of frequent use of marriage certificates issued by the Arya Samaj societies, the Allahabad High Court has said that they are misusing beliefs in organising marriages without considering the genuineness of documents. Hearing a habeas corpus petition, the court observed that Arya Samaj societies were issuing marriage certificates without proper solemnisation of marriages, and added that marriage could not be proved only on the basis of this certificate.

ప్రేమికులారా.. మీకు తెలుసా.? ఆర్య సమాజ్ కు షాకిచ్చిన హైకోర్టు..

Posted: 09/06/2022 05:37 PM IST
Allahabad high court questions validity of arya samaj marriage certificates

కులాంతర, మతాంతర వివాహాలతో పాటు పెద్దలను ఎదురించి జరుగుతున్న వివాహాల్లోనూ గత కొన్నేళ్లుగా ఒకనాటి యువతతో పాటు ఇప్పటి యువత వరకు నిత్యనూతనంగా సేవలు అందిస్తోన్న సంస్థ ఆర్య సమాజ్. ఎక్కడో ఒక్క సంస్థగా ఉద్భవించి.. ప్రతీ రాష్ట్రంతో పాటు ఇప్పుడు నగరాలు, పట్టణాలకు కూడా విస్తరించి.. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ సేవలు అందిస్తున్న ఈ సంస్థ ఇన్నాళ్ల ఏలుబడి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవల దేశంలో వివాహాల రిజిస్ట్రేషన్ కోసం ఒక వ్యవస్థ ఉండగా, దానిని కాదని ఆర్యసమాజ్ వివాహాలు చేయడం ఏంటీ.. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీచేయడమేంటీ అన్న ప్రశ్నించిన విషయం తెలిసిందే.

ఇక అంతటితో ఆగకుండా అసలు ఆర్యసమాజ్ ప్రామాణికత ఏమిటీ.. అన్న విషయమై కూడా ప్రశ్నలను సంధించింది. దీంతో ఆర్యసమాజ్ చేసిన పెళ్లిళ్లు చెల్లవని కూడా అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఆర్యసమాజ్ లో పెళ్లిళ్లు చేసుకున్నంత మాత్రం చేత యువతీ యువకులను భార్యభర్తలుగా భావించలేమని కూడా తేల్చిచెప్పింది. ఇక ఇదే సమయంలో అల‌హాబాద్ హైకోర్టు కూడా రమారమి అదే తరహాలో ఆర్యసమాజ్ జారీ చేసే వివాహ ధృవీకరణ పత్రాలపై కీల‌క తీర్పును ఇచ్చింది. ఓ కేసుకు సంబంధించిన కేసులో పెళ్లి కోసం ఆర్య స‌మాజ్ ఇచ్చే స‌ర్టిఫికేట్ చ‌ట్ట‌ప‌రంగా చెల్ల‌ద‌ని హైకోర్టు తెలిపింది.

పెళ్లిళ్లు క‌చ్చితంగా రిజిస్ట‌ర్ కావాల‌న్న నిర్ణ‌యాన్ని కోర్టు వెల్ల‌డించింది. హెబియ‌స్ కార్ప‌స్ పిటిష‌న్‌ను ప‌రిశీలించిన జ‌స్టిస్ సౌర‌బ్ శ్యామ్ శ్యామ్‌శేరి తీర్పునిస్తూ.. ఆర్య స‌మాజ్ ఇచ్చే మ్యారేజ్ స‌ర్టిఫికేట్ల‌తో కోర్టుల‌కు భారీగా ద‌ర‌ఖాస్తులు వ‌స్తున్నాయ‌ని, కానీ వివిధ కేసుల్లో ఆ స‌ర్టిఫికేట్ల‌ను కోర్టులు కూడా ప్ర‌శ్నిస్తూనే ఉన్నాయ‌న్నారు. పెళ్లిళ్ల నిర్వ‌హ‌ణ‌లో ఆర్య స‌మాజ్ వ్య‌వ‌హార‌శైలి స‌రిగా లేద‌ని, డాక్యుమెంట్ల‌కు విలువ ఇవ్వ‌డం లేద‌ని కోర్టు పేర్కొన్న‌ది. బోలా సింగ్ అనే వ్య‌క్తి త‌న పెళ్లి నిరూపించుకునేందుకు ఆర్య స‌మాజ్ ఇచ్చిన స‌ర్టిఫికేట్‌ను స‌మ‌ర్పించారు. కానీ వారి పెళ్లి రిజిస్ట‌ర్ కాలేదు. అయితే కేవ‌లం స‌ర్టిఫికేట్ ఆధారంగా పెళ్లిని ద్రువీక‌రించ‌లేమ‌ని కోర్టు తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles