Indias first cervical cancer vaccine to be launched దేశంలో తొలి గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ విడుదల

India s first vaccine against cervical cancer to be launched today

Cervical cancer vaccine, Cervical cancer protection, cervical cancer, Serum Institute, Adar Pooawalla, Drugs Controller General of India (DCGI), cancer protection, what is cervical cancer,Cervical cancer vaccine, Cervical cancer protection, Cervical cancer, Serum Institute, cancer protection, cancer vaccine, Indian Daughters, Health, Medicine

In a landmark achievement in India's medical science, the first indigenously developed Quadrivalent Human Papillomavirus vaccine (qHPV) against Cervical Cancer is being launched in the capital today (September 1, 2022). The Drugs Controller General of India (DCGI) had last month granted market authorisation to the Serum Institute of India (SII) to manufacture an indigenously-developed vaccine against cervical cancer.

దేశంలో తొలి గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ విడుదల

Posted: 09/01/2022 04:32 PM IST
India s first vaccine against cervical cancer to be launched today

భారత బాలికలకు గుడ్ న్యూస్ అందించింది. దాదాపుగా దేశంలోని అందరు బాలికలకు ఉపశమనం కల్పించే వార్త ఇది. మన దేశాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారుల్లో క్యాన్సర్ ఒకటి. ఇటీవలి కాలంలో భారత్ లో క్యాన్సర్ బాధితులు పెరిగిపోతున్నారు. మహిళల విషయానికి వస్తే గర్భాశయ క్యాన్సర్ ఎంతో మందిని ఇబ్బంది పెడుతోంది. ఈ క్రమంలో, గర్భాశయ క్యాన్సర్ కు చెక్ పెట్టేందుకు మన దేశంలో వ్యాక్సిన్ విడుదలయింది. దేశంలో తొలిసారి గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ ను విడుదల చేశారు. ఢిల్లీలోని ఐఐసీలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ ఈరోజు ఈ వ్యాక్సిన్ ను విడుదల చేశారు. ఈ వ్యాక్సిన్ ను దేశీయంగా అభివృద్ధి చేశారు.

9 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు ఉన్న బాలికలకు ఈ వ్యాక్సిన్ వేస్తారు. ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ ను జాతీయ ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా కోవిడ్ వర్కింగ్ గ్రూప్, నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ ఛైర్మన్ ఎన్.కే.అరోరా మాట్లాడుతూ... 90 శాతం వరకు గర్భాశయ క్యాన్సర్ నిర్దిష్టమైన వైరస్ వల్ల వస్తుందని.. ఈ వ్యాక్సిన్ ఆ వైరస్ కు వ్యతిరేకంగా పని చేస్తుందని చెప్పారు. ఈ వ్యాక్సిన్ ను తయారు చేసే బాధ్యతను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అప్పగించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles