Kerala man’s unique protest against poor roads రోడ్డుపై గోతులు, వర్షపు నీటి ప్రవాహం.. ఎమ్మెల్యేకు షాక్

Mud bath yoga in potholes kerala man s unique protest against poor roads

mud bath, yoga, protest, potholes in kerala, Malappuram area, Hamza Porali, local MLA, UA Latheef, very unique protest, water-logged pothole, washing clothes in muddy water, Kerala, viral video, video viral

A man in the Malappuram area of Kerala protested against the potholes on road in a very unique way. He drew the attention of the authorities by performing yoga and bathing in a water-logged pothole in front of an MLA. A video of the same incident has come to light. The man can be seen taking a bath in a pothole filled with rainwater. He can also be seen washing his clothes in the muddy water.

ITEMVIDEOS: రోడ్డుపై గోతులు, వర్షపు నీటి ప్రవాహం.. ఎమ్మెల్యేకు షాక్

Posted: 08/10/2022 03:45 PM IST
Mud bath yoga in potholes kerala man s unique protest against poor roads

దేశవ్యాప్తంగా వరుణుడు తన ప్రతాపాన్ని చూపడంతో అనేక రాష్ట్రాలు అతలాకులం అయ్యాయి. జనజీవనం స్థంబించింది. రవాణ సదుపాయం తెగిపోయింది. అయితే వర్షం తగ్గిన వెంటనే ఎమర్జెన్సీ డిజార్టర్ సర్వీసెస్ విభాగం అధికారులు ఎక్కడికక్కడ మరమ్మత్తులు చేపడుతున్నారు. అయితే ఈ మరమ్మతులు కాస్తా మరోమారు వర్షం పడగానే ఆ నీటికి కోట్టుకుపోతున్నాయి. ఈ క్రమంలో అనేక రాష్ట్రాల్లోని అనేక రహదారులు చెరువులా మారితున్నాయి..? వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుండటంతో వాహనదారులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కాగా భారీ వర్షాల కారణంగా కేరళలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అసలే కొండలు ప్రాంతం కాబట్టి అనేక చోట్ల కొండచరియలు విరిగిపడి కూడా రహదారులు గొతుల మయంగా తయారయ్యాయి. ఇక వరద నీరు ప్రవహిస్తుండంతో స్థానిక యువకుడు వినూత్న నిరసనకు దిగాడు. మలప్పురం ప్రాంతంలో రహదారులపై భారీగా ఏర్పడిన గోతుల్లో నీరు చేరింది. దీంతో హంజా పొరాలి అనే వ్యక్తి అదే నీటిలో యోగాసనాలు వేశాడు. అదే నీటితో స్నానం చేసి స్థానిక ఎమ్మెల్యేకు పరిస్థితి అర్థమయ్యేలా చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లోకి చేరడంతో వైరల్ అవుతోంది.

తన వస్త్రాలను రహదారిపై నిలిచిన మురికి నీటితోనే ఉతుక్కున్నాడు పొరాలి. స్థానిక ఎమ్మెల్యే లతీఫ్ అక్కడకు చేరుకుని కారు నుంచి కిందకు దిగారు. ఎమ్మెల్యేను చూసిన హంజా పొరాలి నీటిలో ఒంటి కాలిపై నించుని యోగాసనం వేశాడు. ఇటీవలి వర్షాలకు కేరళలో రోడ్లు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. ఎర్నాకులం జిల్లా నెడుంబస్రేలో జాతీయ రహదారిపై గోతి కారణంగా 52 ఏళ్ల వ్యక్తి మరణించారు. దీంతో కేరళ హైకోర్టు కూడా రోడ్ల దుస్థితిపై తీవ్రంగా స్పందించింది. అన్ని రహదారులను వెంటనే మరమ్మతులు చేయాలని జాతీయ రహధారి మంత్రిత్వశాఖను ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles