HC asks Congress leaders to delete tweets on Iranis daughter ‘‘స్మృతి ఇరానీ తనయ అక్రమ బార్ ట్వీట్లను తొలగించండీ’’

Delhi high court asks congress leaders to delete tweets on irani s daughter

Congress Leaders, Jairam Ramesh, Pawan Khera, Netta D’Souza, tweets, defamation case, Delhi High Court, Justice Mini Pushkarna, Union Minister, Smriti Irani, Goa restaurant, Goa, Twitter, summons, fundamental rights, National Politics

The Delhi High Court on Friday directed Congress leaders Jairam Ramesh, Pawan Khera, and Netta D’Souza to immediately delete tweets by them in reference to the Goa restaurant of the daughter of Union Minister Smriti Irani and issued summons to them after Irani filed a defamation suit against them.

‘‘స్మృతి ఇరానీ తనయ అక్రమ బార్ ట్వీట్లను తొలగించండీ’’: ఢిల్లీ హైకోర్టు

Posted: 07/29/2022 03:34 PM IST
Delhi high court asks congress leaders to delete tweets on irani s daughter

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దాఖ‌లు చేసిన ప‌రువు న‌ష్టం కేసులో ముగ్గురు కాంగ్రెస్ నేత‌ల‌కు స‌మ‌న్లు జారీ అయ్యాయి. జైరాం ర‌మేశ్‌, ప‌వ‌న్ ఖేరా, నెత్తా డిసౌజాల‌కు ఇవాళ ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. త‌న‌తో పాటు త‌న కూతురుపై నిరాధార ఆరోప‌ణ‌లు చేశార‌ని, రెండు కోట్ల న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని మంత్రి స్మృతి ఇరానీ త‌న ప‌రువు న‌ష్టం దావాలో డిమాండ్ చేశారు. 18 ఏళ్ల స్మృతి కూతురు గోవాలో అక్ర‌మంగా బార్ నిర్వ‌హిస్తోంద‌ని ముగ్గురు కాంగ్రెస్ నేత‌లు ఆరోపించారు. దానికి సంబంధించిన ట్వీట్లు కూడా చేశారు.

అయితే స్మృతి దావా నేప‌థ్యంలో ఢిల్లీ హైకోర్టు సదరు నేతలకు ఆ ట్వీట్లను తక్షణం తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. 24 గంట‌ల్లోగా ఆ ట్వీట్ల‌ను డిలీట్ చేయాల‌ని ముగ్గురు నేతలు జైరాం ర‌మేశ్‌, ప‌వ‌న్ ఖేరా, నెత్తా డిసౌజాలను ఆదేశించింది. ఒక‌వేళ ఆ ట్వీట్ల‌ను డిలీట్ చేయ‌ని ప‌క్షంలో అప్పుడు ట్విట్ట‌ర్ సంస్థ‌తో ఆ ప‌ని చేయాల్సి వ‌స్తోంద‌ని కోర్టు తెలిపింది. ఫ్రాథమిక సమాచారంతో కేంద్రమంత్రి తనయను లక్ష్యంగా చేసుకుని వాస్తవాలను తెలుసుకోకుండా ఈ అరోపణలను ట్వీట్ చేశారని న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో ప‌రువున‌ష్టం కేసులో ముగ్గురు కాంగ్రెస్ నేత‌లు ఆగ‌స్టు 18వ తేదీన కోర్టు ముందు హాజ‌రుకావాలని ఆదేశించించి ఢిల్లీ హైకోర్టు.

ఇక త‌న కూతురు అక్రమంగా బార్ నిర్వహిస్తోందన్న ఆరోప‌ణ‌లు చేయడంతో పాటు తన కూతురు పరుపు ప్రతిష్టలను దిగజార్చేలా చేసిన ట్వీట్లపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు నేతలు ఎటువంటి ష‌ర‌తులు లేని క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని స్మృతి త‌న లీగ‌ల్ నోటీసులు పేర్కొన్నారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఆదేశాల‌పై కాంగ్రెస్ నేత జ‌య‌రాం ర‌మేశ్ విభిన్నంగా స్పందించారు. కోర్టు ముందు వాస్త‌వాల‌ను ప్ర‌జెంట్ చేస్తామ‌ని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. స్మృతి వేసిన దావాను కోర్టులోనే ఛాలెంజ్ చేస్తామ‌ని జ‌య‌రాం అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles