Droupadi Murmu elected 15th President of India భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము.. భారీ అధిక్యంతో ఎన్నిక

Draupadi murmu first tribal woman to be elected president of india

Droupadi Murmu 15th President of India,Droupadi Murmu ,15th President of India,India President election 2022 ,India’s first tribal President,First tribal woman President,president of india 2022,who is the president of india,new president of india,draupadi murmu,murmu,new president of india 2022,president election results,yashwant sinha,india president

Draupadi Murmu, the new President of India, is the country’s first tribal woman to win the top constitutional post. Murmu, a BJP leader, was NDA’s candidate for Presidential Election 2022 and had a clear edge over her political opponent Yashwant Sinha. Murmu was the former Governor of Jharkhand.

భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము.. భారీ అధిక్యంతో ఎన్నిక

Posted: 07/21/2022 07:34 PM IST
Draupadi murmu first tribal woman to be elected president of india

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము మొత్తం ఓట్లలో 50 శాతం ఓట్ల మార్క్ను దాటేశారు. దీంతో దేశ 15వ రాష్ట్రపతిగా ఆమె బాధ్యతలు స్వీకరించేందుకు రంగం సిద్ధమైంది. గురువారం పార్లమెంట్ భవన్లో రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. మూడో రౌండ్ ముగిసే సమయానికి ద్రౌపది ముర్ముకు 5,77,777 విలువ గల ఓట్లు లభించాయి. ఆమె ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాకు 2,61,062 విలువ గల ఓట్లు వచ్చాయి. `మొత్తం మూడో రౌండ్ వరకు 3,219 (8,38,839 విలువ గల) ఓట్లు లెక్కించాం. వాటిల్లో ద్రౌపది ముర్ముకు 2,161 ఓట్లు (5,77,777) లభించాయి.

ఆమె ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాకు 1,058 ఓట్లు (2,61,062 విలువ గల) ఓట్లు వచ్చాయి` అని రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ తెలిపారు. జార్ఖండ్ మాజీ గవర్నర్.. దేశ తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి కానున్నారు. 17 మంది ఎంపీలు ముర్ముకు క్రాస్ ఓటింగ్ వేశారు. లెక్చరర్, ఫ్రోపెసర్ గా తన కెరీర్ ప్రారంభించిన ఆమె.. 1997లో బీజేపిలో చేరారు. రాయ్ రంగపూర్ నుంచి కౌన్సిలర్ గా గెలిచిన తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన అమె.. అక్కడి నుంచి పాతికేళ్ల తరువాత ఏకంగా దేశంలోనే అత్యున్నత పదవికి ఎన్నిక కాబడింది. పాతికేళ్ల ప్రయాణంలో అమె సాధించిన రాయ్ రంగపూర్ చైర్ పర్సెన్ గా, ఒడిశా ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఝార్ఖండ్ గవర్నర్ గా కూడా పదవులను అధిరోహించారు. ఇక తాజాగా రాష్ట్రపతిగా అమె త్వరలో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles